heavy discounts
-
ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్
ఐఫోన్ 16 సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి యాపిల్ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 మోడల్ ధర భారీగా తగ్గింది. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 14 ప్లస్ ధర రూ. 79,600 లుగా ఉంది. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొంటే రూ. 56,000 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ బేస్ వేరియంట్ రూ. 56,499కి అందుబాటులో ఉంది. అంటే ఈ ఫోన్ కొనుగోలుపై కొనుగోలుదారులు రూ.23,101 ఆదా చేసుకోవచ్చు. దీంతో పాటు, యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు కూడా పొందవచ్చు. అంటే ఐఫోన్ 14 ప్లస్ రూ.55,499కే లభిస్తుందన్న మాట.ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్» 1200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో పెద్ద » 6.7-అంగుళాల స్క్రీన్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే» డిస్ప్లే దెబ్బతినకుండా సిరామిక్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్» A15 బయోనిక్ చిప్సెట్» 12-మెగాపిక్సెల్ రియర్ డ్యూయల్ కెమెరా» 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా -
ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ల్యాప్టాప్స్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి స్థానంలో ఉన్న ఐటీ మాల్.. దీపావళి నేపథ్యంలో హెచ్‌పీ, డెల్, లెనోవో, ఏసర్, ఆసస్, అవిటా బ్రాండ్ల ల్యాప్‌టాప్స్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే స్క్రాచ్ కార్డుపై రూ.2,500 నుంచి రూ.50,000 వరకు నగదు, ల్యాప్‌టాప్, మొబైల్స్ వంటి బహుమతులు గెలుచుకోవచ్చు. రూ.5,000 వరకు విలువైన యాక్సెసరీస్ కూడా ఉచితంగా అందుకోవచ్చని ఐటీ మాల్ ఎండీ మొహమ్మద్ అహ్మద్ తెలిపారు. పరిశ్రమలో తొలిసారిగా 70–80% కొత్త మోడళ్లు కొలువుదీరాయని చెప్పారు. కంపెనీలు 10 శాతం వరకు ధరలను తగ్గించడం వినియోగదార్లకు ప్రయోజనం అన్నారు. జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ ఆఫర్ చేస్తున్నామని చెప్పారు. ధరల శ్రేణి రూ.20,000లతో మొదలుకుని రూ.7 లక్షల వరకు ఉంది. -
వాహన విక్రయాలు తగ్గాయి!
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన విక్రయాలు 2018 డిసెంబర్లో నెమ్మదించాయి. సంవత్సరాంతపు ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు ఎన్ని ప్రకటించినా... వాహనాల విక్రయాలు మాత్రం అనుకున్న స్థాయిలో వృద్ధి చెందలేదు. జనవరిలో ధరలు కూడా పెరుగుతుండటం ఇక్కడ గమనార్హం. కాగా లిక్విడిటీ (నగదు లభ్యత) కొరత వంటి ప్రతికూల స్థూల ఆర్థిక పరిస్థితుల వల్ల సవాళ్లు ఎదుర్కొవాల్సి వచ్చిందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సేల్స్ మార్కెటింగ్ డైరెక్టర్, ఎస్వీపీ రాజేష్ గోయల్ చెప్పారు. డిసెంబర్లో హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ అమ్మకాలు కేవలం ఒక శాతం వృద్ది రేటుకే పరిమితం కాగా.. మహీంద్రా అండ్ మహీంద్ర, మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు ఏకంగా తగ్గుదలను నమోదుచేశాయి. ఎం అండ్ ఎం: పీవీ సేల్స్ 4% డౌన్ డిసెంబర్లో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 15,091 యూనిట్లుగా నమోదైనట్లు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) ప్రకటించింది. 2017లో ఇదే కాలానికి విక్రయించిన 15,543 యూనిట్లతో పోలిస్తే 4 శాతం తగ్గుదల నమోదైంది. వాణిజ్య వాహన అమ్మకాల్లో సైతం 4 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. టాటా మోటార్స్: పీవీ విక్రయాలు 1 శాతం అప్ దేశీ విక్రయాల్లో 8%క్షీణత చోటుచేసుకుంది. 2018 డిసెంబర్లో 50,440 యూనిట్లు విక్రయించగా.. 2017 డిసెంబర్లో 54,627 యూనిట్లు అమ్ముడైనట్లు తెలిపింది. ప్యాసింజర్ వాహన విక్రయాలు డిసెంబర్లో 14,260 యూనిట్లు కాగా, 2017 డిసెంబర్లో ఈ సంఖ్య 14,180. హ్యుందాయ్: 4.6 శాతం వృద్ధి 2018 డిసెంబర్లో 42,093 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. అంతకుముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 40,158 యూనిట్లతో పోలిస్తే 4.6 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రకటించింది. మారుతీ సుజుకీ: 1.3 శాతం తగ్గిన పీవీ సేల్స్ గతనెల ప్యాసింజర్ వాహన అమ్మకాలు 1,28,338 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది ప్రాతిపదికన చూస్తే 1.3 శాతం తగ్గుదల నమోదయింది. దేశీ అమ్మకాలు మాత్రం 1,21,479 యూనిట్లకు చేరుకుని 1.8 శాతం వృద్ధి చెందినట్లు సంస్థ తెలిపింది. మిని కార్ విభాగంలో ఆల్టో 27,661 యూనిట్లు, వ్యాగన్ఆర్ 27,661 యూనిట్లు అమ్ముడవగా.. కాంపాక్ట్ విభాగంలో స్విఫ్ట్, డిజైర్ అమ్మకాలు 3.8 శాతం తగ్గినట్లు తెలిపింది. -
ఆన్లైన్ వినియోగదారులకు బ్యాడ్‌న్యూస్
న్యూఢిల్లీ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్, మింత్రా.. వంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో భారీ డిస్కౌంట్ల కోసం వేచిచూస్తున్నారా? ఈ సారి డిస్కౌంట్ ఆఫర్లో ప్రొడక్ట్‌లు కొనుగోలు చేయాలని ప్లాన్ వేసుకున్నారా? అయితే ఇది మీకు కచ్చితంగా నిరాశ కలిగించే వార్తనే. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఆఫర్ చేసే మెగా డిస్కౌంట్ ఆఫర్లకు ఇక త్వరలోనే కళ్లెం పడబోతుంది. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించి తక్కువ ధరలకు ప్రొడక్ట్‌లను విక్రయించే వాటిపై ఓ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని కోసం ప్రభుత్వం ఈ-కామర్స్ పాలసీ ముసాయిదాను కూడా ప్రతిపాదించింది. ఈ ముసాయిదాలో వినియోగదారులను ఆకర్షించేందుకు, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు ఇప్పటివరకు ఇస్తూ వచ్చిన భారీ డిస్కౌంట్ ఆఫర్లను నిలిపివేయాల్సి ఉందని ప్రతిపాదించారు. ఈ ముసాయిదా విధానాన్ని సోమవారం స్టేక్‌హోల్డర్స్‌కు కూడా షేర్ చేసింది. ఈ ప్రతిపాదిత చట్టంలోకి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్లైన్ విక్రయ సంస్థలతో పాటు స్విగ్గీ, జొమాటో లాంటి ప్రముఖ ఫుడ్ డెలివరీ సైట్లు, ఆర్థిక లావాదేవీలు అందించే పేటీఎం, అర్బన్‌క్లాప్, పాలసీ బజార్ లాంటి ఆన్లైన్ ప్లాట్‌ఫాంలు రానున్నాయి. ఈ ముసాయిదా ఈ-కామర్స్ విధానాన్ని కేంద్రం, డేటా ప్రైవసీపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ అందించిన ప్రతిపాదనల మేరకు రూపొందించింది. వ్యక్తిగత వివరాల భద్రత బిల్లు- 2018 ముసాయిదాను జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఇందులో వ్యక్తుల కీలక సమాచారాన్ని భారత్‌లో ఉన్న కేంద్రాల్లోనే నిక్షిప్తం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పుడు ఈ-కామర్స్ విధాన ముసాయిదాను కూడా ఈ కమిటీ సిఫారసులకు అనుగుణంగానే రూపొందించినట్లు వాణిజ్య కార్యదర్శి- డిజిగ్నేట్ అనుప్ వాదవాన్ తెలిపారు. ఈ-కామర్స్ విధాన ముసాయిదా రూపకల్పన నిమిత్తం ఓలా, స్నాప్‌డీల్, మేక్ మై ట్రిప్, అర్బన్ క్లాప్, జస్ట్‌డయల్ ప్రతినిధులతో ఓ నిపుణుల కమిటీని కేంద్ర వాణిజ్య శాఖ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం భారత్ ఈ-కామర్స్ రంగం 25 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది ఈ దశాబ్దంలో 200 బిలియన్ డాలర్లను తాకనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారత్‌లో ఈ-కామర్స్ రంగం భారీగా బలపడింది. ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు వినియోగదారులను క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లు అక్రమ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తూ.. తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఫిజికల్ రిటైల్ స్టోర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ అమ్మకాల్లో అక్రమ డిస్కౌంట్లకు చెక్ పెట్టడానికి ఇప్పడివరకు ఎలాంటి నియంత్రణ వ్యవస్థ లేదు. కొన్ని బ్రాండులు సైతం తమ ఉత్పత్తులను ఆన్లైన్ సంస్థలు భారీ డిస్కౌంట్ విక్రయిస్తున్నాయని వాపోతున్నాయి. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని భావించిన ప్రభుత్వం, ముసాయిదా ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. -
వెహికిల్స్ బ్యాన్: ఇండస్ట్రీకి 600 కోట్ల నష్టం
ముంబై : బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తూ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం టూ-వీలర్ ఇండస్ట్రీకి భారీగానే దెబ్బకొట్టనుందట. వాహనాల బ్యాన్ తో తీసుకొచ్చిన రెండు రోజుల డిస్కౌంట్ ఆఫర్లతో ఇండస్ట్రీకి 600 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనున్నట్టు రిపోర్టులు వెలువడ్డాయి. ఒరిజినల్ ఈక్విప్మెంట్ మేకర్స్ ఈ నష్టాలను భారీగా మూటకట్టుకున్నారని రేటింగ్స్ సంస్థ ఐక్రా సోమవారం పేర్కొంది. అమ్ముడుపోని వాహనాలను బీఎస్-4 కంప్లయింట్ లోకి మార్చుకోవడమే కంపెనీలకు ప్రత్యామ్నాయని పేర్కొంది. బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తూ మార్చి 29న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలను నిర్వహించవద్దని కంపెనీలకు సుప్రీం హెచ్చరించింది. దీంతో ఉన్న రెండు రోజుల వ్యవధిలోనే ఉన్న స్టాక్ ను క్లియర్ చేసుకోవడం కోసం బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. 2017 మార్చి 30-31లలో ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్లతో టూ-వీలర్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం 600 కోట్ల మేర ఉండొచ్చని ఐక్రా సీనియర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ సుబ్రతా రాయ్ చెప్పారు. బీఎస్-4 ఉద్గారాల ప్రమాణాలతో ప్రస్తుతమున్న ఉద్గారాల స్థాయిని కఠినతరం చేయొచ్చని, అంతేకాక, నైట్రోజన్ ఆక్సైడ్స్ లపై అదనంగా పరిమితులు విధించవచ్చని తెలిపారు. నష్టాలు మాత్రమే కాక ఇటు నిర్వహణ లాభాలపైనా దీన్ని ప్రభావం పడనుందట. మార్చి 30-31లోని భారీ డిస్కౌంట్లతో టూవీలర్ ఓఈఎమ్స్ నిర్వహణ లాభాలపై 150-165 బీపీఎస్ ప్రభావం చూపనుందని ఐక్రా అంచనావేస్తోంది. 2010 నుంచి కంపెనీలు బీఎస్-3 ప్రమాణాలు పాటిస్తూ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. -
టూ వీలర్స్‌పై భారీ డిస్కౌంట్స్
-
టూ వీలర్స్‌పై భారీ డిస్కౌంట్స్
⇔ ఈ అవకాశం ఈ ఒక్క రోజే ⇔ మార్చి 31 తర్వాత బీఎస్ – 3 వాహనాలు బంద్ l ⇔ సుప్రీంకోర్టు తీర్పుతో తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన హోండా, హీరో, బజాజ్, సుజుకి l ⇔ ద్విచక్ర వాహనం రూ.22,000 వరకు చౌక న్యూఢిల్లీ: స్కూటర్, బైక్ ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కొనాలన్న ఆలోచన ఉంటే ఆ ముహూర్తమేదో ఈ రోజే పెట్టేసుకోండి. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా... వాహన తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. బీఎస్ – 3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాటిని ఏప్రిల్ 1 నుంచి విక్రయించడం, రిజిస్ట్రేషన్ కుదరదని అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పుతో ఆ వాహన నిల్వలను క్లియర్ చేసుకోవడంపై వాహన తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ద్విచక్ర వాహనాలపై రూ.22వేల రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం, అదీ శుక్రవారం ఒక్కరోజే అందుబాటులో ఉంటుంది. స్టాక్స్ మిగిలి ఉన్నంత వరకు లేదా మార్చి 31 వరకే ఆ ఆఫర్లు అమల్లో ఉంటాయని కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య వాహన కంపెనీలు సైతం బీఎస్–3 యూనిట్లపై కొంత మేర తగ్గింపును అందిస్తున్నట్టు తెలియవచ్చింది. మార్చి 31న కొనుగోలు చేసినట్టు ఇన్వాయిస్, ఇతర ధ్రువీకరణలతో ఆ తేదీ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అనుమతి ఉంది. డీలర్ల తగ్గింపు మరికొంత... వాస్తవానికి మార్చి 31తో తమ దగ్గర మిగిలిపోయే వాహనాల విషయమై కంపెనీల నుంచి డీలర్లకు సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తమ దగ్గరున్న వాహన స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు... కంపెనీలు అందించే డిస్కౌంట్‌కు అదనంగా తాము సైతం కొంత తగ్గింపును అందించేందుకు డీలర్లు ముందుకు వస్తున్నారు. అయితే, బజాజ్ మాత్రం మిగిలిపోయిన ప్రతీ ఒక్క వాహనాన్ని వెనక్కి తీసుకుంటామని తమ డీలర్లకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. 6.71 లక్షల వాహనాలు బీఎస్ – 3 ప్రమాణాలతో ఉన్న అన్ని రకాల వాహనాలు దేశంలో 8 లక్షలకు పైన ఉంటాయని అంచనా. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాలే 6.71 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆఖరి రోజైన మార్చి 31లోపు వీలైనన్నింటినీ విక్రయించుకోవాలన్న ఉద్దేశంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించినట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఒక్క హీరో మోటో కార్ప్ కంపెనీ పరిధిలోనే 2 లక్షల వాహనాలున్నాయని అంచనా. టాటా మోటార్స్ కంపెనీకి బీఎస్ –3 యూనిట్లు 30,000 వరకు ఉన్నాయి. అన్ని రకాల కార్లను కంపెనీలు బీఎస్–4 ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నాయి. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రక్కులు, బస్సులే బీఎస్ –3 ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుతం విక్రయమవుతున్నాయి. ఊహించని రాయితీలు: డీలర్లు ద్విచక్ర వాహన పరిశ్రమలో ఎప్పుడూ వినని తగ్గింపు ధరలుగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ (ఎఫ్ఏడీఏ) మాజీ ప్రెసిడెంట్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ నికుంజ్ సంఘి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా అనుసరించనున్నారు అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... గడువులోపు సాధ్యమైనన్ని వాహనాలను విక్రయించడంపైనే తమ శక్తిని కేంద్రీకరించామని చెప్పారు. కొనుగోలుకు అవకాశం ఉన్న కస్టమర్లకు కాల్స్ చేసి మరీ ఆఫర్ల గురించి తెలియజేస్తున్నట్టు తెలిపారు. బీఎస్ –3 వాహనాల నిల్వలను విక్రయించుకునేందుకు కోర్టు మరింత సమయం ఇస్తుందని ఆశించామని, కానీ అది జరగనందున ఉన్న వాటిని అమ్ముకోవడంపై దృష్టి పెట్టామన్నారు. గడువు తర్వాత మిగిలి ఉన్న వాహనాల విషయమై తయారీదారులతో మాట్లాడాల్సి ఉందన్నారు. తగ్గింపు ఎందుకు...? మిగిలి ఉన్న వాహనాలను కంపెనీలు ఏప్రిల్ 1 తర్వాత విక్రయించడానికి వీల్లేదు. వాటిని విదేశీ మార్కెట్లలో అమ్ముకోవడం ఒక్కటే వాటి ముందున్న మార్గం. విదేశాలకు ఎగుమతి చేయడం కొంత ఖర్చుతో కూడుకున్నది. అదే సమయంలో స్థానిక మార్కెట్లో ఉన్నంత విక్రయాలు విదేశీ మార్కెట్లలో ఉండకపోవచ్చు. ఆ స్టాక్‌ను వదిలించుకునేందుకు కొంత సమయం తీసుకుంటుంది. ఇదంతా కంపెనీలపై భారాన్ని పెంచేవే. అదేదో ఇక్కడే కొంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాహన నిల్వలను తగ్గించుకోవచ్చని కంపెనీలు భావించి ఉండొచ్చు. వాణిజ్య వాహనాలపై తగ్గింపు ఎంత..? బీఎస్ –3 ప్రమాణాలతో ఉన్న వాణిజ్య వాహనాల నిల్వలు తక్కువే ఉండడంతో వీటిపై భారీ ఆఫర్లకు కంపెనీలు ముందుకు రానట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రక్కులు, బస్సులపై 4 నుంచి 12 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు సమాచారం. తిరిగి కస్టమర్∙మీదే భారం? బీఎస్–3 ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులతో ముందుకు వచ్చిన సంస్థలు ఆ భారాన్ని గడువు తర్వాత తిరిగి కస్టమర్ల మీదే రుద్దనున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తగ్గింపుల వల్ల ఎదురయ్యే నష్టాన్ని అవి తర్వాత బీఎస్ –4 మోడళ్లపై కొద్ది మేర రేట్లను పెంచడం ద్వారా భర్తీ చేసుకునే అవకాశం లేకపోలేదన్నది పరిశీలకుల అభిప్రాయం. వాహనాలు ఇట్టే అమ్ముడవుతాయి.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీఎస్–3 ద్విచక్ర వాహనాలపై కనీవినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో అమ్మకాలు బాగా పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఒక్కో డీలర్ వద్ద 200–300 దాకా వాహనాలు ఉన్నట్టు తెలియవచ్చింది. భారీ డిస్కౌంట్ల కారణంగా ఇవన్నీ ఒక్కరోజులో అమ్ముడయిపోతాయని శ్రీ వినాయక బజాజ్ గ్రూప్ ఎండీ కె.వి.బాబుల్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డిస్కౌంట్లతో అమ్మకాలకు బూస్ట్ ఉంటుందని విశ్వసిస్తున్నట్టు లక్ష్మి గ్రూప్ డైరెక్టర్ కంభంపాటి జైరామ్ చెప్పారు. అయితే వాహనాలు మిగిలిపోతే ఎలా అన్నదే తమ ముందున్న ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కంపెనీల నుంచి ఇంత వరకు ఎటువంటి హామీ రాలేదని చెప్పారాయన. మేం మరింత తగ్గించాం బజాజ్ ఇస్తున్న డిస్కౌంట్‌కు తోడు తాము అదనంగా తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్టు శ్రీ వినాయక బజాజ్ ప్రకటించింది. సీటీ–100పైన రూ.8 వేలు, ప్లాటినా, డిస్కవర్–125, వీ–15 పైన రూ.10 వేలు, అవెంజర్, పల్సర్ మోడళ్లపై రూ.12,000, ఆర్ఎస్–200పై రూ.17,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్‌లో హోండా డీలర్లు రూ.60,000 వరకు ధర గల బైక్‌లపై రూ.20,000 వరకు, స్కూటర్లపై రూ.13,500 దాకా తగ్గింపును ఇస్తున్నారు. హీరో మోటో షోరూంలు రూ.12,500 దాకా డిస్కౌంట్ ఆఫర్ చేశాయి. మహీంద్రా టూవీలర్స్ రూ.25,000 దాకా ధర తగ్గించింది. హోండా: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తొలుత బీఎస్ – 3 వాహనాలపై ఫ్లాట్ రూ.10,000 తగ్గింపును ఆఫర్ చేసింది. అంతలోనే ఏమనుకుందో ఏమో రూ.22,000కు క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్టు తెలిపింది. యాక్టివా 3జి (రూ.50,290), డ్రీమ్ యుగ (రూ.51,741), సీబీ షైన్ (రూ.55,799 – రూ.61,283), సీడీ 110డీఎక్స్ (రూ.47,202 – రూ.47,494). మోడళ్లపై తగ్గింపు లభిస్తుంది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు. హీరో: హీరో మోటోకార్ప్ రూ.12,500 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. స్కూటర్లపై రూ.12,500, ప్రీమియం బైక్‌లపై రూ.7,500, ప్రారంభ స్థాయి మోడళ్లపై రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న వాటిలో డ్యూయెట్ (రూ.49,480), మాస్ట్రో ఎడ్జ్ (రూ.51,030), గ్లామర్ (రూ.59,755), స్లె్పండర్ 125 (రూ.55,575) మోడళ్లు ఉన్నాయి. సుజుకి: లెట్స్, గిక్సర్ మోడళ్లపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తగ్గింపు ధరలను ప్రకటించింది. లెట్స్ ధరలు రూ.47,272 నుంచి రూ.53,766 మధ్య ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు ఇవి. వీటిపై రూ.4,000 తగ్గింపుతోపాటు ఉచితంగా హెల్మెట్‌ను అందిస్తోంది. గిక్సర్ ధరలు రూ.77,452 – రూ.90,421 మధ్య ఉన్నాయి. వీటిపై రూ.5,000 తగ్గింపు ఇస్తోంది. ఎక్సే్ఛంజ్ బెనిఫిట్ కింద మరో రూ.2,000 తగ్గింపును సైతం పొందే అవకాశం ఉంది. బజాజ్: డిస్కౌంట్‌తోపాటు ఉచిత వాహన బీమాను కూడా ఆఫర్ చేస్తోంది. ప్లాటినా, సీటీ 100 నుంచి పల్సర్ ఆర్ఎస్200 మోడల్ వరకు రూ.3,000 నుంచి రూ.12,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ‘‘విక్రయం కాని బీఎస్ –3 వాహనాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని ఎగుమతి చేసే అవకాశం ఉంది. మేము అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తున్నాం’’ అని బజాజ్ఆటో ప్రెసిడెంట్ ఎస్.రవికుమార్ తెలిపారు. పరిశీలిస్తున్నాం: ఎంఅండ్ఎం సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి పలు అంశాలను పరిశీలిస్తున్నామని మహీæంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ‘‘బీఎస్ –3 వాహన నిల్వలను గడువులోపు సాధ్యమైన మేర విక్రయించే ప్రయత్నంలో ఉన్నాం. కోర్టు ఆదేశాలతో పడే ఈ ఏక కాల భారాన్ని పరిమితం చేసుకునేందుకు మా వైపు నుంచి ప్రతీ ప్రయత్నం చేస్తాం’’ అని కంపెనీ తెలిపింది. తగ్గింపు వివరాలను మాత్రం వెల్లడించలేదు. మా నుంచి తగ్గింపు లేదు: అశోక్ లేలాండ్ వాణిజ్య వాహనాల అగ్రగామి కంపెనీ అశోక్‌లేలాండ్ మాత్రం తమ వాహనాలపై ఎటువంటి తగ్గింపు లేదని స్పష్టం చేసింది. ‘‘మా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ధరలపై ఎటువంటి తగ్గింపులను ఇవ్వడం లేదు’’ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే, పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అశోక్‌లేలాండ్ డీలర్ మాత్రం సాధారణ డిస్కౌంట్ 4 – 5 శాతానికి అదనంగా తాము ఒకటి నుంచి రెండు శాతం వరకు తగ్గింపును బీఎస్–3 వాహనాలపై ఇస్తున్నట్టు తెలిపారు.