అత్యాధునిక ఫీచర్లతో తక్కువ ధరలో రిలయన్స్ అందిస్తున్న జియో ఫోన్ పట్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదట వినాయక చవితికి ఈ ఫోన్‌ని మార్కెట్‌లోకి తెస్తామంటూ రిలయన్స్ చైర్మన్ ముఖేశ్ అంబానీ ప్రకటించినా.. వాస్తవంలో అది సాధ్యపడలేదు.
గూగుల్, రిలయన్స్ సంస్థలు భారతీయు అవసరాలకు తగ్గట్టుగా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఇందులో కొత్తగా ప్రగతి అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ని సైతం పొందు పరిచారు. వాయిస్ కమాండ్, ట్రాన్స్‌లేట్ తదితర ఫీచర్లు ఈ మొబైల్‌లో ఉన్నాయి. అయితే ఈ ఫోన్ ఇంకా మార్కెట్‌లోకి రాలేదు. కానీ మొదటి వీడియోను ఏఎన్‌ఐ నెట్‌వర్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
#WATCH | Reliance's JioPhone Next jointly designed by Jio & Google.
— ANI (@ANI) October 30, 2021
JioPhone Next is a first-of-its-kind smartphone featuring Pragati OS, an optimized version of Android made for the JioPhone Next. pic.twitter.com/A2mknOOtDN
Comments
Please login to add a commentAdd a comment