వెహికిల్స్ బ్యాన్: ఇండస్ట్రీకి 600 కోట్ల నష్టం | BS-III vehicles ban: Two-wheeler industry took Rs 600 crore hit | Sakshi
Sakshi News home page

వెహికిల్స్ బ్యాన్: ఇండస్ట్రీకి 600 కోట్ల నష్టం

Published Mon, May 1 2017 7:56 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

వెహికిల్స్ బ్యాన్: ఇండస్ట్రీకి 600 కోట్ల నష్టం

వెహికిల్స్ బ్యాన్: ఇండస్ట్రీకి 600 కోట్ల నష్టం

ముంబై : బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తూ  ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం టూ-వీలర్ ఇండస్ట్రీకి భారీగానే దెబ్బకొట్టనుందట. వాహనాల బ్యాన్ తో తీసుకొచ్చిన రెండు రోజుల డిస్కౌంట్ ఆఫర్లతో ఇండస్ట్రీకి 600 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లనున్నట్టు రిపోర్టులు వెలువడ్డాయి. ఒరిజినల్ ఈక్విప్మెంట్ మేకర్స్ ఈ నష్టాలను భారీగా మూటకట్టుకున్నారని రేటింగ్స్ సంస్థ ఐక్రా సోమవారం పేర్కొంది. అమ్ముడుపోని వాహనాలను బీఎస్-4 కంప్లయింట్ లోకి మార్చుకోవడమే కంపెనీలకు ప్రత్యామ్నాయని పేర్కొంది. బీఎస్-3 వాహనాలపై నిషేధం విధిస్తూ మార్చి 29న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుంచి ఆ వాహనాల రిజిస్ట్రేషన్, అమ్మకాలను నిర్వహించవద్దని కంపెనీలకు సుప్రీం హెచ్చరించింది.
 
దీంతో ఉన్న రెండు రోజుల వ్యవధిలోనే ఉన్న స్టాక్ ను క్లియర్ చేసుకోవడం కోసం బంపర్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. 2017 మార్చి 30-31లలో ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్లతో టూ-వీలర్ ఇండస్ట్రీకి వచ్చిన నష్టం 600 కోట్ల మేర ఉండొచ్చని ఐక్రా సీనియర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్  సుబ్రతా రాయ్ చెప్పారు. బీఎస్-4 ఉద్గారాల ప్రమాణాలతో ప్రస్తుతమున్న ఉద్గారాల స్థాయిని కఠినతరం చేయొచ్చని, అంతేకాక, నైట్రోజన్ ఆక్సైడ్స్ లపై అదనంగా పరిమితులు విధించవచ్చని తెలిపారు. నష్టాలు మాత్రమే కాక ఇటు నిర్వహణ లాభాలపైనా దీన్ని ప్రభావం పడనుందట. మార్చి 30-31లోని భారీ డిస్కౌంట్లతో టూవీలర్  ఓఈఎమ్స్ నిర్వహణ లాభాలపై 150-165 బీపీఎస్ ప్రభావం చూపనుందని ఐక్రా అంచనావేస్తోంది. 2010 నుంచి కంపెనీలు బీఎస్-3 ప్రమాణాలు పాటిస్తూ వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement