
న్యూఢిల్లీ: శామ్‌సంగ్ ఇండియా కంపెనీ గెలాక్సీ ఎమ్20, ఎమ్10 స్మార్ట్‌ఫోన్లను భారత్‌లో అందుబాటులోకి తెస్తోంది. షావోమి బడ్జెట్ ఫోన్, రెడ్‌మీకి పోటీగా ఈ ఫోన్లను శామ్‌సంగ్ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్లను అమెజాన్‌లో వచ్చే నెల 5 నుంచి కొనుగోలు చేయవచ్చని శామ్‌సంగ్ ఇండియా తెలిపింది. గెలాక్సీ ఎమ్20లో 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.10,990 అని, 4జీబీ, 64 జీబీ వేరియంట్ ధర రూ.12,990 అని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్శి తెలిపారు.
అలాగే గెలాక్సీ ఎమ్10లో 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.8,990 అని, 2జీబీ, 16 జీబీ వేరియంట్ ధర రూ.7,990 అని పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్20లో 6.3 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇనిఫినిటీ –వీ డిస్‌ప్లే, 5,000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండగా, గెలాక్సీ ఎమ్10లో హెచ్‌డీ 6.2 అంగుళాల హెచ్‌డీ ప్లస్ స్క్రీన్ ఉందని పేర్కొన్నారు. ఇక రెండు ఫోన్లలో ఆల్ట్రావైడ్ ఫీచర్‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయని తెలిపారు.