న్యూఢిల్లీ: ఇతర కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీ దృష్ట్యా.. తాము కొత్తగా తయారు చేసిన ఎఫ్–21 యుద్ధ విమానాల విక్రయానికి సంబంధించి ఏరోస్పేస్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ భారత్‌కు ఓ ఆఫర్ ఇచ్చింది. 114 ఎఫ్–21 విమానాల కొనుగోలుకు కనుక భారత్ ఆర్డర్ ఇచ్చిన పక్షంలో.. తమ యుద్ధ విమానాలను మరే ఇతర దేశానికి అమ్మబోమని స్పష్టం చేసింది. ఆయుధాలను తీసుకెళ్లగలిగే సామర్థ్యంతో పాటు అత్యుత్తమమైన ఇంజిన్, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ వంటి పలు ప్రత్యేకతలు కలిగిన ఈ విమానాన్ని దేశవ్యాప్తంగా ఉన్న 60కి పైగా వైమానిక కేంద్రాల నుంచి నడపగలిగేలా డిజైన్ చేసినట్లు కంపెనీ వైఎస్ ప్రెసిడెంట్ వివేక్ లాల్ చెప్పారు. 18 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ.1,27,000 కోట్లు) విలువైన 114 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత వైమానిక దళం గత నెలలో సమాచార విజ్ఞప్తి (ఆర్‌ఎఫ్‌ఐ) లేదా ప్రాథమిక టెండర్ జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment