
'టెస్లా' అనే పదం వినగానే చాలా మందికి ఎలక్ట్రిక్ కారు, ఎలోన్ మస్క్ పేరు వెంటనే గుర్తుకు వస్తుంది. ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో రారాజు ఈ టెస్లా కంపెనీ. ఈవీ రంగంలో టెస్లా ట్రెండ్ క్రియేట్ చేసింది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 'టెస్లా' కంపెనీ ఈ స్థాయికి చేరుకోవడంలో సీఈఓ ఎలోన్ మస్క్ ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పటికే అంతరిక్ష, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ రంగాలలో తన సత్తా చాటిన మస్క్ మరో కీలక రంగంలో తన మార్క్ ట్రెండ్ క్రియేట్ చేసేందుకు సిద్దం అవుతున్నారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా ఇప్పుడు గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. మోడల్ పై/పీ(Model Pi/P) అనే పేరుతో టెస్లా ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. టెస్లా స్మార్ట్‌ఫోన్ గురించి అధికారిక సమాచారం లేనప్పటికీ, ఇంటర్నెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు వాటి గురుంచి మనం తెలుసుకుందాం..
టెస్లా స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్(అంచనా):
ఇంటర్నెట్‌లో వస్తున్న సమాచారం ప్రకారం టెస్లా ఒక గేమింగ్ స్మార్ట్‌ఫోన్ తీసుకొని రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో "T" అనే అక్షరం ఉండనుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్ ఉంటుందని సమాచారం. దీనిలో వెనుక భాగంలో 108 మెగా పిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే, 4కే సపోర్ట్ చేసే 6.5 అంగుళాల స్క్రీన్, స్నాప్ డ్రాగన్ 898 ప్రాసెసర్, 2టీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉండే అవకాశం ఉంది. టెస్లా స్మార్ట్‌ఫోన్ ధర 800 - 1200 డాలర్ల(సుమారు రూ.60,000 - రూ.90,000) మధ్య ఉంటుందని లైఫ్ వైర్ నివేదించింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ మొబైల్ వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
(చదవండి: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులకు షాక్..!)