
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ దివాలా విషయంలో జలాన్ కల్‌రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలును నిలిపివేయాలని ఆ విమాన సంస్థ క్యాబిన్, గ్రౌండ్ సిబ్బంది ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించారు. ఈ పరిష్కార ప్రక్రియలో తమ వేతనాలు, రిటైర్‌మెంట్ ప్రయోజన అంశాలు లేవని వివరించింది. తమ వాదనలు విని, తుది తీర్పు వెలువరించేంతవరకూ జూన్‌లో ఎస్‌సీఎల్‌టీ, ముంబై బెంచ్ ఆమోదించిన కల్‌రాక్ కన్సార్షియం రిజల్యూషన్ ప్రణాళిక అమలుపై స్టే ఇవ్వాలని ఎన్‌సీఎల్‌ఏటీని అభ్యర్థించింది. రుణ భారాల్లో కూరు కుపోయిన జెట్ ఎయిర్‌వేస్ రెండేళ్లుగా కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
అద్దె యంత్రాల కోసం సోనాలికా యాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా గ్రూప్ ‘సోనాలికా అగ్రో సొల్యూషన్స్’ పేరుతో యాప్‌ను తీసుకొచ్చింది. వ్యవసాయ రంగానికి అవసరమైన అత్యాధునిక యంత్రాలు, ట్రాక్టర్ల వంటివి అద్దెకిచ్చే వ్యక్తులను ఈ యాప్ ద్వారా రైతులతో అనుసంధానిస్తారు. రైతులు సైతం తమ వద్ద ఉన్న యంత్రాలను అద్దెకు ఇవ్వాలనుకుంటే ఈ యాప్‌లో పేరు నమోదు చేసుకోవచ్చు.