moto
-
ప్రయాణాలపై ఇష్టంతోనే.. ఈ స్థాయికి!
ముంబైలో హోటల్ మేనేజ్మెంట్ చేసిన నిఖిల్‌కు ప్రయాణాలు చేయడం అంటే బోలెడు ఇష్టం. ఎంత ఇష్టం అంటే రోజూ 50 నుంచి 100 కిలోమీటర్లు ఎక్కడో ఒకచోటుకి వెళ్లిరావాల్సిందే. అయితే ఒకానొక రోజు మాత్రం... ‘ఎప్పుడూ ముంబై మాత్రమేనా.. ఔట్‌సైడ్ ముంబై కూడా వెళ్లాలి’ అనుకున్నాడు.అలా బైక్‌పై ఆజ్మీర్, బెంగళూరుకు వెళ్లాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఔట్‌సైడ్ ముంబై ప్రయాణాలు ఆగలేదు. ఈ ప్రయాణాల పుణ్యమా అని మన దేశంలోని ‘మోటో వ్లాగింగ్’ ప్రఖ్యాత యూట్యూబర్లలో ఒకరిగా నిఖిల్ శర్మ పేరు తెచ్చుకున్నాడు.నిఖిల్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే..యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలలో ఉంది. తాను వీడియోలు చేయడం మొదలుపెట్టినప్పుడు మన దేశంలో వ్లాగింగ్‌కు పెద్దగా ్రపాచుర్యం లేదు. డైలీ వ్లాగింగ్ చేయడం ద్వారా ఆడియెన్స్‌తో ఎప్పటికప్పుడూ టచ్‌లో ఉండేవాడు. మన దేశంలో ఏ మూలన ఉన్న ఆడియెన్స్ అయిన నిఖిల్ చెబుతున్న కబుర్లు విని ఊహాల్లోనే తాను ఉన్న చోటుకి వెళ్లేవారు.వ్లాగింగ్‌కు ఆవలి ప్రపంచంలోకి వెళితే..నిఖిల్‌కు నటన అంటే ఇష్టం. బాలీవుడ్ సినిమాల్లో, టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఫ్లైట్ అటెండెంట్‌గా కొంతకాలం ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగం మానేసినప్పుడు తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు. అదే సమయంలో తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై పడింది. ‘వ్లాగింగ్ వదలేయ్. డబ్బు సంపాదనపై దృష్టి పెట్టు’ అని కొద్దిమంది సలహా ఇచ్చారు. అయితే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తన ప్యాషన్‌కు ఎప్పుడూ దూరం కాలేదు.ఆ ప్యాషనే తనను ప్రతిష్ఠాత్మకమైన యూట్యూబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్లో పాల్గొనేలా చేసింది. ఔట్‌సైడ్ ముంబై యాత్రలు చేస్తే చాలు అనుకున్న అతడిని అమెరికా, కెనడా, ఇండోనేషియ, సౌత్ కొరియా, జపాన్... మొదలైన దేశాలకు వెళ్లేలా చేసింది. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30–ఇండియా’ జాబితాలో చోటు సంపాదించేలా చేసింది. క్లాతింగ్ బ్రాండ్ లేబుల్ ఎంఎన్తో డిజైనర్, ఎంటర్‌ప్రెన్యూర్‌గా నిరూపించుకున్న నిఖిల్... ‘ఎన్ని చేసినా వ్లాగింగ్ అనేది నా ప్యాషన్’ అంటున్నాడు.ప్రతిభతో పాటు..మన ప్యాషన్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావచ్చు. రాజీ పడి వేరే దారి చూసుకోవడం సులభం. రాజీ పడకుండా నచ్చిన దారిలోనే వెళ్లడం కష్టం. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా పోదు. తప్పకుండా ఫలితం ఇస్తుంది. ప్రతిభతో పాటు ఓపిక కూడా ఉండాలి. తొందరపాటు వల్ల నష్టపోయిన ప్రతిభావంతులు ఎంతోమంది ఉన్నారు. – నిఖిల్ శర్మఇవి చదవండి: -
లేటెస్ట్ ఫ్లిప్ ఫోన్.. అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడు కొనేయండి!
మార్కెట్లోకి రకరకాల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకమైన సరికొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే లాంచ్ అయినప్పుడు వాటి ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో కొంతమంది వాటిని కొనలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం కంపెనీలు కొన్ని నెలల తర్వాత ఆ ఫోన్ల ధరలను తగ్గిస్తుంటాయి. మోటరోలా రేజర్ 40 (Moto Razr 40), మోటరోలా రేజర్ 40 అల్ట్రా (Moto Razr 40 Ultra) ఫ్లిప్ ఫోన్లు గతేడాది జూన్‌లో విడుదలయ్యాయి. 2000ల ప్రారంభం నాటి ఐకానిక్ Motorola Razr ఫ్లిప్ ఫోన్లను పునరుద్ధరిస్తూ లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ వీటిని తీసుకొచ్చింది. ప్రస్తుతం వీటి ధరలను మోటరోలా భారీగా తగ్గించింది. అధిక ధరల కారణంగా అప్పుడు కొనలేకపోయినవారు ఇప్పుడు కొనవచ్చు. రూ.20,000 తగ్గింపు మోటరోలా భారత్‌లో తన మోటో రేజర్ 40, మోటో రేజర్ 40 అల్ట్రా ఫ్లిప్ ఫోన్లకు గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది. మోటో రేజర్ 40 ధరను రూ. 15,000 తగ్గించింది. దీని అసలు ధర రూ. 59,999 కాగా ఇప్పడు రూ. 44,999కి తగ్గింది. అదేవిధంగా మోటో రేజర్ 40 అల్ట్రా ధరను ఏకంగా రూ. 20,000 తగ్గించింది. రూ. 89,999 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 69,999కే కొనుక్కోవచ్చు. మోటరోలా అధికారిక వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి. మోటో రేజర్ 40 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 144 Hz రిఫ్రెష్ రేట్, 1080×2640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.90-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే, 1.50-అంగుళాల సెకండరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్. ఇందులో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అజూర్ గ్రే, చెర్రీ పౌడర్, బ్రైట్ మూన్ వైట్ రంగులలో లభ్యం 4200 mAh బ్యాటరీ, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ మోటో రేజర్ 40 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు 1080×2640 పిక్సెల్స్ రిజల్యూషన్, 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల ప్రైమరీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ద్వారా ఆధారితం 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 12-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇన్ఫినిట్ బ్లాక్, వివా మెజెంటా రంగులలో లభ్యం వైర్లెస్, వైర్డు ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే 3800mAh బ్యాటరీ -
కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ మోటరోలా కొత్తగా మోటో జీ32 ఫోన్లో రెండు రంగుల్లో కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. రోజ్ గోల్డ్, శాటిన్ మెరూన్ వీటిలో ఉన్నాయి. దీనితో జీ32 మొత్తం నాలుగు వేరియంట్స్‌లో లభిస్తున్నట్లవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే శాటిన్ సిల్వర్, మినరల్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. గత సంవత్సరం 4జీబీ+ 64జీబీ మోడల్ విడుదలకాగా ఈ సంవత్సరం ప్రారంభంలో 8జీబీ + 128జీబీ వెర్షన్ లాంచ్ అయింది. జీ32 ధర రూ. 11,999 గా ఉంది. ఇందులో 8జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33వాట్స్ టర్బోపవర్ చార్జర్, 50 ఎంపీ క్వాడ్ ఫంక్షన్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 680 ఆక్టా–కోర్ ప్రాసెసర్, 6.5 అంగుళాల డిస్ప్లే తదితర ఫీచర్స్ ఉన్నాయి. -
మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!
న్యూఢిల్లీ: మోటరోలా సంస్థ జీ సిరీస్‌లో భాగంగా జీ13 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఉన్న ఈ ఫోన్ ధర రూ.9,999. ఏప్రిల్ 5న ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు మొదలవుతాయని మోటరోలా ప్రకటించింది. (హోండా నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ టూ వీలర్లు.. ఈవీల కోసం ప్రత్యేక ప్లాంటు!) ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ క్వాడ్ పిక్సల్ కెమెరా సిస్టమ్ ఉండగా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, 6.5 అంగుళాల, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో కూడిన డిస్ ప్లే తదితర ఫీచర్లు ఉన్నాయి. (UPI Charges: సాధారణ యూపీఐ చెల్లింపులపై చార్జీలు ఉండవు.. ఎన్పీసీఐ వివరణ) -
సంచలనం: ప్రపంచంలోనే తొలి 200 మెగాపిక్సెల్ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే!
అమెరికా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటరోలా ప్రపంచంలో తొలిసారి 200ఎంపీ మెగా ఫిక్సెల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేయనుంది. మోటో ఎక్స్ 30 ప్రో పేరుతో ఈ ఫోన్ ఆగస్ట్ 2న చైనాలో విడుదల కానుంది. చైనా మీడియా కథనాల ప్రకారం..మోటో ఎక్స్ 30 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జనరేషన్ 1 ప్రాసెసర్, 125 డబ్ల్యూ జెన్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ 12జీబీ ర్యామ్ సౌకర్యం ఉందని పేర్కొన్నాయి.ఇక ఈ ఫోన్లో డ్రమెటిక్ బ్యాగ్ గ్రౌండ్ ఇమేజెస్ తీసుకునేందుకు 85 ఎంఎం, 50 ఎంఎం, 35 ఎంఎం లెన్స్ ఫోకల్ లెగ్త్ సెన్సార్లు ఉన్నాయి. దీంతో పాటు క్లోజప్, పోట్రేట్ షాట్స్, 50 ఎంఎం లెన్స్‌తో స్టాండర్డ్ వ్యూయింగ్ యాంగిల్ ఫోటోలు తీసుకోవచ్చు. 35 ఎంఎం లెన్స్ తో క్లోసెస్ట్ వ్యూయింగ్ యాంగిల్లో సైతం ఫోటోల్ని ఫోన్లో క్యాప్చర్ చేయొచ్చు. మోటో ఎక్స్ 30 ప్రో స్పెసిఫికేషన్లు వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం..మోటో ఎక్స్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్ 30 ప్రో హెచ్‌డీప్లస్ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 12 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ మోడల్ ధర సుమారు రూ.59,990 ఉంటుందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
మొదలైన ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ సేల్
న్యూఢిల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సందర్బంగా బిగ్ సేవింగ్ డేస్ సేల్ ని తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(జనవరి 20) నుంచి జనవరి 24 వరకు కొనసాగనుంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ సంస్థ తన ఐదు రోజుల సేల్ లో ప్రముఖ మొబైల్ ఫోన్లు, టీవీలు వంటి ఇతర ఎలక్ట్రానిక్స్ పై మంచి ఆఫర్స్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ ప్రస్తుతం లైవ్ లో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు నిన్నటి నుంచే అందుబాటులో ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులు 10 శాతం(కార్డుపై రూ.1,500 వరకు) తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ సేల్ లో మొబైల్ పై తీసుకొచ్చిన కొన్ని ఉత్తమమైన ఆఫర్స్ మీకోసం అందిస్తున్నాం.(చదవండి: వాట్సాప్‌కు కేంద్రం గట్టి హెచ్చరిక) ఆపిల్ ఐఫోన్ 11: ఆపిల్ ఐఫోన్ 11 64జీబీ వేరియంట్ ఈ వారం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.48,999(అసలు రూ.54,900)కి లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ: ఆపిల్ ఐఫోన్ ఎస్ఈ 64జీబీ మోడల్ ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.31,999(అసలు రూ.39,900)కి లభిస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డుదారులకు రూ.3,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయినప్పటి నుంచి ఇదే అతి తక్కువ ధర. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్: శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 20 ప్లస్ మళ్లీ రూ.44,999(ఎంఆర్పి రూ.83,000)కి లభిస్తుంది. గెలాక్సీ ఎస్ 20 ప్లస్ ఇప్పటికీ ఈ ధర వద్ద మంచి ఎంపికగా కనిపిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గెలాక్సీ ఎస్ 20 ప్లస్ పై కూడా రూ.16,500 వరకు డిస్కౌంట్ లభించనుంది. పోకో ఎక్స్ 3: గత ఫ్లిప్‌కార్ట్ సేల్ లో పోకో ఎక్స్ 3ను కొనలేకపోయినట్లయితే ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో మరోసారి రూ.14,999 (ఎంఆర్పి రూ.19,999)కు కొనుగోలు చేయవచ్చు. పోకో ఎక్స్ 3 6.67-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732జీ ప్రాసెసర్ ఉంది. దీనిలో 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ లభిస్తుంది. మీకు 64 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తాయి. మోటో జీ 5జీ: మోటో జీ 5జీ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన 5జీ స్మార్ట్ఫోన్లలో ఒకటి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.18,999(ఎంఆర్పి రూ.24,999)కే లభిస్తుంది. మోటో జీ 5జీ 6.67-అంగుళాల ఫుల్-హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాల్కామ్ యొక్క స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. దీనిలో 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇది 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో 20వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్: ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఫోన్ ఈ బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ లో రూ.39,990(ఎంఆర్పి రూ.55,000)కి లభిస్తుంది. ఒకవేళ మీరు డ్యూయల్ స్క్రీన్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. -
ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇవి చూడండి?
భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో ఎప్పుడు చాలా గట్టి పోటీ ఉంటుంది. అందుకే చాలా మొబైల్ సంస్థలు ఈ పోటీని తట్టుకోవడానికి ప్రతి నెల ఎదో ఒక ఫోన్ ని విడుదల చేస్తూ ఉంటాయి. వీటితో మంచి ఆఫర్లను కూడా మొబైల్స్ పై అందిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం చైనా కంపెనీల మద్యే ఎక్కువ పోటీ ఉంది. ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో లాంచ్ చేయబోయే మొబైల్స్ ని మీకోసం తీసుకొస్తున్నాం. మొబైల్స్ యొక్క ధర, ఫీచర్స్ వంటి వివరాలు ఉన్నాయి. అందుకే ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు, బంధుమిత్రులకు షేర్ చేయండి. (చదవండి: వాట్సప్ స్టేటస్ ని సీక్రెట్ గా చూడండి) వివో వీ20 ప్రో 5జీ శాంసంగ్ ఏ32 5జీ ఒప్పో రెనో ప్రో 5జీ శాంసంగ్ ఏ12 ఒప్పో రెనో ప్రో ప్లస్ 5జీ రెడ్ మీ నోట్ 10 5జీ ఒప్పో రెనో 5ప్రో రెడ్ మీ నోట్ 10 5జీ ప్రో రియల్ మీ ఎక్స్ 7 ప్రో పోకో ఎం3 రియల్ మీ ఎక్స్ 7 ఒప్పో ఏ53 5జీ రియల్ మీ వి5 మోటో జీ9 పవర్ -
ప్రీమియం ఫీచర్లతో మోటరోలా 4 స్మార్ట్ఫోన్లు
మోటరోలా స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. మోటో జీ సిరీస్‌కు కొనసాగింపుగా జి 7, జి 7 ప్లే, జి7 ప్లస్, జి 7 పవర్‌ను స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరికి భారతీయ మార్కెట్లో లభ్యం కానున్నాయి. నాచ్ డిస్ప్లే లాంటి ప్రీమియం ఫీచర్లతో, ప్రీమియం ధరల్లో వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు సుమారు ఇలా ఉండనున్నాయి. మోటో జి 7 ధర రూ. 30,748 మోటో జి 7 ప్లే ధర రూ. 19,210 మోటో జి 7 పవర్ ధర రూ.26, 899 మోటో జి 7ప్లస్ ధర రూ. 19వేలు రూ.36,517 మోటో జి 7 ఫీచర్లు 6.24 అంగుళాల డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 632 ఆండ్రాయిడ్ 9.0 పై 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 12+5ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా మోటో జి 7 పవర్ ఫీచర్లు 6.24 అంగుళాల డిస్ప్లే ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 636 16+5ఎంపీ రియర్ కెమెరా 12 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఏపీలో 50 మోటో హబ్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రిటైల్ స్టోర్ల విస్తరణపై మోటోరోలా ఇండియా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘మోటో హబ్’ పేరిట ఒకేసారి 12 పట్టణాల్లో 50 స్టోర్లను ప్రారంభించింది. ఇటీవలే విడుదల చేసిన మోటో ఎక్స్4, మోటో జే2 ఫోర్స్‌తో పాటు మోటో ఈ4ప్లస్, మోటీజీ5 ఎస్‌ప్లస్ సహా అన్ని రకాల మోడల్స్ ఈ ఔట్లెట్లలో అందుబాటులో ఉంటాయని మోటోరోలా మొబిలిటీ ఇండియా రీజనల్ సేల్స్ హెడ్ బీవీ మల్లిఖార్జున రావు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 100 నగరాల్లో 1,000 స్టోర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వీటితోపాటు బిగ్‌సీ, లాట్ మొబైల్స్‌తో కూడా మోటోరోలా ఒప్పందం కుదుర్చుకుంది. -
మార్కెట్లోకి ‘మోటో ఎక్స్4’
న్యూఢిల్లీ: లెనొవొ గ్రూప్‌నకు చెందిన ‘మోటరోలా’ తాజాగా ‘మోటో ఎక్స్4’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇది ప్రధానంగా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. 3 జీబీ ర్యామ్/32 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.20,999గా, 4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.22,999గా ఉంది. మోటో ఎక్స్4లో డ్యూయెల్ ఆటోఫోకస్ పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 12 ఎంపీ+8 ఎంపీ రియర్ కెమెరా, లో–లైట్ మోడ్ ఫీచర్ ఉన్న 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, డ్యూయెల్ సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 7.1.1 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్, 5.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, ఐపీ 68 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో పవర్ చార్జర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. కాగా ఈ ఫోన్లు కేవలం ఫ్లిప్‌కార్ట్, మోటో హబ్ షాప్స్‌లో బ్లాక్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. -
మోటొరోలా జీ5 వచ్చేసింది
ధర రూ.11,999 న్యూఢిల్లీ: మోటొరోలా కంపెనీ మోటో జీ సిరీస్‌లో ఐదవ తరం ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. మోటొ జీ5 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్ ధర రూ.11,999 గా నిర్ణయించామని మోటొరోలా మొబిలిటీ ఇండియా ఎండీ సుధిన్ మాధుర్ చెప్పారు అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. షావొమి, మైక్రోమ్యాక్స్, లెనొవొ కంపెనీలకు చెందిన ఈ రేంజ్ ధర ఉన్న స్మార్ట్ఫోన్లకు ఈ మోటొ జీ5 గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. ఆండ్రాయిడ్ నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుందని మాధుర్ చెప్పారు. ఈ ఫోన్లో 5 అంగుళాల డిస్ప్లే, 1.4 గిగా హెట్జ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా–కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 128 జీబీ వరకూ ఎక్స్పాండ్ చేసుకోగల మెమరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. -
మోటో యానివర్సరీ సేల్.. నేడు, రేపు భారీ ఆఫర్లు
మోటోరోలా మూడో యానివర్సరీ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. మోటో అఫిషియల్ అమ్మకం దారు ఫ్లిప్‌కార్టులో ఈ నెల 20, 21న మోటో డేస్ సేల్‌ను నిర్వహించనున్నారు. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో జీ టర్బో ఎడిషన్, మోటో జీ( 2వ తరం), మోటో ఎమ్, మోటో ఈలు ఆఫర్ కిందకు వస్తాయి. మోటో జెడ్, మోటో జెడ్ ప్లే, మోటో ఎమ్ స్మార్ట్ఫోన్లపై రూ.20 వేల వరకూ ఎక్చేంజ్ సదుపాయం ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ల కొనుగోలుపై రూ.1000లను మోటోరోలా డిస్కౌంట్ ఇస్తుంది. మోటో ఈ, మోటో జీ టర్బో ఎడిషన్లపై ఫ్లిప్‌కార్ట్ రూ.500లను డిస్కౌంట్ ఇస్తోంది. మోటో జీ(3వ తరం, 8జీబీ) ఫోన్ రూ.7,999, మోటో జీ(2వ తరం, 16జీబీ) రూ.6,999లకే అమ్మకానికి ఉంటాయి. -
మోటో రాజర్ రిటర్న్స్?
ఐఫోన్ రాకముందు.. అంటే 2004 సంవత్సరంలో ఎవరి చేతిలో చూసిన మోటోరోలా రాజరే ఫ్యాషన్ ఐకాన్ గా ఉండేది. మోటుగా కనిపించే నోకియాలకు భిన్నంగా విప్లవాత్మకమైన డిజైన్ తో ప్రపంచానికి రాజర్ ఫోన్ ను పరిచయం చేసింది మోటోరోలా. ప్రపంచంలోనే అత్యధిక అమ్ముడుపోయిన ఈ ఫోన్, 10 ప్రముఖ ఫోన్లలో ఒకటిగా నిలిచింది. అయితే ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ లోకంగా మారాక, ఫ్యాషన్ ఐకాన్ గా ఉన్న రాజర్ ఫోన్ కనుమరుగైంది. మోటోరోలా సైతం స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా దృష్టిసారించడం ప్రారంభించింది. అయితే అప్పట్లో 2.2 అంగుళాలతో చిన్నగా, క్యూట్ గా ఉన్న రాజర్ ఫోన్లు మళ్లీ మార్కెట్లోకి రాబోతున్నాయట. అమెరికన్ హైస్కూల్ పిల్లలతో "06.09.2016" అనే టైటిల్ తో రూపొందించిన ఓ టీజర్ వీడియోను మోటోరోలా యూట్యూబ్ లో పోస్టు చేసింది. నిన్నటి రాజర్ కాలాన్ని వెనక్కి తీసుకు రాబోతున్నామని, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండడి అనే క్యాప్షన్ తో ఈ వీడియో ఉంది. వీడియో చివరి అక్షరాలుగా టీటీవైఎల్(టెస్ట్ పార్లెన్స్ ఫర్ టాక్ టూ యూ లేటర్ అంటే టెస్ట్ పరిభాషకోసం మీతో తర్వాత చర్చిస్తాం) అనే సందేశాన్ని ఇచ్చాయి. మోటోరోలా ఈ ఈవెంట్ ను జూన్ 9న చేపట్టబోతుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. జూన్ లో ఓ ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మోటో ఎక్స్ ను కంపెనీ ప్రవేశపెట్టబోతోంది. అయితే ఈ ఫోన్ ఇప్పటివరకూ వచ్చిన రెక్టాగ్యులర్ స్మార్ట్ ఫోన్ల మాదిరిగా కాకుండా.. కొత్తగా ఉండబోతుందని మార్కెట్ వర్గాల టాక్. 2011లో వచ్చిన రాజర్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ తో ఈ ఫోన్ తీసుకురావొచ్చని సంకేతాలు వస్తున్నాయి. ఇటీవల వస్తున్న స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ స్క్రీన్ తో, అన్ని యాప్స్ సపోర్టు చేయని విధంగా రాజర్ ఉన్నప్పటికీ, స్మార్ట్ ఫోన్లకు ఎదురవుతున్న ఎదురుదెబ్బలే రాజర్ రిటర్న్ కు మార్కెట్ ను సృష్టించబోతాయని తెలుస్తోంది. ఆ ఫోన్ సరళతే దాని మార్కెట్ కు దోహదంచేస్తుందని టాక్. -
మోటో నుంచి 4జీ ఫోన్ వస్తోంది!
ఇప్పటివరకూ మన దేశంలో 3జీ సేవలే సంపూర్ణస్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్నది 2జీ ఇంటర్నెట్ సేవలే. అయితే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మాత్రం ఈ విషయంలో చాలా వేగంగా ముందడుగులు వేస్తున్నాయి. త్వరలోనే మోటో వాళ్ల నుంచి 4జీ స్మార్ట్‌ఫోన్ రానున్నది. ఇటీవల మోటో- ఇ సెకెండ్ జనరేషన్ ను విడుదల చేసిన ఈ కంపెనీ త్వరలోనే నాలుగోతరం ఇంటర్నెట్ సేవలను అందిపుచ్చుకోగల డివైజ్‌లను ఆవిష్కరించనున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ధర తదితరాలను పేర్కొనలేదు. అన్ని వివరాలనూ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.