సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి సరసమైన ధరలు, ఆకర్షణీయమైన ఫీచర్లతో భారత వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రత్యర్థి కంపెనీ, సౌత్ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూసుకు వస్తోంది. జె సిరీస్‌లో కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లతో భీకర విధ్వంసానికి రడీ అవుతోంది. మిడ్ సెగ్మెంట్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను త్వరలో లాంచ్ చేయనుందట. జే సీరిస్‌లో భాగంగా వీటిని మే 21న మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎస్9 లాంటి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలోని అద్భుత ఫీచర్లు ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే లాంటి ప్రధాన ఫీచర్‌తో వీటిని భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. అంతేకాదు వీటన్నింటినీ నోయిడాలోని కేంద్రంలో రూపొందించడం మరో విశేషం.
బెజెల్ లెస్ స్ర్కీన్, సరసమైన ధరతో లక్షలాది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులే లక్ష్యంగా వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రచించింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని తీసుకొస్తున్నట్టు సోమవారం శాంసంగ్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఎస్ బైక్ మోడ్, అల్ట్రా డేటా సేవింగ్ (యూడీఎస్) చార్జింగ్‌లో టర్బోస్పీడ్ లాంటి కీలక ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు రడీ అయిపోయింది. అయితే జే సిరీస్‌లో వస్తున్న ఈ నాలుగు డివైస్‌ల స్పష్టమైన ఫీచర్లు, ఇతర స్పెసికేషన్లు, ధరలు తదితర అంశాలపై క్లారిటీ రావాలంటే శాంసంగ్ అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment