Flat Rs 11000 Off Samsung Offering A Galaxy M53 5G Smartphone - Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ బంపరాఫర్‌, 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

Published Tue, Oct 25 2022 8:15 PM | Last Updated on Tue, Oct 25 2022 9:45 PM

Flat Rs.11000 Off Samsung Offering A Galaxy M53 5g Smartphone   - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ శాంసంగ్ కొనుగోలు దారులకు బంపరాఫర్‌ ప్రకటించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో అందిస్తున్నట్లు వెల్లడించింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్‌పై రూ.11వేల డిస్కౌంట్‌ ఇస్తుంది. ఆ ఫోన్‌ ధర రూ. 34,999 ఉండగా.. ఇప్పుడు మీరు అదే ఫోన్‌ను రూ. 23,999 కొనుగోలు చేయోచ్చు.  



హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు కొనుగోలు చేస్తే రూ. 2 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.  శాంసంగ్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 13 వేల డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో పాటు  ఎక్ఛేంజ్‌ ఆఫర్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇక, నో కాస్ట్ ఈఎంఐ నెలకు రూ. 4 వేల నుంచి ప్రారంభం అవుతుంది. 18 నెలల ఈఎంఐకు నెలకు రూ. 1375 చెల్లించాలి.  

ఫోన్‌లో ఫీచర్లు 
శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 6.7 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,  5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెర్ట్జ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్, మీడియాటెక్ డిమెన్‌సిటీ 900 ప్రాసెసర్, 108 ఎంపీ రియర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement