మోటో నుంచి 4జీ ఫోన్ వస్తోంది! | Moto 4G phone is coming | Sakshi
Sakshi News home page

మోటో నుంచి 4జీ ఫోన్ వస్తోంది!

Published Wed, Mar 11 2015 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

Moto 4G phone is coming

ఇప్పటివరకూ మన దేశంలో 3జీ సేవలే సంపూర్ణస్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్నది 2జీ ఇంటర్నెట్ సేవలే. అయితే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మాత్రం ఈ విషయంలో చాలా వేగంగా ముందడుగులు వేస్తున్నాయి. త్వరలోనే మోటో వాళ్ల నుంచి 4జీ స్మార్ట్‌ఫోన్ రానున్నది.

ఇటీవల మోటో- ఇ సెకెండ్ జనరేషన్ ను విడుదల చేసిన ఈ కంపెనీ త్వరలోనే నాలుగోతరం ఇంటర్నెట్ సేవలను అందిపుచ్చుకోగల డివైజ్‌లను ఆవిష్కరించనున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ ఫోన్ ధర తదితరాలను పేర్కొనలేదు. అన్ని వివరాలనూ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement