Apple Targets September 7 For iPhone 14 Launch, Details Inside - Sakshi
Sakshi News home page

గుడ్‌ న్యూస్‌: ఐఫోన్‌ 14 వచ్చేస్తోంది, అదికూడా ఊహించని ధరలో

Published Thu, Aug 18 2022 5:59 PM | Last Updated on Thu, Aug 18 2022 8:00 PM

Apple targets September 7 for iPhone 14 launch  - Sakshi

టెక్ దిగ్గజం  యాపిల్‌ లేటెస్ట్‌  ఫోన్‌ కోసం ఎదురుచూస్తున్న ఐఫోన్‌ లవర్స్‌గా గుడ్‌న్యూస్‌.  ఐఫోన్‌14 సెప్టెంబర్ 7న లాంచ్‌ చేయనుందట. సాధారణంగా  ఒ​క​ స్పెషల్‌ ఈవెంట్లో సెప్టెంబరు తొలి అర్థ భాగంలో తాజా ఐఫోన్‌లను ఆవిష్కరిస్తుంది.ఐఫోన్‌తోపాటు ఉత్పత్తులను ప్రకటించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మరో గ్రాండ్‌ ఈవెంట్‌కు సిద్ధమవుతోంది యాపిల్‌. ఈ మేరకు ఉద్యోగులకు   ఆదేశాలు జారీ చేసినట్టుస​మాచారం.

కొత్త ఐఫోన్‌ను ఆవిష్కరించడం లాంచింగ్‌ వారం తర్వాత స్టోర్‌లలో  తాజా ఉత్పత్తులను విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఐఫోన్‌14ను  కూడా సెప్టెంబర్ 7 లాంచ్‌ చేసి. సెప్టెంబర్ 16నుంచి రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంచనుంది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం దీంతోపాటు మూడు కొత్త ఆపిల్ వాచ్ మోడల్‌లు , అనేక కొత్త వెర్షన్‌లు మాక్‌లు ,ఐప్యాడ్‌లు  లాంచ్‌ చేయనుంది. అంతేకాదు దాదాపు ఐఫోన్‌ 13 రేటుకే ఐ ఫోన్‌ 14ను  తన యూజర్లకుఅందించనుంది.ఈవెంట్ సమయంపై వ్యాఖ్యానించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement