ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను అద్దెకు ఇచ్చే విధానాన్ని ప్రారంభించింది. శామ్‌సంగ్ గ్రోవర్‌తో కలిసి జర్మనీలో స్మార్ట్‌ఫోన్ అద్దె కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. గెలాక్సీ ఎస్ 20 మొబైల్ ను 1,3,6,12 నెలల కాలానికి అద్దెకు ఇవ్వడానికి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు ఎంచుకున్న కాలాన్ని బట్టి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీరు గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ ఫోన్‌ను ఎంచుకుంటే, మీరు ఒక నెల కాలానికి 59.90 యూరోలు(సుమారు రూ.5,300) చెల్లించాల్సి ఉంటుంది. మీరు మూడు నెలల అద్దెను ఎంచుకుంటే నెలకు 49.90 యూరోలు(సుమారు రూ.4,400) చెల్లించాలి. అదే ఆరు నెలల కాలానికి అద్దెను ఎంచుకుంటే నెలకు 39.90 యూరోలు(సుమారు రూ.3,500), సంవత్సరం పాటు తీసుకుంటే నెలకు 29.90 యూరోలు(సుమారు రూ.2,600) చెల్లించాలి.(చదవండి: అదృష్ట్టం అంటే ఇదేనేమో)
అదేవిదంగా గెలాక్సీ ఎస్ 20 అద్దె ధర నెలకి 99.90 యూరోలు, 3 నెలల కాలానికి నెలకి 69.90 యూరోలు, 6 నెలల కాలానికి నెలకి 59.90 యూరోలు, ఏడాది కాలానికి నెలకి 49.90 యూరోలు. గెలాక్సీ ఎస్ 20 + మీకు నెలకి 109.90 యూరోల నుండి 54.90 యూరోల వరకు లభించనుంది. అన్నిటి కంటే టాప్ ఎండ్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్20 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను తీసుకుంటే దాని నెలవారీ అద్దె 119.90 యూరోల(సుమారు రూ.10,800) నుంచి 69.90 యూరోలు(సుమారు రూ.6,200) మధ్య ఉండనుంది. భవిష్యత్ లో మరిన్ని మోడళ్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శామ్‌సంగ్ పేర్కొంది. ఈ అద్దె సేవలు అనేవి ప్రస్తుతం జర్మనీకి మాత్రమే పరిమితం చేయబడి ఉన్నాయి. ఉత్పత్తులను కొనాలనుకునే వినియోగదారుల కంటే ఉపయోగించాలి అనుకునే వినియోగదారులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment