శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా? | Samsung Z2 with 4G launched at Rs 4,590: Key features and specifications | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?

Published Tue, Aug 23 2016 2:27 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?

శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?

సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టిజెన్తో రన్ అయ్యే మొదటి 4జీ సపోర్టు స్మార్ట్ఫోన్ను దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ జెడ్2 పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ. 4,590గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ లాంచింగ్తో మార్కెట్లో శాంసంగ్ 4జీ స్మార్ట్ఫోన్ల జాబితా 22కు చేరింది. రిలయన్స్ జియో సర్వీసులతో సరసమైన ధరకు ఈ ఫోన్ను నియోగదారులకు ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్ను పూర్తిగా బెంగళూరు టీమ్ డెవలప్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ లాంచింగ్తో ఫీచర్ ఫోన్లను వాడే 550 మిలియన్ యూజర్లను తన సొంతం చేసుకోవాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. వారిని బెటర్ స్మార్ట్ఫోన్ అనుభూతికి అప్గ్రేడ్ చేయాలని యోచిస్తోంది.

జియో యాప్స్, వీడియో కాలింగ్, ఓటీజీ అప్డేట్స్తో ఈ కొత్త ఫోన్ యూజర్లను అలరించనుంది. డేటా అవసరం లేకుండా మొబైల్ బ్యాంకింగ్ వాడుకునేలా మై మనీ ట్రాన్సఫర్ యాప్ను కూడా ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్ను ఇండియాలోని శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అభివృద్ధి చేసింది. 12 భాషలను శాంసంగ్ జెడ్2 సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. బ్లాక్, వైన్ రెడ్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ సోమవారం నుంచి పే టైమ్, శాంసంగ్ ఆఫ్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది.


శాంసంగ్ జడ్2 ఫీచర్లు...
4 అంగుళాల డిస్ప్లే
1.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్
480x800 పిక్సెల్స్ రెజుల్యూషన్
1 జీబీ ర్యామ్
8 జీబీ స్టోరేజ్
128 జీబీ విస్తరణ మెమరీ
టిజెన్ ఓఎస్
5 ఎంపీ వెనుక కెమెరా
0.3 ఎంపీ ముందు కెమెరా
1500 ఎంఏహెచ్ బ్యాటరీ
టిజెన్ ఓఎస్ ఆధారితంగా మొదటి స్మార్ట్ఫోన్ను శాంసంగ్ గతేడాదే మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement