ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్ | AirAsia offering special tour to Kuala Lumpur | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్

Published Sat, Dec 10 2016 10:15 AM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్

ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్

కొత్త సంవత్సరాది కొంగొత్త ఆలోచనలతో న్యూఇయర్కు స్వాగతం పలుకాలనుకుంటున్నారా? ప్రతీసారి కంటే విభిన్నంగా ఎక్కడికైనా వెళ్లి ఫ్యామిలీతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దుకుని, కౌలాలంపూర్ ప్రయాణానికి సిద్ధం కండి. అయ్యో ఎయిర్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోలేదు. న్యూఇయర్ సందర్భంగా ఎకనామికల్ బోనస్లు ఎలా అని సందేహ పడకండి. 15 సంవత్సరాలుగా విమానయాన సర్వీసులు అందిస్తున్న ఎయిర్ ఏషియా మీకోసం ఓ స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా కౌలాలంపూర్కు సూపర్ ఎకనామికల్ టూర్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటన సందర్భంగా మలేషియా రాజధానిగా ఉన్న కౌలాలంపూర్లో చూడదగ్గ ప్రదేశాలు, అబ్బురపరిచే విశేషాలు మీకోసం అందించబోతోంది....
 
ట్విన్ టవర్స్ను పోలిన భవంతులు :
కౌలాలంపూర్లో అడుగుపెట్టగానే మొదటి సందర్శకులకు దర్శనమిచ్చేది పెట్రోనాస్ టవర్స్. ప్రపంచంలో ఇట్లాంటి టవర్స్ను బహుశా మీరెక్కడ చూసుండరేమో. ఆకాశానంటే జంట సౌధాల కలయికనే ఈ టవర్స్. వీటినే పెట్రోనాస్ ట్విన్ టవర్స్ అని కూడా పిలుస్తుంటారు. విద్యుత్ దీపాలు వెలిగినప్పుడు కౌలాలంపూర్ కన్వెక్షన్ పార్కు నుంచి ఈ టవర్స్ను చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే.
జలాన్ అలోర్ :
పసందైన వంటకాలకు పెట్టింది పేరు జలాన్ అలోర్ స్ట్రీట్. రోడ్డు సైడ్ తినుబండారాల దుకాణాలకు ఈ ప్రాంతం ఎక్కువగా ప్రసిద్ధి చెందినది. ఎప్పుడైతే సూర్యుడు తన అమ్మ ఒడిలోకి సేదతీరడానికి పయనమవుతుంటాడో ఇక అప్పటినుంచి ఆ ప్రాంతం కస్టమర్ల రాకపోకలతో బిజీగా మారిపోతుంది. మిఠాయిల దగ్గర్నుంచి స్పయిసీ చెట్నీల వరకు అన్ని రకాల వంటకాలను ఇక్కడి రెస్టారెంట్లు ఆఫర్ చేస్తాయి. మంచి స్ట్రీట్ ఫుడ్ని తిన్న అనుభూతిని జలాన్ అలోర్ సందర్శకులకు అందిస్తుందనడంలో సందేహమే లేదు.
 
మెనరా టవర్స్ :
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడాలలో మెనరా టవర్స్ కూడా ఒకటి. వీటినే కేఎల్ టవర్స్ అని కూడా అంటారు. ఈ టవర్స్ నుంచి నగరమంతటిన్నీ తిలకించవచ్చు. ముస్లిం తమ పవిత్రవమైన మాసం రంజాన్లో నెలవంకను ఈ టవర్స్ పై నుంచే చూస్తారట. టవర్స్ పైనుంచి సిటీని చూసినా.. గాలిలో ఎగురుతున్న ఏయిర్ ఏషియా ఫ్లయిట్ నుంచి చూసినా రెండు ఒకేమాదిరిగా కనిపిస్తాయట. 
పక్షి ప్రేమికుల ప్రేమాలయం :
పక్షులను ఎక్కువగా ఇష్టపడే వారికి కౌలాలంపూర్ ఓ ప్రేమాలయం లాంటిదేనట. ఎందుకంటే కౌలాలంపూర్ బర్డ్ పార్క్లో దాదాపు 3000 పైగా జాతులకు సంబంధించిన పక్షులు మనకు కనువిందుచేస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పెద్ద పక్షిశాల కూడా ఇదే కావడం విశేషం. ఈ పార్క్లో ఇతర దేశాల నుంచి దిగుమతిచేసుకున్న పక్షులు కూడా ఉంటాయి. కానీ స్థానిక పక్షులే అక్కడ హీరోలుగా ఫోజులిస్తాయట. ఇది ఓపెన్ బర్డ్ పార్క్. సందర్శకులు ఆ పార్కుకి వెళ్లినప్పుడు, పక్షులు కూడా వారితో పాటు నడుస్తూ, ఎగురుతూ భలే కనువిందు చేస్తాయట.
 
మలై సంప్రదాయానికి ప్రతీక :
కౌలాలంపూర్ సందర్శనానికి వెళ్లిన ప్రతిఒక్కరూ చూడాల్సిన ప్రదేశం నేషనల్ మ్యూజియం. మలై సంప్రదాయానికి, చరిత్రకి ఇది ఓ ప్రతీకలా నిలుస్తోంది. లేక్ గార్డెన్కి దగ్గర్లోనే ఈ మ్యూజియం ఉంటుంది. పురాతన ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, ఆధునిక పద్ధతుల కలగొలుపుగా ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. మలేషియా దేశ రైల్వే చరిత్రను, విధానాన్ని ఇతర దేశాలకు చాటిచెప్పేందుకు రైల్వే మ్యూజియంను కూడా ఆ దేశం ఏర్పాటు చేసింది. 
షాపింగ్ అడ్డా :
ఎయిర్ ఏషియాలో తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు పిల్లలు, మహిళలు ఎక్కువగా మెచ్చే ఈ ప్రదేశానికి కచ్చితంగా వెళ్లాల్సిందే. అదేమిటంటే సూరియా కౌలాలంపూర్ సిటీ సెంటర్. అతిపెద్ద షాపింగ్ సెంటర్గా దీనికి పేరుంది. సినిమాలు, ఫుడ్ కోర్టు, రైడ్స్, సూపర్ మార్కెట్ ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా బడ్జెట్లో షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి బుకిట్ బిన్ట్యాంగ్ ప్రాంతం కూడా ఎంతో అనువైనది. అత్యంత సౌకర్యవంతమైన కేఎల్ మోనోరైల్ నుంచి సులభంగా ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్ ఇష్టపడే వారికి బుకిట్ బిన్ట్యాంగ్ ప్రాంతం మంచి అనుభూతిని కలిగిస్తోంది. బ్యాగేజీ అలవెన్స్ను కూడా ఎయిర్ఏషియా తమ ప్రయాణికులకు అందిస్తోంది. దీంతో ప్రయాణికులు ఎంత మొత్తంలోనైనా షాపింగ్ను నిరభ్యంతరాయంగా ముగించుకోవచ్చు.  
 
హలో చైనా టౌన్ :
మలేషియాలో ఎక్కువ జనాభా చైనీస్దే. దీనికి నిదర్శనం పెటాలింగ్  స్ట్రీట్. దీన్నే మినీ చైనాగా అభివర్ణిస్తారు. చైనా ఫుడ్ స్టాల్స్, చైనా బజార్స్, చైనా టెంపుల్స్ అన్నీ చైనీస్వే ఇక్కడ దర్శనమిస్తుంటాయి. 
సీతాకోకచిలుకల పార్క్ :
120 రకాల సీతాకోక చిలుకలకు కౌలాలంపూర్ పుట్టినిల్లు. కౌలాలంపూర్ బటర్ఫ్లై పార్క్ అచ్చం ఓ అడవి మాదిరి ఉంటుంది. కేఎల్లోని సీతాకోక చిలుకల పార్క్ లాంటిది  ప్రపంచంలోనే మరెక్కడా లేదు. ఇది సీతాకోక చిలుకలు స్వేచ్ఛగా వచ్చి నివసించు, పునరుత్పత్తి చేసుకొను, రక్షణ పొందు కేంద్రము. ఇక్కడికి వచ్చే సందర్శకులకు పార్క్లోని సీతాకోక చిలుకలు పునరుత్పత్తి, జీవిత కాలం వంటి వివరాలను అక్కడి ప్రతినిధులు వివరిస్తుంటారు.
 
నీటి క్షీరదాల నిలయం :
కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్లో కల అక్వేరియం 5,000లకు పైగా నీటి క్షీరదాలకు నిలయంగా ఉంటుంది. 60వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో సముద్రమట్టానికి 100 అడుగుల కింద 300 అడుగులు భారీ టన్నెళ్లతో ఈ అక్వేరియంను ఏర్పాటుచేశారు. 
మలేషియా రాజుల ప్యాలెస్ :
మలేషియా రాజుల అధ్యక్ష భవనంగా ఇస్తానా నెగరా ఎంతో కాలంగా ప్రసిద్ధి చెందింది. 2011లో కొత్త అధ్యక్ష భవనం నిర్మించేవరకు మలేషియా రాజులందరూ ఇక్కడే ఉండేవారు. మలేషియా రాజత్వంను తెలుసుకోవడానికి ప్రస్తుతం దీన్ని చారిత్రాత్మక మ్యూజియంగా మలిచారు. ఈ భవనంలో కొన్ని గదులను పర్యటకులు కూడా వీక్షించవచ్చు. ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మలేషియా దేశం ఇక్కడే సెలబ్రేట్ చేస్తోంది.  
బటు గుహలు :
ప్రశాంతతకు మారుపేరైన మలేషియాలో బటు గుహలు- బటు కేవ్స్ అద్భుత ప్రకృతి రమణీయ ప్రాంతం. అక్కడి రమణీయతకు మరో అందం అక్కడి షణ్ముఖాలయం. ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఇదీ ఒకటి. ప్రధాన నగరం నుంచి ఈ ప్రాంతం తక్కువ దూరంలోనే ఉంటుంది. మలేషియాలో తమిళ భక్తులు ఎక్కువగా ఆ ప్రాంతానికి వస్తుంటారు. దీనికి 150కి పైగా మార్గాలున్నాయి. ప్రతీదానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ గుహల వరకు హైకింగ్ చేయడం సందర్శకుల పర్యటనలో మరిచిపోలేని అనుభూతి. అద్భుతమైన మధురానుభూతిని మిగిల్చే మీ ఈ పర్యటనలో చివరిప్రాంతం ఇదే ఉంటుంది. ఇలా ఏయిర్ ఏషియా ఆఫర్ చేస్తున్న ఈ ట్రిప్ను ఎంజాయ్ ఎన్నో జ్ఞాపకాలను నెమరువేసుకుండా తిరుగు ప్రయాణానికి సిద్ధం కావాల్సి ఉంటుంది.
(అడ్వర్టోరియల్‌)
 
ఇంకెందుకు ఆలస్యం పూర్తి వివరాలకు వెంటనే క్లిక్ చేయండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement