
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో 512జీబీ వేరియంట్‌ను శుక్రవారం భారత మార్కెట్లో విడుదలచేసింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలు (48 మెగాపిక్సెల్ స్టడీ ఓఐఎస్, 12ఎంపీ అల్ట్రా–వైడ్, 5ఎంపీ మాక్రో సెన్సాన్స్) ఉండగా, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరాను అమర్చింది. దీని ధర రూ. 44,999 కాగా, పాత వేరియంట్‌తో మార్పిడి ద్వారా రూ. 5000 వరకు బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించింది. మార్చి 1 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు ప్రారంభం. రీటేల్ స్టోర్లు, శాంసంగ్ ఒపెరా హౌజ్, శాంసంగ్ ఇ-షాప్‌తో పాటు అన్ని లీడింగ్ ఆన్‌లైన్ సేల్స్ వెబ్‌పోర్టల్స్‌లో లభించనున్నాయి. ప్రిజం వైట్, ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ కలర్లలో గెలాక్సీ ఎస్10 లైట్ అందుబాటులో వుంటుందని శాంసంగ్ తెలిపింది.
గెలాక్సీ ఎస్10 లైట్ ఫీచర్లు
6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ ప్లస్ ఇన్ఫినిటీ–ఓ డిస్‌ప్లే
1080x 2,400 పిక్సెల్స్ రిజల్యూషన్
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 ఆక్టా–కోర్ సాక్
ఆండ్రాయిడ్ 10
8జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్
4500ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment