బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటిస్తూ నోట్ల రద్దుపై విధించిన తుది గడువు డిసెంబర్ 30 సమీపిస్తోంది. దాదాపు 50 రోజుల అనంతరం అంటే డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్పై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నాయి. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే.