![A 20 year Young Man Was Addicted To Mobile That He Is Now Suffering From Mental Illness - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/30/mobile-addiction.jpg.webp?itok=NzmwpqyZ)
జైపూర్: ఓ యువకుడు స్మార్ట్ ఫోన్‌కు విపరీతంగా అడిక్ట్ అయ్యి గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు. తీవ్రమానసిక సమస్యతో కన్నతల్లిదండ్రులను కూడా గుర్తించలేని స్థితికి చేరుకున్నాడు. అసలేంజరిగిందంటే..
రాజస్థాన్‌లోని చూరు జిల్లాలో సహ్వా టౌన్‌కు చెందిన అక్రామ్ (20) స్మార్ట్ ఫోన్ మోజులోపడి గతనెల రోజుల్లో చేస్తున్న బిజినెస్‌ను వదిలేశాడు. అంతేకాకుండా గత ఐదురోజులుగా నిద్రకూడా పోవట్లేదట. పరిస్థతి విషమించడంతో కుటుంబసభ్యులు భార్టియా ఆసుపత్రి ఎమర్జెన్సీ వర్డులో చేర్పించారు. ప్రస్తుతం సైకియాట్రస్టులు వైద్యం అందిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
అతనికి వరుసకు మామైన అర్బాజ్ మాట్లాడుతూ ‘మా ఊరిలోనే అక్రమ్‌కు ఎలక్ట్రిక్ వైడనింగ్ వ్యాపారం ఉంది. ఐతే గత నెల రోజులుగా అధిక సమయం మొబైల్‌తోనే గడుపుతున్నాడు. ఫోన్ చూడటంలోపడి చేస్తున్న పని కూడా మానేశాడు. కుటుంబసభ్యులు పదేపదే చెప్పినా మొబైల్‌ని చూడటం మాత్రం మానలేదని తెలిపాడు. కొన్ని రోజులుగా రాత్రంతా మొబైల్‌లో చాట్‌లు, గేమ్‌లు ఆడుతున్నాడు. తినడం, త్రాగటం కూడా మానేశాడని తల్లి ఆవేధనతో స్థానిక మీడియాకు తెల్పింది. ఈ విషయమై మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ జితేంద్ర కుమార్ మాట్లాడుతూ.. యువకుడికి సిటీ స్కాన్ చేసి చికిత్స అందిస్తున్నామన్నారు.
చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!!
Comments
Please login to add a commentAdd a comment