Withdrawal cap
-
గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..! వారు రూ. 5 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..!
నిబంధనలను పాటించని బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొరడా ఝళిపిస్తోంది. గత నెలలో సుమారు 8 బ్యాంకుల ఆపరేషన్స్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా మార్గ దర్శకాలను పాటించని బెంగళూరుకు చెందిన కోపరేటివ్ బ్యాంకుకు ఆర్బీఐ గట్టి షాక్‌ను ఇచ్చింది. విత్ డ్రాపై ఆంక్షలు..! బెంగళూరుకు చెందిన కోఆపరేటివ్ బ్యాంకు శుశ్రుతి సౌహార్ధ సహకార బ్యాంకు నియమిత నిబంధనలను అతిక్రమించినట్లుగా ఆర్బీఐ గుర్తించింది. అందుకుగాను ఈ బ్యాంకు ఖాతాదారుల విత్ డ్రా పై ఆంక్షలను విధించింది. ఈ బ్యాంకు ఖాతాదారులు రూ.5 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా చేసింది. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ బ్యాంకు నుంచి రుణాలను, డిపాజిట్లను తీసుకోవద్దని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. బ్యాంకులో పరిస్థితులు తిరిగి మెరుగుపడేంత వరకు బ్యాంకింగ్ ఆపరేషన్స్‌పై ఆంక్షలు కొనసాగుతాయని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్బీఐ నిర్ణయంతో సదరు బ్యాంకు ఖాతాదారులపై భారీ ప్రభావం పడనున్నట్లు తెలుస్తోంది. చదవండి: యాక్సిస్, ఐడీబీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్! -
యస్ బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట
సాక్షి, ముంబై: యస్ బ్యాంకు సంక్షోభంతో ఆందోళనలో పడిన బ్యాంకు ఖాతాదారులకు స్వల్ప ఊరట కలగనుంది. నగదు ఉపసంహరణకు సంబంధించి ఇటీవల ఆర్బీఐ విధించిన ఆంక్షలను త్వరలోనే ఎత్తివేయ నుంది. యస్‌బ్యాంకు ఖాతాదారులు ఈ వారాంతానికే ఎలాంటి పరిమితి లేకుండా తమ నగదును విత్‌డ్రా చేసుకునే వెసులు బాటు కలగనుంది. ఈ విత్‌డ్రాయల్‌ను మార్చి 15 వరకే పరిమితం చేసి తర్వాత ఎత్తివేసే అవకాశం ఉందని కొత్తగా నియమితులైన యస్‌బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ ఎస్బీఐమాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ సోమవారం ప్రకటించారు. మొదట రూ.50,000 విత్‌డ్రా చేసుకునే అవకాశం నెలరోజులు కాలపరిమితిగా ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం దానిని మార్చి 15వరకే పరిమితం చేయనున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు తమ అకౌంట్లలోని నగదును ఎంతకావాలంటే అంత మొత్తం నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. యస్‌బ్యాంక్ కార్యకలాపాలను ఏప్రిల్ 3నాటికి పునరుద్దరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంకా యస్‌బ్యాంక్‌ను ఎస్బీఐలో విలీనం చేస్తారనే ఊహాగానాల్లో వాస్తవం లేదని, యస్ బ్యాంక్ స్వంతంత్రంగానే పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మూలధనం సమకూర్చలేనప్పుడు మాత్రమే విలీనం అవసరమేర్పడుతుందని అన్నారు. ప్రస్తుతం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నామని వివరాలన్నింటిని మార్చి 14న వెల్లడిస్తామని తెలిపారు. అటు యస్ బ్యాంకులో 49 శాతంవాటాల కొనుగోలు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ ఆమోదం తెలిపింది. తొలి దశలో భాగంగా ఎస్బీఐ రూ. 2450 కోట్లను యస్ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ వార్తల నేపథ్యంలో సోమవారం భారీ పతనంలో కూడా యస్ బ్యాంకు షేర్ల కొనుగోళ్లకు పెట్టుబడి దారులు ఆసక్తి చూపారు. దీంతో 32 శాతం ఎగిసిన యస్ బ్యాంకు షేరు 21.35 వద్ద ముగిసింది. కాగా యస్‌బ్యాంక్‌లో అక్రమాలు నేపథ్యంలో ఆర్బీఐ ఆంక్షలను విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకు లావాదేవీలపై నెల రోజుల పాటుమారటోరియం విధించింది. కేవలం రూ.50వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునేలా ఆంక్షలు విధించింది. మరోవైపు యస్‌బ్యాంక్ పునరుద్ధరణకు ఆర్బీఐ సత్వర చర్యలు ప్రక్రియను వేగవంతం చేసింది. చదవండి: యస్ బ్యాంక్ రాణా కపూర్ అరెస్ట్!! -
విత్‌డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
-
విత్‌డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?
బ్లాక్‌మనీపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటిస్తూ నోట్ల రద్దుపై విధించిన తుది గడువు డిసెంబర్ 30 సమీపిస్తోంది. దాదాపు 50 రోజుల అనంతరం అంటే డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్‌పై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నాయి. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక, ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే ఇంకా నగదు సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నగదు విత్‌డ్రాలపై విధించిన పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా, దానిలో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించేలా చేయాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని డిసెంబర్ 30న సాయంత్రం ప్రధాని ప్రజలనుద్దేశించి చేయబోయే ప్రకటనలో ఉండొచ్చని చెబుతున్నాయి. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు. నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్‌కు డిసెంబర్ 22 నుంచి టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది.