హైదరాబాద్ నుంచి ఫ్లై త్రూ: ఎయిర్‌ఏషియా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమాన సేవల సంస్థ ఎయిర్ ఏషియా ఫ్లై త్రూ సేవలను హైదరాబాద్‌కూ విస్తరించింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కౌలాలంపూర్ మీదుగా ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించొచ్చు. ఫ్లై త్రూ ప్రయాణికులకు కౌలాలంపూర్‌లో అదనపు చెక్ ఇన్ ఉండదు. ట్రాన్సిట్ వీసా తీసుకోనక్కరలేదు. లగేజీని గమ్యస్థానానికి చేరుకున్నాకే తీసుకోవచ్చు. బ్రూనే, హాంగ్‌కాంగ్, జకార్తా, సింగపూర్, హోచిమిన్, గోల్డ్‌కోస్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ తదితర నగరాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించొచ్చని ఎయిర్‌ఏషియా గ్రూప్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీగ్‌ట్రాండ్ టెహ్ తెలిపారు.