ఆమ్‌స్టర్‌డామ్: విశ్వంలోకెల్లా అతి పెద్ద గెలాక్సీని ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఇది ఏకంగా 1.63 కోట్ల కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో పరుచుకుని ఉందట! మన పాలపుంత కంటే 153 రెట్లు, సూర్యుని కంటే 24,000 కోట్ల రెట్లు పెద్దదట. ఈ భారీ రేడియో గెలాక్సీకి అల్సియోనెస్ అని పేరు పెట్టారు. ఇది భూమి నుంచి 300 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందని దీన్ని కనిపెట్టిన నెదర్లాండ్స్‌లోని లైడెన్ అబ్జర్వేటరీకి చెందిన శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
దీని మధ్యలో కేంద్రకం వద్ద చురుకైన ఓ భారీ కృష్ణబిలం కూడా ఉందని వారంటున్నారు. దాని సమీపం నుంచి భారీ ద్రవ్యరాశితో కూడిన పలు ఖగోళ పదార్థాలు ఎగజిమ్ముతున్నాయట. ఇలాంటి అజ్ఞాత రేడియో గెలాక్సీల గురించి మనకు తెలిసింది చాలా తక్కువే. కృష్ణబిలం తన చుట్టూ ఉన్న పదార్థాలన్నింటినీ తనలోకి లాగేసుకుంటూ ఉంటే అది చురుగ్గా ఉందని అర్థం. అలా దానిలోకి వెళ్లే వాటిలో అతి తక్కువ పదార్థాలు బిలం తాలూకు బయటి పొర గుండా దాని ధ్రువాల వైపు శరవేగంతో విసిరివేతకు గురవుతాయి. అక్కణ్నుంచి భారీ పేలుడుతో అంతరిక్షంలోకి దూసుకుపోయి అయనీకరణం చెందిన ప్లాస్మాగా రూపొందుతాయి.
తర్వాత ఇవి కాంతివేగంతో సుదూరాలకు ప్రయాణిస్తూ చివరికి రేడియో ధారి్మకతను వెలువరించే భారీ అంతరిక్ష దృగి్వషయాలుగా మిగిలిపోతాయి. ఇలాంటి రేడియో ధారి్మక పదార్థాలు మన పాలపుంతలోనూ లేకపోలేదు. కానీ అల్సియోనెస్ వంటి భారీ గెలాక్సీల్లో అవి అంతంత సైజులకు ఎలా పెరుగుతాయన్నది ఇప్పటిదాకా మనకు అంతుపట్టని విషయం. ఈ విషయంలో ఇప్పటిదాకా ఉన్న పలు సందేహాలకు అల్సియోనెస్ రూపంలో సమాధానాలు దొరుకుతాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇంత భారీ గెలాక్సీలు ఎలా పుట్టుకొస్తాయన్న ప్రశ్నలకు కూడా అల్సియోనెస్‌పై జరిగే పరిశోధనల్లో సమాధానాలు దొరకొచ్చని అబ్జర్వేటరీకి చెందిన మారి్టజిన్ ఒయ్ అన్నారు. యూరప్‌లో ఏర్పాటు చేసిన లో ఫ్రీక్వెన్సీ అర్రే (లోఫర్) డేటాను విశ్లేషించే క్రమంలో ఓయ్, ఆయన బృందం యాదృచి్ఛకంగా ఈ భారీ గెలాక్సీని కనిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment