స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టారు. యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలకు ధీటుగా టెస్లా ‘పై’ పేరుతో స్మార్ట్ ఫోన్‌ను తర్వలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
మస్క్ ఇప్పటికే స్పేస్ ఎక్స్, స్టార్ లింక్, ది బోరింగ్ కంపెనీ, న్యూరాలింక్ కార్పొరేషన్, జిప్2, ఓపెన్ ఏఐ, టెస్లా, సోలార్ సిటీ, పేపాల్ కంపెనీలను స్థాపించి తన మార్క్ బిజినెస్ స్ట్రాటజీస్‌తో ముందుకు దూసుకెళ్తున్నారు. మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే బార్ట్న్ హెయిల్ పేరుతో పెర్‌ఫ్యూమ్ అమ్మకాలు ప్రారంభించాడు. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో విడుదల చేయనున్నారు. ఆ ఫోన్ ఫీచర్లు, ధరలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘పై’ ఫోన్ ఫీచర్లు
తొలిసారి స్మార్ట్ ఫోన్ తయారీ మార్కెట్‌లోకి అడుగు పెట్టిన మస్క్..పై పేరుతో ఫోన్‌ను డిసెంబర్ నెలలో మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల ఫోన్‌కు ఓల్‌ఈడీ ప్యానెల్, 1284*2778 పిక్సెల్ స్క్రీన్ రెజెల్యూషన్, 458 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఒలియోఫోబిక్ కోటింగ్‌తో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉండగా.. ఒక్కో కెమెరా రెజెల్యూషన్ 50ఎంపీ(మెగా పిక్సెల్) గా ఉంది. ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, డ్యూయల్ ఎల్‌ఈడీ టోన్ ఫ్లాష్, హెచ్‌డీఆర్, హైక్వాలిటీ, వీడియో కంప్రెషన్ కోసం ప్రోరెస్ ఫార్మాట్, సినిమాటిక్ మోడ్, స్టెరో సౌండ్ రికార్డింగ్ ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంతంటే?
ఫోన్ ముందు భాగంలో 40 మెగా పిక్సెల్ సింగిల్ పంచ్ హోల్ కెమెరా, కదులుతున్న మనుషుల్ని, జంతువుల్ని స్టిల్ ఫోటోలుగా క్యాప్చర్ చేసేందుకు గైరో స్కోప్ ఎలక్ట్రానిక్స్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ( Gyro-EIS) వంటి ఫీచర్లు ఉన్నాయి. టెస్లా సొంతంగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను తయారు చేయగా.. ఈ ఫోన్ ధర రూ.70వేల నుంచి రూ.80వేల మధ్యలో ఉండనున్నట్లు సమాచారం.
చదవండి👉 ‘అదానీ సంపద హాంఫట్’ ఒక్కరోజే వేలకోట్ల నష్టం..కారణం ఏంటో తెలుసా
Comments
Please login to add a commentAdd a comment