ముంబై: ఎయిర్‌ఏషియా సంస్థ విమాన టికెట్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ట్రస్ట్ యువర్ వాండర్‌లస్ట్ పేరుతో ఈ ఆఫర్లను అందిస్తున్నామని ఎయిర్‌ఏషియా తెలిపింది. విమాన టికెట్లను దేశీయ రూట్లలో కనిష్ట చార్జీ రూ.1,199కు, అంతర్జాతీయ రూట్లలో రూ.4,399కే ఆఫర్ చేస్తున్నామని వివరించింది.
వచ్చే నెల 2లోపు, ఎయిర్‌ఏషియా అధికారిక వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్లు వర్తిస్తాయని, వచ్చే ఏడాది ఫిబ్రవరి 17లోపు ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్జీ రూ.1,199 మాత్రమేనని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment