ఢిల్లీకి చెందిన 22 సంవత్సరాల శ్రుతి అగర్వాల్ ఒకప్పుడు సినిమా చూస్తే.. ఆ సినిమా గురించి ఆర్డర్ తప్పకుండా సీన్ బై సీన్ చెప్పేది. ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన సినిమా అయినా సరే ఈరోజే చూసినంత ఫ్రెష్‌గా చెప్పేది. అలాంటి శ్రుతికి రెండు వారాల క్రితం చూసిన సినిమా కథ కూడా గుర్తుండడం లేదు అనేది ఒక విషయం అయితే కొత్త వారి పేర్లు త్వరగా మరచిపోవడం మరో విషయం. తనకు మతిమరుపు దగ్గరవుతుంది అని చెప్పడానికి ఈ రెండే కాదు ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.శృతికి ఎలాంటి దురలవాట్లు లేవు. వేళకు నిద్ర పోతుంది. సరిౖయెన ఆహారం తీసుకుంటుంది.
మరి ఎందుకు తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతోంది?
తనను తాను విశ్లేషించుకునే సమయంలో ఎప్పుడో స్కూల్ రోజుల్లో చదువుకున్న ‘యూజ్ ఇట్ ఆర్ లూస్ ఇట్’ అనే సామెత గుర్తుకువచ్చింది. అందులోనే తన సమస్యకు సగం పరిష్కారం కనిపించింది. స్కూల్, కాలేజీ రోజుల్లో ఏదైనా లెక్క చేయాలంటే మనసులో క్యాలిక్యులేట్ చేసుకోవడమో, కాగితం మీద చేయడమో జరిగేది. ఇప్పుడు మనసుతో పనిలేదు. చిన్నాచితకా లెక్కలకైనా స్మార్ట్‌ఫోన్‌లోని క్యాలిక్యులేటర్‌పై అతిగా ఆధారపడుతుంది. ఒక శుభకార్యం లేదా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాన్ని గుర్తు పెట్టుకోవడానికి ఆ తేదీని మదిలో ముద్రించుకునేది..
ఇప్పుడు సెల్‌ఫోన్‌లోని రిమైండర్‌కు పని చెబుతోంది. తన మెదడును సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే తనకు మతిమరపు దగ్గరవుతోందని గ్రహించిందామె. తనకు ఇప్పుడు కావాల్సింది బ్రెయిన్‌కు ఎక్సర్‌సైజ్ అనే విషయం అర్థమైంది. దీని గురించిన సమాచార శోధనలో తనను ఆకట్టుకున్నది.... పురాతనమైన మెమోరైజేషన్ స్ట్రాటజీ... మెథడ్ ఆఫ్ లోకి. మెమోరీ కోచ్, అథ్లెట్ బోరిస్ నికోలాయ్ వందల పేర్లను కేవలం పదిహేను నిమిషాల వ్యవధిలో గుర్తు పెట్టుకొని చెబుతాడు. నికోలాయ్ నెదర్లాండ్స్‌కు చెందిన న్యూరోసైంటిస్ట్ మార్టిన్ డ్రెస్లర్‌తో కలిసి ఒక అధ్యయనం నిర్వహించాడు. అందులో భాగంగా 20 ఏళ్ల వయసు ఉన్న 51 మందిని మూడు గ్రూప్‌లుగా విభజించారు.
మొదటి గ్రూప్ చేత ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాక్టిస్ చేయించారు. రెండోగ్రూప్ చేత షార్ట్‌టర్మ్ మెమొరీ గేమ్స్ ఆడించారు. మూడో గ్రూప్‌కు మాత్రం ఎలాంటి కార్యక్రమం ఇవ్వలేదు. ఆరువారాల తరువాత... మొదటి గ్రూప్ మెమొరీ పవర్ పెరిగింది. రెండు, మూడు గ్రూప్‌లలో పెద్దగా మార్పు కనిపించలేదు. పురాతనమైన ‘మెథడ్ ఆఫ్ లోకి’ ప్రాధాన్యత కోల్పోలేదు అని చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. అందుకే యూత్ దీనిపై ఆసక్తి కనబరుస్తోంది. ‘
మెథడ్ ఆఫ్ లోకి’ని మెమొరీ జర్నీ, మెమొరీ ప్యాలెస్... మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. ‘లోకి’ అనేది ‘లోకస్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం... ప్రదేశం. సమాచారాన్ని మనసులోని ఊహాజనిత ప్రదేశాల్లో స్థిరపరుచుకోవడమే ‘మెథడ్ ఆఫ్ లోకి’ టెక్నిక్.ఉదాహరణకు...717, 919, 862, 9199.. లను గుర్తు పెట్టుకోవాలనుకుంటే మనసులో సుపరిచితమైన ప్రదేశాన్ని ఆవిష్కరించుకోవాలి. సపోజ్ మన ఇల్లు. ఆ ఇంట్లో కిచెన్‌కు ఒక సంఖ్య, డోర్‌కు ఒక సంఖ్య, విండోకు ఒక సంఖ్య ఇచ్చుకోవాలి.
స్థూలంగా చెప్పాలంటే...
‘మెథడ్ ఆఫ్ లోకి’ని ప్రాక్టీస్ చేసినా, రకరకాల మెమోరీ గేమ్స్ ఆడినా, జ్ఞాపకశక్తికి సంబంధించిన అద్భుతమైన పుస్తకాలు చదివినా... శక్తిహీనత ప్రమాదం నుంచి బయటపడి జ్ఞాపకశక్తిని పదిలపరుచుకునే ప్రయత్నమే అవుతుంది. మంచిదే కదా!
బిల్‌గేట్స్ నుంచి యూత్ వరకు...
కోచీ(కేరళ)కు చెందిన 24 సంవత్సరాల కైష తన జ్ఞాపకశక్తి బలహీనం అవుతున్న సమయంలో చదివిన పుస్తకం ‘మూన్‌వాకింగ్ విత్ ఐన్‌స్టీన్: ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ రిమెంబరింగ్ ఎవ్రీ థింగ్’ ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చింది. జాషువా ఫోయర్ ఎంతో పరిశోధించి, విశ్లేషించి రాసిన ఈ పుస్తకానికి యువతలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బిల్‌గేట్స్‌కు బాగా నచ్చిన పుస్తకం ఇది. 320 పేజీల ‘మూన్‌వాకింగ్ విత్ ఐన్‌స్టీన్’ లో ఫోయర్ రకరకాల నిమానిక్ టూల్స్ (జ్ఞాపక శక్తికి ఉపకరించేవి) నుంచి ఇంగ్లాండ్‌కు చెందిన విద్యావేత్త టోనీ బుజాన్ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్ వరకు ఎన్నో అంశాలు ప్రస్తావించాడు.
(చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!)
Comments
Please login to add a commentAdd a comment