రూ . 500కే 4జీ స్మార్ట్‌ ఫోన్‌ | 4G smartphones at Rs 500, on a monthly plan of Rs 60 | Sakshi
Sakshi News home page

రూ . 500కే 4జీ స్మార్ట్‌ ఫోన్‌

Published Thu, Feb 8 2018 8:42 AM | Last Updated on Thu, Feb 8 2018 8:42 AM

4G smartphones at Rs 500, on a monthly plan of Rs 60  - Sakshi

సాక్షి, ముంబయి : మొబైల్‌ ఫోన్‌ యూజర్లకు అతితక్కువ ధరకే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్‌, డేటా ప్లాన్స్‌తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్‌ ఫోన్‌ల తయారీ కోసం టాప్‌ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌లు హ్యాండ్‌సెట్‌ కంపెనీలతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్‌ జియో వంటి ఆపరేటర్లు ఆఫర్‌ చేస్తున్న వాయిస్‌, డేటా ప్లాన్స్‌తో లోకాస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ల వైపు మళ్లుతున్న యూజర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా స్మార్ట్‌ ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు టాప్‌ 3 టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ ధరలు తగ్గుముఖం పడుతున్నందున హ్యాండ్‌సెట్‌ కంపెనీలతో ఒప్పందాల ద్వారా అత్యంత చౌకైన డేటా, వాయిస్‌ ప్లాన్‌లను అందిస్తామని టెలికాం కంపెనీల ప్రతినిధి పేర్కొన్నారు. ఫీచర్‌ ఫోన్‌ల తరహాలో స్మార్ట్‌ఫోన్‌ల ధరలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని చెప్పారు. రిలయన్స​ జియో నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని యూజర్లను నిలుపుకునేందుకే భారతి ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఐడియా సెల్యులార్‌ ఈ నిర్ణయం తీసుకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement