
టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా లండన్‌లో చిల్ అవుతున్నాడు

ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్ డివిజన్-2 తాజా ఎడిషన్‌లో పాల్గొనేందుకు ఈ ముంబై బ్యాటర్ అక్కడకు వెళ్లాడు

ఈ దేశీ రెడ్‌బాల్ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ జట్టుకు పృథ్వీ ప్రాతినిథ్యం వహించాడు.

తాజాగా పృథ్వీ పేరు నెట్టింట వైరల్ అవుతోంది

అయితే, ఈసారి ఆటతో కాకుండా వ్యక్తిగత విషయాలతో అతడు తెరమీదకు వచ్చాడు

నటి నిధి తపాడియా పృథ్వీ షాను కోట్ చేస్తూ.. ‘బెస్టీ’తో ఇలా అంటూ ఇన్‌స్టా స్టోరీ షేర్ చేసింది

అంతకు ముందు పృథ్వీ షా సైతం నిధి పుట్టినరోజు(సెప్టెంబరు 12)న ఆమెతో సన్నిహితంగా దిగిన ఫొటోను పంచుకున్నాడు

‘‘నాకు ఎల్లవేళలా మద్దతుగా నిన్ను తోడుగా కలిగి ఉండటం నా అదృష్టం’’ అంటూ పోస్ట్ చేశాడు

ఈ నేపథ్యంలో పృథ్వీ- నిధి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.

కాగా నార్తంప్టన్‌షైర్ తరఫున వన్డే కప్.. ఎనిమిది ఇన్నింగ్స్ ఆడి 343 పరుగులతో ఫర్వాలేదనిపించాడు పృథ్వీ షా

అయితే, కౌంటీల్లో మాత్రం రాణించలేకపోయాడు

ఈ రెడ్‌బాల్ టోర్నీలో తొమ్మిది ఇన్నింగ్స్ ఆడి కేవలం 164 పరుగులు చేశాడు





