
మహా గెలాక్సీల సరస్వతి!
భారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల మహాసమూహాన్ని గుర్తించారు. సుమారు 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్లకు సమానమైన
న్యూఢిల్లీ: భారత ఖగోళ శాస్త్రవేత్తలు గెలాక్సీల మహాసమూహాన్ని గుర్తించారు. సుమారు 20 మిలియన్ బిలియన్ సూర్యుళ్లకు సమానమైన దీనికి సరస్వతిగా నామకరణం చేసినట్లు పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ వెల్లడించింది. సమీప విశ్వాంతరాళంలో మనకు తెలిసిన అతిపెద్ద గెలాక్సీల్లో ఇదీ ఒకటని, 10 బిలియన్ ఏళ్ల వయసున్న ఈ సమూహం భూమికి 4 వేల మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు పేర్కొంది.
ఇది సుమారు 600 మిలియన్ కాంతి సంవత్సరాల పరిధిలో విస్తరించినట్లు వెల్లడించింది. గోడలాగా కనిపించే ఈ సమూహాన్ని స్లోవాన్ డిజిటల్ స్కై సర్వే ద్వారా చూడొచ్చు. ఇదే సంస్థకు చెందిన పరిశోధకులు గతేడాది గురుత్వాకర్షణ తరంగాలను కనుగొనడంలోనూ ముఖ్య పాత్ర పోషించారు. ఒక సమూహంలో 1000– 10 వేల దాకా గెలాక్సీలుంటాయి. మహా సమూహంలో అయితే అలాంటి సమూహాలు దాదాపు 43 ఉంటాయి.