Smartphone Screen
-
స్మార్ట్ఫోన్ల స్క్రీన్లపై ఎక్కువ సేపు కరోనా!
సాక్షి, హైదరాబాద్: నోరు, ముక్కు ద్వారా బయటపడే తుంపర్లలో ఉండే కరోనా వైరస్ ఎంత కాలం మనగలదు? కొంచెం కష్టమైన ప్రశ్నే.. ఎందుకంటే ఉష్ణోగ్రత, వెలువడే వైరస్ సంఖ్య, గాల్లో తేమ శాతం వంటి అనేకానేక అంశాలపై వైరస్ మనుగడ ఆధారపడి ఉంటుంది. కానీ.. మిగిలిన అన్ని ఉపరితలాలతో పోలిస్తే తుంపర్ల ద్వారా స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై చేరిన వైరస్ మాత్రం ఎక్కువ కాలం మనగలుగుతుందని అంటున్నారు ఐఐటీ హైదరాబాద్ శాస్త్రవేత్తలు.. అలాగే ఒకసారి తుంపర్లలోని తడి ఆరిపోయిన తర్వాత వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ ఉంటుందని వీరు నిర్వహించిన తాజా అధ్యయనం వెల్లడించింది. సాధారణ గాజు ఉపరితలాలతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై తుంపర్లు ఆరిపోయేందుకు మూడింతల ఎక్కువ సమయం పడుతోందని ఈ అధ్యయనం తెలిపింది. విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కోవిడ్ కారక కరోనా వైరస్ మనుగడను అర్థం చేసుకునేందుకు తాము అధ్యయనం నిర్వహించామని, తుమ్ము, దగ్గు ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుం డగా లాలాజలంలో నీటితో పాటు లవణాలు, ముసిన్ అనే ప్రొటీన్ తదితరాలు ఉంటాయని శాస్త్రవేత్తలు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించారు. నీటి తుంపర్లు వేగంగానే ఆరినప్పటికీ ఇతర పదార్థాల కారణంగా లాలాజలం ఆరిపోయేందుకు ఎక్కువ సమయం పడుతుందన్నారు. సాధారణంగా తుంపర్లు కొన్ని నిమిషాల్లోనే ఆరిపోతాయి కానీ.. గాల్లో తేమ శాతం ఎక్కువైతే గంట కంటే ఎక్కువ సమయం పడుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు శరవణన్ బాలుస్వామి, సాయక్ బెనర్జీ, కీర్తి చంద్ర సాహూలు వెల్లడించారు. ‘తుంపర బిందువులు ఏ ఉపరితలంపై పడ్డాయన్న అంశంపై కూడా ఆరిపోయే సమయం ఆధారపడి ఉంటుంది. ఒక నానో లీటర్ లాలాజల బిం దువు నిమిషం కంటే తక్కువ సమయంలోనే ఆరిపోతుంది. గాల్లో తేమ శాతం, ఉష్ణోగ్రతలు తక్కువ గా ఉన్నప్పుడు తడిఆరేందుకు అత్యధిక సమయం పడుతున్నట్లు గుర్తించాం.. గాల్లో తేమశాతం తగ్గి పోతూ, ఉష్ణోగ్రతలు పెరిగితే తుంపర్ల తడి వేగంగా ఆరిపోతున్నట్లు తెలిసింది’ అని వివరించారు. -
‘గెలాక్సీ ఎమ్’ స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: శామ్సంగ్ ఇండియా కంపెనీ గెలాక్సీ ఎమ్20, ఎమ్10 స్మార్ట్ఫోన్లను భారత్‌లో అందుబాటులోకి తెస్తోంది. షావోమి బడ్జెట్ ఫోన్, రెడ్మీకి పోటీగా ఈ ఫోన్లను శామ్సంగ్ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్లను అమెజాన్‌లో వచ్చే నెల 5 నుంచి కొనుగోలు చేయవచ్చని శామ్సంగ్ ఇండియా తెలిపింది. గెలాక్సీ ఎమ్20లో 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.10,990 అని, 4జీబీ, 64 జీబీ వేరియంట్ ధర రూ.12,990 అని శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆసిమ్ వార్శి తెలిపారు. అలాగే గెలాక్సీ ఎమ్10లో 3జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.8,990 అని, 2జీబీ, 16 జీబీ వేరియంట్ ధర రూ.7,990 అని పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్20లో 6.3 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ ఇనిఫినిటీ –వీ డిస్ప్లే, 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండగా, గెలాక్సీ ఎమ్10లో హెచ్డీ 6.2 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్ ఉందని పేర్కొన్నారు. ఇక రెండు ఫోన్లలో ఆల్ట్రావైడ్ ఫీచర్‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. -
స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ అలర్ట్!
మొబైల్ స్క్రీన్ పగిలిపోతే, చాలామంది చాలా బాధపడిపోతారు. అయ్యో ఇప్పుడు కొత్త స్క్రీన్ వేయించుకోవాలి అంటే ఎంత ఖర్చు అవుతాదో ఏమో అని. కానీ ఇక నుంచి అలాంటి బాధలే అవసరం లేదట. తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఓ స్మార్ట్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదే ఫ్లిప్‌కార్ట్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్. ఈ ప్లాన్ కింద మీ ఫోన్ స్క్రీన్కు కూడా ఫ్లిప్‌కార్ట్ బీమా చేస్తుందట. స్క్రీన్ బీమా 150 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. మొబైల్ స్క్రీన్లకు మరింత సురక్షితం అందించాలని ఎవరైతే భావిస్తారో వారి కోసం ఫ్లిప్‌కార్ట్ ఈ బంపర్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్ కింద, ఒకవేళ స్క్రీన్ డ్యామేజ్ అయితే, ఫోన్ ధరలో ఫ్లాట్ 20 శాతాన్ని ఫ్లిప్‌కార్ట్ రీఫండ్ చేయనుంది. ఈ మొత్తాన్ని యూజర్ల బ్యాంక్ అకౌంట్లో జమ చేయనుందని తెలిసింది. ఫ్లిప్‌కార్ట్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్‌ను పొందడమెలా.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు, కొనుగోలుదారులు ‘స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్’ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ధర రూ.150 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్ ధరను బట్టి ఈ మొత్తం ఇంకా ఎక్కువగా ఉండవచ్చు. రెండు విధానాల ద్వారా ప్రయోజనాలను యూజర్లు పొందుతారు. ఫోన్ వాడుతూ ఉన్నప్పుడు ఫోన్ స్క్రీన్ డ్యామేజ్ అయితే, ఈ ప్లాన్... ఫోన్‌ను రీఫైర్ చేయడానికి లేదా రీఫండ్‌కు అనుమతి ఇస్తోంది. ఆ సమయంలో క్లయిమ్‌ను పొందవచ్చు. క్లయిమ్ ప్రక్రియంతా ఆన్లైన్ ద్వారానే సాగుతుంది. రీఫండ్ ప్రక్రియలో క్లయిమ్ పొందడం... దీని కింద, కొనుగోలుదారులు కంపెనీ నెంబర్లు 1800 425 5568 లేదా 080-25187326 కు కాల్ చేయాల్సి ఉంటుంది. protect@jeeves.co.in అనే అడ్రస్‌కైనా ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఆ అనంతరం మీ నెంబర్‌కు ఫ్లిప్‌కార్ట్ సెల్ఫ్ అసెస్మెంట్ వీడియో పంపుతుంది. అప్పుడు మీరు డ్యామేజ్ అయిన స్క్రీన్‌తో పాటు ఐఎంఈఐ నెంబర్ కనిపించేలా పగిలిపోయిన డివైజ్‌ను వీడియో తీసి కంపెనీకి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ సెల్ఫ్ సర్వే రిపోర్టును పరిశీలించి, అంతకముందు జరిగిన ఘటనలతో పోల్చి చూసి, మీకు క్లయిమ్ వస్తుందో రాదో చెబుతోంది. ఆ అనంతరం మీ బ్యాంకు అకౌంట్లో నగదు జమ అవుతుంది. రీఫైర్ ప్రొసెస్ అనంతరం క్లయిమ్ పొందడం.... ఈ ప్రక్రియలో కూడా కొనుగోలుదారుడు కంపెనీ నెంబర్లు 1800 425 5568 లేదా 080- 25187326 కొనుగోలు చేయాల్సి ఉంటుంది. లేదా ఈమెయిల్ ద్వారా అయినా మీ అభ్యర్థనను కంపెనీకి పంపవచ్చు. ఆ ఈ-మెయిల్లో మీరు అందించే మీ ప్రాంత పిన్‌కోడ్ బట్టి, దగ్గర్లోని జీవ్స్ అథారైజడ్ సర్వీసు సెంటర్ వివరాలను కంపెనీ అందిస్తోంది. అక్కడికి వెళ్లి, రీఫైల్ వివరాలను తెలుసుకోవాలి. ఆ సెంటర్ వారు ఫోన్‌ను రీఫైర్ చేస్తామని చెబితే, మొత్తం రీఫైరింగ్ ఖర్చును అక్కడి కట్టి, ఫోన్‌ను రీఫైర్ చేయించుకోవాలి. ఆ రీఫైర్ ఖర్చుతో వారు మీకు ఒక ఇన్వాయిస్ ఇస్తారు. ఆ అనంతరం జీవ్స్కు కాల్ చేసి, ఫోన్ విలువలో 20 శాతం క్లయిమ్‌ను లేదా మొత్తం రీఫైర్ ఖర్చును క్లయిమ్ చేసుకోవచ్చు. ఏదైతే తక్కువగా ఉంటుందో అది కంపెనీ మీ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ఒకవేళ జీవ్స్ సెంటర్ మీ ఫోన్ రీఫైర్ చేయడానికి ఒప్పుకోకపోతే, రీఫండ్ ద్వారా క్లయిమ్‌ను పొందవచ్చు. ప్లాన్ ఎలా అందిస్తోంది, షరతులు ఏమిటి? క్లయిమ్ ఆమోదం పొందడానికి ఎలాంటి చర్చలు జరపడానికి వీలులేదు. కానీ 72 గంటల్లో నగదు మాత్రం వినియోగదారుని అకౌంట్‌కు బదిలీ అవుతాయి. ఫోన్ ధరను ఇన్వాయిస్ ఆధారంగా లెక్కిస్తారు. మార్కెట్ ధర అనుగుణంగా కాదు. క్లయిమ్ పొందేటప్పుడు ఎలాంటి మొత్తాన్ని కూడా యూజర్లు చెల్లించాల్సినవసరం లేదు. ఆశ్చర్యకరంగా ఫోన్‌ను ఎవరు వాడుతున్నారో కంపెనీ పట్టించుకోదు. దీని కోసం ఎలాంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాల్సినవసరం లేదు. ప్లాన్ వేటికి వర్తించదు? స్క్రీన్ కాకుండా మిగతావి ఏమన్నా డ్యామేజ్ అయితే, ఇది వర్తించదు. ఫోన్ చోరికి గురైనా కూడా ప్లాన్ వర్తించదు. మాన్ఫ్రాక్ట్ర్చర్ వారెంటీ కింద డ్యామేజ్ అయినా కూడా స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ కిందకి రాదు. అన్ని యాక్ససరీస్ కూడా ఈ ప్లాన్ కిందకి రావు. ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే కొత్త ఫోన్లకు మాత్రమే ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఫోన్ కొనుగోలు చేసేటప్పుడే, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయడానికి ఎలాంటి ప్రొవిజన్ ఉండదు. -
ఇక స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై రాయొచ్చు
న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై రాయగలిగే కొత్త టెక్నాలజీని గూగుల్ ప్రవేశపెట్టింది. ఈ సంస్థ కొత్తగా రూపొందించిన ‘హ్యండ్ రైటింగ్ ఇనుపుట్’ యాప్‌తో మీ స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ స్క్రీన్‌పై రాసి మీ కలానికున్న పదునేంటో చూపించొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 82భాషలను అనుమతించే ఈ యాప్ మీరు స్క్రీన్‌పై రాయగానే ఆ టెక్ట్స్‌ని స్టాండర్డ్ డిజిటల్ టెక్ట్స్‌గా మారుస్తుంది. దీని ద్వారా చేతి వేళ్లతో కూడా రాసే అవకాశం ఉంది. అక్షరాలతోపాటు ఏదైనా డిజిటల్ ఐకాన్‌ను కూడా టెక్ట్స్‌కు జత చేయవచ్చు. స్క్రీన్‌పై రాసే అవకాశం ఉన్న యాప్‌లలో ఇది కొత్తదేం కాదు. ఇంతకుముందు మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో విండోస్ జర్నల్ అనే యాప్ కూడా హ్యాండ్‌రైటింగ్‌కు ఉద్దేశించిందే. అయితే గూగుల్ వెర్షన్లో క్లౌడ్ సాంకేతికతను కూడా కలిగి ఉండడం విశేషం. వినియోగదారులు స్క్రీన్‌పై రాయగానే అది డిజిటల్ టెక్ట్స్ రూపంలోకి మారడమే కాకుండా, క్లౌడ్ ఫీచర్ ద్వారా వెబ్‌లోకి అప్లోడ్ చేసే అవకాశం కూడా ఉంది. ఆండ్రాయిడ్ 4.0.3, ఆపై వెర్షన్లలో మాత్రమే పనిచేసే ఈ యాప్ గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది.