Low-cost carrier
-
ఆకాశ వీధిలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌దే హవా
దేశీయంగా చౌక విమానయాన సంస్థల (బడ్జెట్ ఎయిర్‌లైన్స్–ఎల్సీసీ) హవా కొనసాగుతోంది. అంతర్జాతీయ ట్రావెల్ డేటా సంస్థ ఓఏజీ తాజా గణాంకాల ప్రకారం ఎల్‌సీసీల మార్కెట్ వాటా అత్యధికంగా ఉన్న టాప్ 10 దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మొత్తం సీట్ల సామర్థ్యంలో ఇండిగో సారథ్యంలోని ఎల్సీసీలకు ఏకంగా 71 శాతం వాటా ఉంది. అంతర్జాతీయంగా చూస్తే భారత్‌కు సమీప పోటీదారు ఇండోనేసియాలో ఇది 64 శాతమే. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు 34 శాతంగానే ఉంది. ప్రపంచంలోనే టాప్‌లో ఉన్న నాలుగు విమానయాన సంస్థలు ఎల్సీసీలే కావడం గమనార్హం. సౌత్‌వెస్ట్, రయాన్ఎయిర్, ఇండిగో, ఈజీజెట్ ఈ లిస్టులో ఉన్నాయి. 2019 నుంచి అంతర్జాతీయంగా ఎల్‌సీసీల వాటా 13 శాతం మేర పెరిగింది. సంపన్న దేశాలు, చైనాలో ఎఫ్‌ఎస్‌సీలు .. ఇతర దేశాలను చూసినప్పుడు, అతి పెద్ద ఎయిర్‌లైన్స్ మార్కెట్లలో ఒకటైన చైనాలో ఫుల్ సరీ్వస్ ఎయిర్‌లైన్స్‌దే (ఎఫ్ఎస్సీ) హవా ఉంటోంది. అక్కడ ఎల్‌సీసీల మార్కెట్ వాటా కేవలం 12 శాతమే. ఇక బ్రిటన్ మార్కెట్లో పరిస్థితి కాస్త అటూ ఇటుగా ఉంది. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్సీసీలకు కాస్త మొగ్గు ఎక్కువగా ఉంది. రయాన్ఎయిర్, ఈజీజెట్, విజ్ ఎయిర్ వంటి ఎల్‌సీసీలు అక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఎఫ్ఎస్సీలతో పోలిస్తే ఎల్‌సీసీల మార్కెట్ వాటా ఎక్కువగా ఉన్న దేశాలను పరిశీలిస్తే లాటిన్ అమెరికాలో బ్రెజిల్, యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ మొదలైనవి ఉన్నాయి. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి సంపన్న దేశాల్లో ఎఫ్ఎస్సీలదే ఆధిపత్యం ఉంటోంది. ఫుల్ సరీ్వస్ క్యారియర్లు ఇంకా కరోనా పూర్వ స్థాయికి కోలుకోవాల్సి ఉంది. ఇండిగో భారీగా విస్తరించడం భారత్‌లో ఎల్‌సీసీల మార్కెట్ వాటా వృద్ధికి దోహదపడింది. ఈ ఏడాది జూలై గణాంకాల ప్రకారం దేశీ ప్యాసింజర్ మార్కెట్లో ఇండిగో సంస్థకు 62 శాతం వాటా ఉంది. ఎల్సీసీ విభాగంలో పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇతర ఆదాయంపరంగా సవాళ్లు.. మార్కెట్ వాటాను విస్తరించుకుంటున్నప్పటికీ దేశీయంగా ఎల్‌సీసీలు అనుబంధ ఆదాయాలను మాత్రం పెంచుకోలేకపోతున్నాయి. సీట్లను బట్టి ఫీజులు, ఆహారం, స్పెషల్ చెకిన్లు, సీట్ అప్గ్రేడ్లు, ఎక్స్ట్రా లగేజీ చార్జీలపరమైన ఆదాయం అంతంతే ఉంటోంది. దీన్ని పెంచుకునే అవకాశాలు పరిమితంగానే కనిపిస్తున్నాయి. 2022లో ఇండిగో మొత్తం ఆదాయంలో ఇతరత్రా అనుబంధ ఆదాయం వాటా 7.1 శాతమే. ఈ విషయంలో మొత్తం 64 ఎయిర్‌లైన్స్‌లో ఇండిగో 54వ స్థానంలో ఉంది. అదే అంతర్జాతీయంగా టాప్ 10 ఎల్‌సీసీలను చూస్తే .. రయాన్ఎయిర్ గ్రూప్ ఆదాయాల్లో అనుబంధ ఆదాయం వాటా 35.7 శాతంగా ఉంది. అదే ఈజీజెట్ను చూస్తే ఇది 33.9 శాతంగా, సౌత్‌వెస్ట్ విషయంలో 24.9 శాతంగా ఉంది. ఈ విషయంలో ఇండిగో ఎక్కడో వెనకాల ఉండటం గమనార్హం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సుందర ప్రదేశాలను చుట్టొద్దాం
జీవితంలో నిత్యం ఉండే ఈ ఒత్తిళ్ల మధ్య కుటుంబంతో కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కానీ ఖర్చులు గుర్తొస్తే... వామ్మో ఫ్యామిలీతో హాలిడే ట్రిప్పా... ఎప్పుడూ అదో పెద్ద సమస్య. ఎక్కడికైనా ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలనుకున్నా... టిక్కెట్లు బుక్ చేసుకోవడం, హోటల్ గదులు రిజర్వ్ చేసుకోవడం, మనకు కావలసిన ఐటెనరీ తెలియజేయడం... వంటివెన్నో మనకు ప్రతిబంధకాలుగా కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో అసలు ఫ్యామిలీ ట్రిప్పు ఎందుకులే అనుకునే వారూ ఉంటారు. (ఎయిర్ ఏషియా బంపర్ ఆఫర్) కానీ, ప్రపంచంలోని ఎన్నో వింతలు, ఎన్నెన్నో అబ్బుర పరిచే ప్రాంతాలను సందర్శించాలన్న కోరిక ఎలాగూ ఉంటుంది. అలాంటి వారికి మార్గాలు లేకపోలేదు. అలా ప్రముఖమైన ప్రదేశాలను చూసిరావడానికి ముందస్తుగా ప్లాన్ చేసుకోవడం, దానికి తగిన ఏర్పాట్లు చేసే విషయంలో ఇప్పుడు ఎయిర్ ఏషియా ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. "గ్రేట్ హాలిడే ట్రిప్" కు ఇప్పుడు ఎయిర్ ఏషియా ఒక మంచి ఆఫర్ ను ప్రకటించింది. ఎంతో ఖరీదైన విమాన ప్రయాణాన్ని సైతం అందుబాటు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. బడ్జెట్ లో ప్రపంచంలోనే అద్భుతమైన ప్రదేశం కౌలాలంపూర్ ను సందర్శించి మంచి అనుభూతిని మిగుల్చుకునే అవకాశం కల్పిస్తోంది ఎయిర్ ఏషియా. సౌకర్యవంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణించేలా ఎయిర్ ఏషియా ఆఫర్ చేస్తోంది. కొంచెం కష్టమైనా.. కౌలాలంపూర్, మలేషియా లాంటి దేశాలను చూడాలని ఆశపడే వారి అభిలాషను ఎయిర్ ఏషియా నెరవేర్చేస్తోంది. హాలిడే ప్లానింగ్‌కు ఎప్పుడూ ముందుండే ఎయిర్ ఏషియా... సందర్శకుల కోసం ముందస్తుగా బడ్జెట్ ధరల్లో సీట్లు, హోటల్స్‌ను బుక్ చేస్తోంది. ఎయిర్ ఏషియా ఆఫర్ చేస్తున్న కౌలాలంపూర్, మలేసియా దేశ రాజధాని. నోరూరించే స్ట్రీట్ ఫుడ్, షాపింగ్, సీతాకోకచిలుక పార్కులు, ట్విన్ టవర్స్‌ను పోలిన భవంతులు, మ్యూజియంలు, ప్రశాంతతకు నిలయంగా పేరుపొందిన దేవాలయాలు... ఇలా ఒక్కటేమిటి ఆ నగరంలో ప్రతి ఒక్కటీ అబ్బురపరిచేదే. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లాలన్నా.. స్నేహితులతో ఎంజాయ్ చేయడానికి వెళ్లినా మలేసియాకు మించిన అద్భుతమైన పర్యాటక ప్రదేశం మరేది ఉండదంటే ఎలాంటి సందేహం ఉండదు. మీకు బీచ్‌లో సరదాగా గడపాలని ఉంటే, రాత్రి నుంచి ఉదయం వరకు అక్కడ పార్టీలు జరుగుతూనే ఉంటాయి. ఆ దేశం కూడా అనువైన ధరల్లోనే పర్యాటకులకు ఆహ్వానం పలుకుతుంది. ఒక్క కౌలాలంపూర్ మాత్రమే కాదు, జార్జ్ టౌన్ లేదా మిరీ వంటి మలేషియాలో అతి ముఖ్యమైన ప్రాంతాలను బడ్జెట్లో చుట్టిరావచ్చు. తక్కువ ధరల్లో సేవలు అందించే ఎయిర్‌లైన్‌గా పేరున్న ఎయిర్ ఏషియా కూడా జేబుకి ఎలాంటి చిల్లు పెట్టకుండానే ప్రయాణికులకు మరపురాని అనుభూతిని అందిస్తోంది. ఇంకో విషయమేంటంటే... ఆసియాలో 100 పర్యాటక ప్రాంతాలకు అతి తక్కువ ధరలకే చుట్టొచ్చేలా ఎయిర్ ఏషియా ఆన్లైన్లో బంపర్ ఆఫర్ అందిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఏంచక్కా ఎయిర్ ఏషియా విమానం ఎక్కేసి, ప్రపంచంలోనే అద్భుతమైన మలేసియాను సందర్శించేసిరండి. మరిన్ని వివరాలకు.. ఎయిర్ ఏషియా వెబ్‌సైట్‌ను సందర్శించండి (ఇక్కడ క్లిక్ చేయండి) (అడ్వర్టోరియల్ ఆర్టికల్)