
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్–3
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎస్–3ని భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
ధర రూ.47,990
బెంగళూరు: శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఎస్–3ని భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.47,990గా ఉంది. ఇందులో 9.7 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ (క్వాడ్‌కోర్ 2.15 గిగాహెర్ట్+1.6 గిగాహెర్ట్), 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 7.0 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్, క్వాడ్ స్పీకర్స్, ఫాస్ట్ చార్జింగ్ కేపబిలిటీ, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13 ఎంపీ ఆటోఫోకస్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఎస్ పెన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది.