
లోహ విహంగాల మరుభూమి!
వరుసగా నిలబడి హొయలు పోతూ ర్యాంప్‌వాక్‌కు సిద్ధమైన మోడళ్లలా కనిపిస్తున్నాయి కదూ ఈ విమానాలు..! ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద విమానాల శ్మశాన వాటిక..! అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో బోన్‌యార్డ్ అమెరికా రక్షణ రంగంలో ఎన్నో సేవలందించి కాలం చెల్లిపోయిన యుద్ధవిమాలను ఇక్కడికి చేరుస్తారు. ఇది దాదాపు 2,600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఏ10 థండర్ బోల్ట్‌లు, హెర్క్యులెస్ ఫ్రైటర్స్, ఎఫ్-14 టామ్‌క్యాట్ ఫైటర్స్ వంటి గొప్ప విమానాలు ఇక్కడకు చేరుకున్నాయి. వీటి విలువ మొత్తం దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పైమాటే. కొన్నింటికి మరమ్మతులు చేసి మళ్లీ ఎగిరేలా చేస్తారు. కొన్నింటి విడి భాగాలను కొత్తగా తయారు చేసే విమానాలకు అమర్చి తయారీ ఖర్చును తగ్గించుకుంటారు.