న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా కొత్తగా మోటో జీ32 ఫోన్‌లో రెండు రంగుల్లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. రోజ్ గోల్డ్, శాటిన్ మెరూన్ వీటిలో ఉన్నాయి. దీనితో జీ32 మొత్తం నాలుగు వేరియంట్స్‌లో లభిస్తున్నట్లవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.
గత సంవత్సరం 4జీబీ+ 64జీబీ మోడల్ విడుదలకాగా ఈ సంవత్సరం ప్రారంభంలో 8జీబీ + 128జీబీ వెర్షన్ లాంచ్ అయింది. జీ32 ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ టర్బోపవర్ చార్జర్, 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా–కోర్ ప్రాసెసర్, 6.5 అంగుళాల డిస్‌ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment