ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. ‘మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్‌లైన్‌ను ఇక మరింత పొడిగించే అవకాశాలు లేవు. దీంతో ఇప్పటిదాకా వచ్చిన మూడు సంస్థలతోనే విక్రయ ప్రక్రియ కొనసాగవచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈవోఐలు దాఖలు చేసిన వాటిల్లో రష్యాకు చెందిన రష్యన్ ఫండ్ ట్రెజరీ ఆర్‌ఏ పార్ట్‌నర్స్, పనామాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అవాంట్యులో గ్రూప్, దక్షిణ అమెరికా సినర్జీ గ్రూప్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment