విమానయాన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మిలియన్ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదుచేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500–700 మిలియన్ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను సవరించింది. జెట్ ఎయిర్‌వేస్ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment