
ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి యుద్ధం ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా రెండు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నువ్వా నేనా అన్నట్లు కదన రంగంలో తలపడుతున్నాయి. రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఉక్రెయిన్‌కు పలు దేశాలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు పలు దేశాలు, కంపెనీలు ఉక్రెయిన్‌పై ఆంక్షలు విధిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. అలాగే కెనడా, స్వీడన్ కూడా రష్యా నుంచి బయలుదేరే విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి.
ఈ నేపథ్యంలో తాజాగా రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ దక్షిణ కోరియా దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు తమ ఉత్పత్తులు, ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితులను దగ్గరి నుంచి పరిశీలిస్తున్నామని శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఎలక్ట్రానిక్ చిప్స్ నుంచి స్మార్ట్‌ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సహా అన్నీ ఉత్పత్తులను నిలిపివేస్తున్నామని వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్‌కు శాంసంగ్ 6 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించింది. కాగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్, యాపిల్, ఐకియా, నైక్ వంటి టెక్ దిగ్గజాలు రష్యా దేశంలో తమ అమ్మకాలు, సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: యుద్ధానికి బ్రేక్ వేసింది అందుకే! తరలించేందుకు సహకరిస్తాం!
Comments
Please login to add a commentAdd a comment