జీవితంలో నిత్యం ఉండే ఈ ఒత్తిళ్ల మధ్య కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ ఖర్చులు గుర్తొస్తే... వామ్మో ఫ్యామిలీతో హాలిడే ట్రిప్పా... ఎప్పుడూ అదో పెద్ద సమస్య. ఎక్కడికైనా ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలనుకున్నా... టిక్కెట్లు బుక్ చేసుకోవడం, హోటల్ గదులు రిజర్వ్ చేసుకోవడం, మనకు కావలసిన ఐటెనరీ తెలియజేయడం... వంటివెన్నో మనకు ప్రతిబంధకాలుగా కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో అసలు ఫ్యామిలీ ట్రిప్పు ఎందుకులే అనుకునే వారూ ఉంటారు.
(ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్)
కానీ, ప్రపంచంలోని ఎన్నో వింతలు, ఎన్నెన్నో అబ్బుర పరిచే ప్రాంతాలను సందర్శించాలన్న కోరిక ఎలాగూ ఉంటుంది. అలాంటి వారికి మార్గాలు లేకపోలేదు. అలా ప్రముఖమైన ప్రదేశాలను చూసిరావడానికి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం, దానికి తగిన ఏర్పాట్లు చేసే విషయంలో ఇప్పుడు ఎయిర్ ఏషియా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. "గ్రేట్ హాలిడే ట్రిప్" కు ఇప్పుడు ఎయిర్ ఏషియా ఒక మంచి ఆఫర్ ను ప్రకటించింది. ఎంతో ఖరీదైన విమాన ప్రయాణాన్ని సైతం అందుబాటు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది.
బడ్జెట్ లో ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశం కౌలాలంపూర్ ను సందర్శించి మంచి అనుభూతిని మిగుల్చుకునే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ ఏషియా. సౌకర్యవంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించేలా ఎయిర్ ఏషియా ఆఫర్ చేస్తోంది. కొంచెం కష్టమైనా.. కౌలాలంపూర్, మలేషియా లాంటి దేశాలను చూడాలని ఆశపడే వారి అభిలాషను ఎయిర్ ఏషియా నెరవేర్చేస్తోంది. హాలిడే ప్లానింగ్కు ఎప్పుడూ ముందుండే ఎయిర్ ఏషియా... సందర్శకుల కోసం ముందస్తుగా బడ్జెట్ ధరల్లో సీట్లు, హోటల్స్ను బుక్ చేస్తోంది.
ఎయిర్ ఏషియా ఆఫర్ చేస్తున్న కౌలాలంపూర్, మలేసియా దేశ రాజధాని. నోరూరించే స్ట్రీట్ ఫుడ్, షాపింగ్, సీతాకోకచిలుక పార్కులు, ట్విన్ టవర్స్ను పోలిన భవంతులు, మ్యూజియంలు, ప్రశాంతతకు నిలయంగా పేరుపొందిన దేవాలయాలు... ఇలా ఒక్కటేమిటి ఆ నగరంలో ప్రతి ఒక్కటీ అబ్బురపరిచేదే. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాలన్నా.. స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి వెళ్లినా మలేసియాకు మించిన అద్భుతమైన పర్యాటక ప్రదేశం మరేది ఉండదంటే ఎలాంటి సందేహం ఉండదు.
మీకు బీచ్లో సరదాగా గడపాలని ఉంటే, రాత్రి నుంచి ఉదయం వరకు అక్కడ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశం కూడా అనువైన ధరల్లోనే పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. ఒక్క కౌలాలంపూర్ మాత్రమే కాదు, జార్జ్ టౌన్ లేదా మిరీ వంటి మలేషియాలో అతి ముఖ్యమైన ప్రాంతాలను బడ్జెట్లో చుట్టిరావచ్చు. తక్కువ ధరల్లో సేవలు అందించే ఎయిర్లైన్గా పేరున్న ఎయిర్ ఏషియా కూడా జేబుకి ఎలాంటి చిల్లు పెట్టకుండానే ప్రయాణికులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది.
ఇంకో విషయమేంటంటే... ఆసియాలో 100 పర్యాటక ప్రాంతాలకు అతి తక్కువ ధరలకే చుట్టొచ్చేలా ఎయిర్ ఏషియా ఆన్లైన్లో బంపర్ ఆఫర్ అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏంచక్కా ఎయిర్ ఏషియా విమానం ఎక్కేసి, ప్రపంచంలోనే అద్భుతమైన మలేసియాను సందర్శించేసిరండి.
మరిన్ని వివరాలకు..
ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఇక్కడ క్లిక్ చేయండి)
(అడ్వర్టోరియల్ ఆర్టికల్)