
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు ఎయిర్‌ఏషియా డిస్కౌంట్
న్యూఢిల్లీ: ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్‌ఏషియా.. దిగ్గజ ప్రైవేట్ ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు కలిగిన కస్టమర్లకు బేస్ చార్జీల్లో 20 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం ఎయిర్‌ఏషియా బర్హద్, ఎయిర్‌ఏషియా ఇండియా, థాయ్ ఎయిర్‌ఏషియా విమానాల్లో మాత్రమే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు ఈ ఆఫర్ జవవరి 18 నుంచి 31 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారు ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని పేర్కొంది. భారత్‌లో ఈ ఆఫర్ బెంగళూరు నుంచి గోవా, కొచ్చి, చండీగఢ్, జైపూర్ ప్రాంతాలకు, ఇతర అంతర్జాతీయ ప్రాంతాలకు వర్తిస్తుందని తెలిపింది.