ఈవీలకు వైర్‌లెస్‌ చార్జింగ్‌ | Wireless charging for EVs | Sakshi

ఈవీలకు వైర్‌లెస్‌ చార్జింగ్‌

Jun 18 2025 8:43 AM | Updated on Jun 18 2025 8:43 AM

Wireless charging for EVs

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో ప్రయోగం 

స్మార్ట్‌ ఫోన్‌ సహాయంతో ఆపరేటింగ్‌ 

ఓయూలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్ల పరిశోధన  

ఉస్మానియా యూనివర్సిటీ: కాలుష్య నియంత్రణ, ఇంధన కొరత కారణంగా భవిష్యత్‌లో విద్యుత్‌ వాహనాల వినియోగం భారీ సంఖ్యలో పెరగనున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఓయూ క్యాంపస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్లు వైర్‌లెస్‌ చార్జింగ్‌పై పరిశోధన ప్రారంభించారు. ద్విచక్ర వాహనాల నుంచి బస్సులు ఇతర భారీ వాహనాల వరకు ఎలక్ట్రికల్‌ వాహనాలకు కావాల్సిన పవర్‌ను (విద్యుత్‌) బ్యాటరీల చార్జింగ్‌ ద్వారా పొందుతాయి. 

విద్యుత్‌ చార్జింగ్‌ సెంటర్లు అంతటా అందుబాటులో ఏర్పాటు చేయరు. అనుకోకుండా వాహనం బ్యాటరీలో చార్జింగ్‌ లేనప్పుడు వెంటనే పొందేందుకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీని రూపొందించి వైర్‌లెస్‌ చార్జింగ్‌ కోసం లోతైన పరిశోధనలు చేస్తున్నట్లు  ప్రొఫెసర్లు తెలి పారు. ఈ పద్ధతి వల్ల విద్యుత్‌ ఆదాతో పాటు స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ ద్వారా ఎలక్ట్రికల్‌ వాహనాలకు  వైర్‌లెస్‌ చార్జింగ్‌ చేసుకోవచ్చు అని వివరించారు.  

స్మార్ట్‌ ఫోన్‌తో ఆపరేటింగ్‌ 
స్మార్ట్‌ ఫోన్‌లో ఉబర్, ఓలా యాప్‌ నుంచి వాహనాలను బుక్‌ చేసుకున్నట్లు పవర్‌ను బుక్‌ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌లో యాప్‌ను ఉపయోగించి కావాల్సిన పవర్‌ను బుక్‌ చేసుకొని  పొందవచ్చు అని ప్రొఫెసర్లు వివరించారు. ఎలక్ట్రికల్‌ వాహనదారు బయటికి వెళ్లినప్పుడు (షాపింగ్‌ మహల్, సినిమా, నగరంలోని ఇతర ప్రాంతాలు) అనుకోకుండా వాహనం బ్యాటరీలో పవర్‌ లేనప్పుడు వైర్‌లెస్‌ చార్జింగ్‌ ద్వారా అవసరమున్నంత పవర్‌ను చార్జింగ్‌ బుక్‌ చేసుకొని కొనుగోలు చేయవచ్చు. వాహనంలో అధికంగా పవర్‌ ఉన్నప్పుడు ఇతరులకు విక్రయించవచ్చు.    

మీటర్‌ మించి దూరం ఉండొద్దు.. 
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న  యాప్‌లను స్మార్ట్‌ ఫోన్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకొని థర్డ్‌ పార్టీ (మూడో వ్యక్తి)  ద్వారా పవర్‌ను (విద్యుత్‌) క్రయ, విక్రయాలు చేయవచ్చు అని తెలిపారు. అయితే.. వాహనానికి, వాహనానికి మధ్య దూరం మీటరు మించి ఉండకూడదన్నారు. బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ ద్వారా వైర్‌లెస్‌ పవర్‌ చార్జింగ్‌ విధానాన్ని కనిపెట్టినట్లు చెప్పారు. ఎలక్ట్రికల్‌ వాహనం నుంచి పవర్‌ గ్రిడ్‌కు పవర్‌ గ్రిడ్‌ నుంచి మరో వాహనానికి విద్యుత్‌ అందించవచ్చు ప్రొఫెసర్లు తెలిపారు. ఈ విధానం కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగంలో ఉన్నప్పటికీ.. దుబారా లేకుండా నాణ్యత ప్రమాణాలతో కూడిన పవర్‌ చార్జింగ్‌ కోసం పరిశోధనలు చేస్తున్నట్లు ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్లు వివరించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement