సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త మొబైల్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం30ఎస్ పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో వాటర్‌డ్రాప్ డిస్‌ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణ. శాంసంగ్ గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా దీన్ని ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్/ 64జీబీ స్టోరేజ్, 6జీబీర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో వినియోగదారులకు లభించనుంది. ఇప్పటికే గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎం20 స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
శాంసంగ్ ఎం30 ఎస్ ఫీచర్లు
6.4 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లే స్క్రీన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.1
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
48+5+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా
6000 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర : 13,999
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర : 16,999
సెప్టెంబరు 29నుంచి విక్రయానికి లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment