మోటొరోలా జీ5 వచ్చేసింది | Motorola launches Moto G5 in India for Rs11,999 | Sakshi
Sakshi News home page

మోటొరోలా జీ5 వచ్చేసింది

Published Wed, Apr 5 2017 12:27 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

మోటొరోలా జీ5 వచ్చేసింది

మోటొరోలా జీ5 వచ్చేసింది

ధర రూ.11,999
న్యూఢిల్లీ: మోటొరోలా  కంపెనీ మోటో జీ సిరీస్‌లో ఐదవ తరం ఫోన్‌ను భారత మార్కెట్లోకి తెచ్చింది. మోటొ జీ5 పేరుతో అందిస్తున్న ఈ ఫోన్‌ ధర రూ.11,999 గా నిర్ణయించామని మోటొరోలా మొబిలిటీ ఇండియా ఎండీ సుధిన్‌ మాధుర్‌ చెప్పారు అమెజాన్‌డాట్‌ఇన్‌ ద్వారా  ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. షావొమి, మైక్రోమ్యాక్స్, లెనొవొ కంపెనీలకు చెందిన ఈ రేంజ్‌ ధర ఉన్న స్మార్ట్‌ఫోన్లకు ఈ మోటొ జీ5 గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

ఆండ్రాయిడ్‌ నూగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుందని మాధుర్‌ చెప్పారు.  ఈ ఫోన్‌లో 5 అంగుళాల డిస్‌ప్లే, 1.4 గిగా హెట్జ్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ ఆక్టా–కోర్‌ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, 128 జీబీ వరకూ ఎక్స్‌పాండ్‌ చేసుకోగల మెమరీ, 13 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా, 5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 2,800 ఎంఏహెచ్‌ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement