
ఎయిర్‌ఏసియా డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ఏసియా’ తాజాగా డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా దేశీ విమాన ప్రయాణపు టికెట్ ధర రూ.899 నుంచి, అంతర్జాతీయ ప్రయాణపు టికెట్ ధర రూ.4,999 నుంచి ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఏసియాతోపాటు ఎయిర్‌ఏసియా ఇండియా, ఎయిర్‌ఏసియా బెర్హాద్, థాయ్ ఎయిర్‌ఏసియా, ఎయిర్‌ఏసియా ఎక్స్ వంటి కంపెనీలు నడుపుతోన్న అన్ని విమానాల్లోనూ ఈ పరిమిత కాల ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ప్రయాణికులు తాజా ఆఫర్ కింద మార్చి 13–19 వరకు టికెట్లను బుక్ చేసుకుని, ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి వచ్చే ఏడాది జూన్ 5 మధ్యకాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. దేశీ ప్రయాణికులకు బెంగళూరు, కొచ్చి, గోవా, జైపూర్, పుణే, న్యూఢిల్లీ, హైదరాబాద్, వైజాగ్ రూట్లలో, అంతర్జాతీయ ప్రయాణికులు కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, మెల్‌బోర్న్ వంటి రూట్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.