యుద్ధ విమానాలు, పౌర సేవలు అందించే విమానాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రత్విశాఖ హెచ్చరించింది. ఈ విమానాలపై రసాయన దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తమకు నిఘావర్గాల ద్వారా సమాచారం అందినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ఎయిర్‌పోర్టుల్లో భద్రతా వ్యవహారాలను చూసే అధికారులను అప్రమత్తం చేసింది. అలాగే, ఎయిర్‌పోర్ట్‌లోకి అనుమతించేసమయంలో మరింత క్షుణ్ణమైన తనిఖీలు చేయాలని కోరింది.