దక్షిణ కొరియా ఎలక్ట్రానికి దిగ్గజం శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌పై వేగం పెంచింది. ఇటీవల ఏ, ఎం సిరీస్‌లలో ఇటీవల గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్ వచ్చే నెలలో మరో శాంసంగ్ గెలాక్సీ బిగ్ ఈవెంట్ నిర్వహించనున్నామని వెల్లడించింది. ఏప్రిల్ 10న ఈ ఈవెంట్ జరగనుందంటూ శాంసంగ్ ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను గోప్యంగా ఉంచింది.
అయితే ఈ ఈవెంట్‌పై పరిశ్రమ వర్గాల్లో పలు అంచనాలు నెలకొన్నాయి. ముఖ‍్యంగా ప్రీమియం మిడ్ రేంజ్‌లో పాప్ అప్ కెమెరాతో ఏ90ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయనుంది. బ్యాంకాక్, మైలాన్, సావోపోలోలో ఒకేసారి వీటిని లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ 20 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. దీంతోపాటు ఏ40, ఏ 20ఈ లను కూడా తీసుకురానుందట. ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఏ 30, ఏ 50, ఏ 10 స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Enter the era of live. April 10, 2019 - Live on https://t.co/kDIR3TcbZ5 #SamsungEvent pic.twitter.com/EqN8wF04Wd
— Samsung Mobile (@SamsungMobile) March 18, 2019
Comments
Please login to add a commentAdd a comment