సాక్షి, ముంబై: రుణ సంక్షోభంతో చిక్కుకుని ప్రస్తుతం కార్యకలాపాలను నిలిపివేసిన విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు మరో కీలక ఎగ్జిక్యూటివ్ గుడ్ బై చెప్పారు. తాజాగా జెట్ ఎయిర్‌వేస్ డిప్యూటీ సీఈవో, సీఎఫ్‌వో అమిత్ అగర్వాల్ కంపెనీని వీడుతున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపారు. మే13 నుంచి అమిత్ అగర్వాల్ రాజీనామాను ఆమోదించినట్టు జెట్ ఎయిర్‌వేస్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
అమిత్ అగర్వాల్ 2015, డిసెంబరులో జెట్ ఎయిర్‌వేస్‌లో చేరారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా 24 ఏళ్ల అనుభవం ఉంది. జెట్ కంటే ముందు సుజ్లాన ఎనర్జీ, ఎస్సార్ స్టీల్ లాంటి పలు సంస్థల్లో సీఎఫ్‌వోగా పనిచేశారు.
గత నెల రోజుల కాలంలో నలుగురు కీలక వ్యక్తులు సంస్థను వీడారు. ఇప్పటికే ఇండిపెండెంట్ డైరెక్టర్ రాజశ్రీ పాతీ, అలాగే మాజీ ఏవియేషన్ సెక్రటరీ, కంపెనీ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నసీం జైదీ రాజీనామా చేశారు. వీరికితోడు ఇటీవల పూర్తి కాలపు డైరెక్టర్ గౌరాంగ్ శెట్టి జెట్ ఎయిర్‌వేస్‌కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బోర్డులో రాబిన్ కామార్క్, అశోక్ చావ్లా, శరద్ మిగిలారు.
Comments
Please login to add a commentAdd a comment