ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్: టిక్కెట్ ధరెంతంటే... | AirAsia offer: Now fly abroad for Rs 2,999, domestic travel at Rs 1,099 | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్: టిక్కెట్ ధరెంతంటే...

Jun 3 2017 4:51 PM | Updated on Aug 14 2018 4:01 PM

ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్: టిక్కెట్ ధరెంతంటే... - Sakshi

ఎయిర్ ఏసియా డిస్కౌంట్ సేల్: టిక్కెట్ ధరెంతంటే...

మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఎయిర్ ఏసియా విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది.

ముంబై : మలేషియా బడ్జెట్ ఎయిర్ లైన్స్ గ్రూప్ ఎయిర్ ఏసియా విమాన టిక్కెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. తమ దేశీయ జాయింట్ వెంచర్ క్యారియర్ ఆపరేట్ చేసే దేశీయ మార్గాలకు టిక్కెట్ ధర రూ.1,099 నుంచి ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా గ్రూప్ ఎయిర్ లైన్స్ ఆపరేట్ చేసే అంతర్జాతీయ విమానాలకు టిక్కెట్ ధర రూ.2,999 నుంచి అందిస్తున్నట్టు పేర్కొంది. పరిమిత కాలవ్యవధిలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఏసియా తెలిపింది.
 
ఎయిర్ ఏసియా ఇండియా ఆపరేట్ చేసే బెంగళూరు, న్యూఢిల్లీ, హైదరాబాద్, కొచ్చి, గోవా, శ్రీనగర్, రాంచి, కోల్ కత్తా వంటి దేశీయ మార్గాలకు తక్కువగా 1,099కే టిక్కెట్ ధరలను అందుబాటులో ఉంచుతున్నామని ఎయిర్ ఏసియా ఓ ప్రకటనలో పేర్కొంది.  ఈ డిస్కౌంట్ ఆఫర్ కింద జూన్ 4 నుంచి జూన్ 11 మధ్యలో టిక్కెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 2018 జనవరి 15 నుంచి 2018 ఆగస్టు 28 మధ్యలో ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. 
 
ప్రస్తుతం ఏయిర్ ఏసియా బెంగళూరు, కొచ్చి, గోవా, చంఢీఘర్, పుణే, న్యూఢిల్లీ, గౌహతి, ఇంఫాల్, వైజాగ్, హైదరాబాద్, శ్రీనగర్, బాగ్డోగ్రా, కోల్ కత్తా, రాంచి ప్రాంతాలకు విమానాలు నడుపుతోంది. ఈ బిగ్ ప్రమోషన్ సేల్ ను ఆసియా, ఆస్ట్రేలియాలతోపాటు 120 మార్గస్థానాల ప్రయాణికులకు కనెక్ట్ చేసింది. కౌలాలంపూర్, బ్యాంకాంక్, ఫుకెట్, క్రాబి వంటి ఇంటర్నేషనల్ ప్రయాణాలకు కూడా అత్యంత తక్కువగా రూ.2999కే టిక్కెట్ ను అందిస్తోంది.  
 
ఈ ధరలు కూడా ఒకే ప్రయాణానికి మాత్రమేనని, దీనిలోనే అన్ని ఛార్జీలు కలిపి ఉంటాయిని  ఎయిర్ ఏసియా పేర్కొంది. ఎయిర్ పోర్టు ఫీజు కూడా ఈ టిక్కెట్ ధరలోనే ఉంటుందని ఎయిర్ లైన్స్ తెలిపింది.  ఎయిర్ ఏసియా పోర్టల్, తమ మొబైల్ యాప్ లో బుక్ చేసుకునే అన్ని బుకింగ్స్ కు  ఈ బిగ్ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement