Rs 4
-
రాజన్న క్యాంటీన్ రూ.4కే భోజనం
-
బయటపడిన నల్లధనం రూ.4,900 కోట్లే
న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసిన అనంతరం స్వచ్ఛందంగా నల్లధనం వెల్లడికి మోదీ సర్కారు తీసుకొచ్చిన ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకానికి స్పందన స్వల్పంగానే ఉంది. 21 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. రూ.4,900 కోట్ల మేర నల్లధనం వివరాలను వీరు స్వచ్ఛందంగా వెల్లడించారు. ఈ పథకం మార్చి 31తో ముగిసిపోయింది. ఇవి తుది వివరాలని, వీటి ఆధారంగా రూ.2,451 కోట్ల పన్ను రాబట్టినట్టు ఆదాయపన్ను శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొన్ని కేసుల్లో వివరాల ఆధారంగా న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించనున్నట్టు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం లెక్కల్లో చూపని ఆదాయాన్ని (బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లు సైతం) గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద స్వయంగా వెల్లడించి 50 శాతం పన్ను చెల్లింపుతో బయటపడొచ్చని కేంద్ర సర్కారు సూచించింది. మిగిలిన మొత్తంలో సగాన్ని నాలుగేళ్ల పాటు వడ్డీ రహితంగా ప్రభుత్వం వద్ద కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొంది. నల్లధనం కలిగిన వారికి ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత అధికారులు గుర్తిస్తే 200 శాతం వరకూ పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం ఓ దశలో హెచ్చరిక కూడా చేసింది. ఈ పథకం మార్చిలో ముగియగా, వచ్చిన స్పందన ఆశాజనకంగా లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
మూడు రెట్లు పెరిగిన ఓఎన్జీసీ లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ)నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ3లో రూ.1,466 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ3లో రూ.4,352 కోట్లకు ఎగసిందని ఓఎన్జీసీ తెలిపింది. ముడి చమురు ధరలు అధికంగా ఉండటంతో ఈ స్థాయి నికర లాభం వచ్చిందని వివరించింది. చమురు ఉత్పత్తి 2 శాతం క్షీణించి 6.4 మిలియన్ టన్నులకు తగ్గగా, గ్యాస్ ఉత్పత్తి 4.4 శాతం వృద్ధి చెంది 6.025 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెరిగిందని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.2.25 డివిడెండ్: రూ. 5 ముఖవిలువ గల ఒక్కో షేర్‌కు రూ.2.25 రెండవ మధ్యతంర డివిడెండ్(45 శాతం)ను ఇవ్వనున్నామని కంపెనీ తెలిపింది. మొత్తం రూ.2,887 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నామని, దీంట్లో ప్రభుత్వం వాటా రూ.1,973 కోట్లని ఓఎన్జీసీ పేర్కొంది. -
విత్‌డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
-
విత్‌డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
బ్లాక్‌మనీపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటిస్తూ నోట్ల రద్దుపై విధించిన తుది గడువు డిసెంబర్ 30 సమీపిస్తోంది. దాదాపు 50 రోజుల అనంతరం అంటే డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్‌పై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నాయి. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక, ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే ఇంకా నగదు సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నగదు విత్‌డ్రాలపై విధించిన పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా, దానిలో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించేలా చేయాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని డిసెంబర్ 30న సాయంత్రం ప్రధాని ప్రజలనుద్దేశించి చేయబోయే ప్రకటనలో ఉండొచ్చని చెబుతున్నాయి. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్‌కు డిసెంబర్ 22 నుంచి టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది. -
ఆటో పరిశ్రమకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఢిల్లీలో భారీ డీజిల్ వాహనాల నిషేధంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తప్పుడు సమాచారం ఆధారంగా కోర్టులు ఈ నిషేధాన్ని విధించాయంటోంది. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్య వాహనాల నిషేధంతో ఆటో పరిశ్రమ భారీగా నష్టపోయిందని సియామ్ ఆరోపిస్తోంది. ఈ నిషేధం మూలంగా గత 8 నెలల్లో రూ .4,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అశోక్ లేలాండ్ ఎండీ, సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) యొక్క 58 వ వార్షిక సమావేశాలలో మాట్లాడిన దాసరి ఈ విషయాన్ని వెల్లడించారు. వాతారణ కాలుష్యానికి గల అసలు కారణాన్ని గుర్తించకుండా ఆటో పరిశ్రమను నియంత్రించాలని ప్రతివారూ చూస్తున్నారని విమ్శించారు. మీడియా సృష్టించిన హైప్, తప్పుడు సమాచారాన్ని ఆధారంగా కోర్టులు నిషేధం విధించాయన్నారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాహనాలపై నిషేధం విధించడం సరికాదన్నారు. దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 50 శాతం తమదేనని, ముప్పయి మిలియన్ల ఉద్యోగాలను ఆటో పరిశ్రమ కల్పిస్తోందని ఇందుకు చాలా గర్వంగాఉందని దాసరి పేర్కొన్నారు.కానీ ఎక్కడ కాలుష్య ఉన్నా.. ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఆటో పరిశ్రమనే తప్పుపడుతున్నారని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిషేధం పొల్యూషన్ నియంత్రించడానికి ఎంతమాత్రం ఉపయోగపడదని దాసరి వ్యాఖ్యానించారు. పర్యావరణ సెస్ 1 శాతం విధింపు మూలంగా 2000 సీసీ పైన డీజిల్ వాహనాలను ప్రజలుకొనడం మానేస్తారా? దాని వలన ఢిల్లీ నగరంలో కాలుష్యం తగ్గిపోతుందనా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆటో పరిశ్రమకు సవాల్ లాంటిదని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆటో పరిశ్రమ తిరిగి తమ ఇమేజ్ పునర్నిర్మాణానికి కలిసి పని చేయాల్సి అవసరం ఉందని దాసరి పిలుపునిచ్చారు. -
శాంసంగ్ కొత్త 4జీ ఫోన్ ..ధర ఎంతోతెలుసా?
సొంత ఆపరేటింగ్ సిస్టమ్ టిజెన్తో రన్ అయ్యే మొదటి 4జీ సపోర్టు స్మార్ట్‌ఫోన్‌ను దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ జెడ్2 పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ. 4,590గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ లాంచింగ్‌తో మార్కెట్లో శాంసంగ్ 4జీ స్మార్ట్ఫోన్ల జాబితా 22కు చేరింది. రిలయన్స్ జియో సర్వీసులతో సరసమైన ధరకు ఈ ఫోన్‌ను నియోగదారులకు ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను పూర్తిగా బెంగళూరు టీమ్ డెవలప్ చేసినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ లాంచింగ్‌తో ఫీచర్ ఫోన్లను వాడే 550 మిలియన్ యూజర్లను తన సొంతం చేసుకోవాలని శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. వారిని బెటర్ స్మార్ట్‌ఫోన్ అనుభూతికి అప్‌గ్రేడ్ చేయాలని యోచిస్తోంది. జియో యాప్స్, వీడియో కాలింగ్, ఓటీజీ అప్డేట్స్తో ఈ కొత్త ఫోన్ యూజర్లను అలరించనుంది. డేటా అవసరం లేకుండా మొబైల్ బ్యాంకింగ్ వాడుకునేలా మై మనీ ట్రాన్సఫర్ యాప్‌ను కూడా ఈ ఫోన్ ఆఫర్ చేస్తోంది. ఈ యాప్‌ను ఇండియాలోని శాంసంగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ అభివృద్ధి చేసింది. 12 భాషలను శాంసంగ్ జెడ్2 సపోర్టు చేస్తుందని కంపెనీ తెలిపింది. బ్లాక్, వైన్ రెడ్, గోల్డ్ కలర్ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ ఫోన్ సోమవారం నుంచి పే టైమ్, శాంసంగ్ ఆఫ్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉండనుంది. శాంసంగ్ జడ్2 ఫీచర్లు... 4 అంగుళాల డిస్ప్లే 1.5 గిగాహెడ్జ్ ప్రాసెసర్ 480x800 పిక్సెల్స్ రెజుల్యూషన్ 1 జీబీ ర్యామ్ 8 జీబీ స్టోరేజ్ 128 జీబీ విస్తరణ మెమరీ టిజెన్ ఓఎస్ 5 ఎంపీ వెనుక కెమెరా 0.3 ఎంపీ ముందు కెమెరా 1500 ఎంఏహెచ్ బ్యాటరీ టిజెన్ ఓఎస్ ఆధారితంగా మొదటి స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ గతేడాదే మార్కెట్లోకి తీసుకొచ్చింది.