విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు? | Demonetization: Withdrawal cap may be eased to Rs 4,000 per day, say sources | Sakshi
Sakshi News home page

విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?

Published Wed, Dec 28 2016 8:59 AM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు? - Sakshi

విత్డ్రా పరిమితిపై ఆంక్షలు సడలింపు?

బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ ప్రకటిస్తూ నోట్ల రద్దుపై విధించిన తుది గడువు డిసెంబర్ 30 సమీపిస్తోంది. దాదాపు 50 రోజుల అనంతరం అంటే డిసెంబర్ 30న ప్రధాని నరేంద్రమోదీ డీమోనిటైజేషన్పై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మోదీ బ్యాంకులు, ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే నగదు పరిమితులను సడలించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం నిబంధనల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా ప్రధాని ప్రకటన చేయనున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతమున్న రోజుకు రూ.2,500, వారానికి రూ.24,000 పరిమితిని సడలించి, రోజుకు రూ.4000, వారానికి రూ.40,000 తీసుకునేలా ప్రకటన వచ్చే అవకాశాలున్నాయంటున్నాయి. నవంబర్ 8న రాత్రి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని సంచలన నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశాక, ద్రవ్య పరిస్థితిని మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడానికి తనకు 50 రోజులు గడువు ఇవ్వాలని ప్రజలను కోరారు. అయితే ఇంకా నగదు సమస్య కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో నగదు విత్డ్రాలపై విధించిన పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా, దానిలో కొంత ప్రజలకు ఉపశమనం కలిగించేలా చేయాలని యోచిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని డిసెంబర్ 30న సాయంత్రం ప్రధాని ప్రజలనుద్దేశించి చేయబోయే ప్రకటనలో ఉండొచ్చని చెబుతున్నాయి. ప్రధాని ఆ రోజు రాత్రి 8 గంటలకు ప్రసంగించనున్నారు.  నగదు కొరత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త రూ.500, రూ.2000 నోట్ల ప్రింటింగ్కు డిసెంబర్ 22 నుంచి టెండర్లు వేయనున్నారని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement