మాస్కో: అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ రష్యా, అమెరికా మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తమ దేశ సరిహద్దులోకి వచ్చిన అమెరికాకు చెందన బాంబర్ విమానాలను రష్యా అడ్డుకుంది. దీంతో, రెండు దేశాల మధ్య ఘర్షణ మరోసారి మొదలైంది.
వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన బాంబర్ విమానాలు తమ దేశ సరిహద్దు సమీపంలోకి వచ్చాయని రష్యా ఆరోపించింది. తమ సరిహద్దుకు సమీపించిన రెండు వైమానిక విమానాలను తమ ఫైటర్ జెట్లతో అడ్డుకున్నామని రష్యా రక్షణశాఖ వెల్లడించింది. వాటిని అమెరికా వాయుసేనకు చెందిన బీ-52హెచ్ వ్యూహాత్మక బాంబర్లుగా తమ సైన్యం గుర్తించిందని తెలిపింది. ఆర్కిటిక్‌లోని బారెంట్స్ సముద్రంలో ఈ పరిణామం చోటుచేసుకుందని వెల్లడించింది.
BREAKING 🇷🇺⚡🇺🇸 Russia said Sunday that it scrambled fighter jets to prevent two US strategic bomber planes from crossing its border over the Barents Sea in the Arctic.
“As the Russian fighters approached, the American strategic bombers corrected their flight course, moving away… pic.twitter.com/5kjGYWndfM— Lou Rage (@lifepeptides) July 21, 2024
ఇదిలా ఉండగా.. అమెరికా మాత్రం రష్యా ఆరోపణలను ఖండించింది. అంతర్జాతీయ జలాల మీదుగా విమానాలతో గస్తీ నిర్వహిస్తుండటం సాధారణ ప్రక్రియేనని పేర్కొంది. తటస్థ గగనతలంలో వీటిని చేపట్టామని, అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే నడుచుకున్నామని స్పష్టం చేసింది. దీంతో, రెండు దేశాల మధ్య మళ్లీ మాటల యుద్ధం ప్రారంభమైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో అమెరికా పట్ల రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై దాడుల సమయంలో నుంచి బైడెన్, పుతిన్ మధ్య పరోక్షంగా వార్ నడుస్తూనే ఉంది. ఇక, రష్యాపై అమెరికా ఆంక్షలు కూడా విధించింది.
Comments
Please login to add a commentAdd a comment