Chills
-
‘గర్ల్‌ఫ్రెండ్’తో లండన్‌లో టీమిండియా ఓపెనర్.. ఫొటోలు వైరల్
-
బీచ్‌లో ప్రియుడు గౌతమ్‌తో రచ్చచేస్తున్న బిగ్ బాస్ 'ఇనయా సుల్తానా' (ఫోటోలు)
-
నిక్కరు
కొంకణీ మూలం : వశంత్ భగవంత్ సావంత్ అనువాదం: శిష్టా జగన్నాథరావు రాత్రవుతున్న కొద్దీ అతిథులు రావడం కూడా పెరుగుతోంది. బయట కొరికేసే చలి. జాతరకొచ్చిన జనం గుంపులు గుంపులుగా చట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. చాలామంది మండపంలో గుమిగూడి జాతరలో దేవుడి వస్తువుల వేలం త్వరగా పూర్తవ్వాలని హడావుడి చేస్తున్నారు. కేశవ్ మామ టీకొట్టు ఎదురుగా ఉన్న స్తంభానికి ఆనుకుని నేను ఎవరైనా నా స్కూలు మిత్రులు కనిపిస్తారేమోనని ఎదురు చూస్తూ నిలుచున్నాను. జాతర ఆఖరి రోజవడం వలన ఊళ్లో వాళ్లంతా మూకుమ్మడిగా వచ్చారు. నాకెంతో ఇష్టమైన ఈ జాతర ఏడాదికొకసారి వస్తుంది. ఈ ఏడాది మాత్రం నా ఉత్సాహం ఎండిపోయింది మనస్సులోనే. కారణం ఈసారి అమ్మ నన్ను కేశవ్ మామ జాతరలో పెట్టిన టీ దుకాణంలో ఉంచి, ఆయనకి సహాయం చేయమని పురమాయించింది. నిజం చెప్పాలంటే ఈ కేశవ్ మామని చూస్తేనే నాకు చిరాకేసేది. ఈ జాతర మూడు రాత్రులు మమ్మల్ని గద్దలా పొడిచి, పొడిచి చంపుకుతిన్నాడు. చలికి వణుకుతున్న జనం, ఆ వణుకు తగ్గడానికని చాయ్ కోసం మా కొట్టులో జమవుతున్నారు. అందువల్ల మాకు బొత్తిగా విశ్రాంతి లోపించింది. కేశవ్ మామ టీకొట్టులో పనిచేసే భట్టీవాడు, టీ ఇచ్చే సర్వరు ఇద్దరూ మామని చాటుగా నానాబూతులు తిట్టేవారు. అయితే ఆయన ముందు మాత్రం పల్లెత్తుమాట అనకుండా అడ్డమైన చాకిరీ చేసేవారు. మూడు రాత్రులు నిద్రలేకుండా పనిచేయడం వలన నా కళ్లు గుడ్లగూబ కళ్లల్లా అయ్యాయి. రెండు కాళ్లు పీకుతున్నాయి. ఎప్పుడు కాస్త నడుంవాల్చి విశ్రాంతి తీసుకోగలుగుతానా అని ఎదురుచూస్తున్నాను. ‘‘డిగూ.. ఒరేయ్ డిగూ.. లోపల ఆ ఖాళీ గ్లాసులెవరు తీస్తార్రా? మీ నాన్న వస్తాడ్రా కడగడానికి? గొప్పగా షావుకార్లా నిల్చున్నావు ఆ కొయ్యపట్టుకుని. నడు... తొరగారా లోపలికి. ఆ గ్లాసులు కడుగు.. ముందు ఆ ప్లేట్లు చూడు’’.మావ నా మీద ఇంకా శాపనార్థాలు కురిపించేలోగా, ఆయన రుసరుసలని లక్ష్యపెట్టక నేను వెనకదారిలో వచ్చి గ్లాసులు కడగసాగాను. మూడు రాత్రులు రెండు గ్లాసులు బద్దలుకొట్టానని, నేను అప్పటికే రెండు తన్నులు తిన్నాను. నాకు పూర్తిగా విసిగెత్తింది.అన్ని గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు అక్కడే విసిరేసి హాయిగా జాతరలోకి పోయి మండపంలో స్నేహితులతో కూర్చుని పిచ్చాపాటి మాటల్తో, చక్కగా నాటకం చూడాలని మనసు ఉవ్విళ్లూరింది. కానీ ఏం చేస్తాను? అమ్మ నన్ను కోప్పడుతుందని భయమేసి, ఆ ఆలోచన వదులుకొన్నాను.ప్రతి ఏడాదీ ఇలాగే కేశవ్ మావ జాతరలో టీకొట్టు పెడతాడు. కానీ నాకు ఈసారే తెలిసింది. అతను నాకు మావని. అతని వ్యాపారమే అదిట. వివిధ జాతర్లలో తిరగడం. ఏ ఊళ్లో ఏ జాతర జరిగినా అక్కడ మావ టీ హోటలు డేరా వెలుస్తుంది. ఈ హడావిడిలో పనితొందర్లో ఎప్పుడూ ఆయనకి, తన చెల్లెల్ని (అంటే మా అమ్మని) చూడడానికి వీలవలేదట. కానీ ఈ సారి మాత్రం జాతర ప్రారంభం అవడానికి ముందురోజే మా ఇంటికి వచ్చాడు. ఆయన నా మావ అనీ, జాతరలో దుకాణం పెడ్తున్నాడనీ విని, ఆశ్చర్యం ఆనందాలతో ఈ విషయం నా తోటి మిత్రులకి చెప్పడానికి నేను వాడలోకి పరిగెత్తాను.నేను తిరిగి, తిరిగి ఇంటికి చేరిన తర్వాత కేశవ్ మావ గుడికి వెళ్తానని చెప్పి బయటకి వస్తున్నాడు. మావ తెచ్చి ఇచ్చిన పిప్పరమెంట్ల పొట్లం నాకు ఇస్తూ అమ్మ ఇలా అంది – ‘‘డిగూ, మావ నీకు లాగు కుట్టించుకోడానికి కొత్త బట్ట ఇస్తానన్నాడు’’.‘‘నిజంగానా?’’ అని నేను నా వెనక చిరిగిన లాగు తడుముకుంటూ అన్నాను. ‘‘అవును, నిజం. కానీ నువ్వు ఆయనకో పని చెయ్యాలట.’’‘‘ఎటువంటి పని?’’ నేను ఉత్సాహంతో ఊరటతో అడిగాను.‘‘మావ చాయ్ కొట్టులో ఇద్దరు పనివాళ్లు ఆరోగ్యం బాగులేనందువల్ల రాలేదట. అందుకని జాతర ఉన్న మూడు రోజులు నువ్వు అతనికి సహాయంగా ఆ టీకొట్టులో పనిచేయాలి’’ అమ్మ నన్ను బుజ్జగిస్తూ చెప్పింది.‘‘వద్దు.. వద్దు.. నేను ఎంచక్కా జాతరలో తిరగాలి మిత్రులతో కలిసి!’’‘‘ఇదిగో విను – నువ్వు తెలివైన నా బంగారు కొడుకువి కదూ, ఈ మధ్య నీకు నేను కొత్త బట్టలు కుట్టించలేకపోయాను. నీ ముడ్డి దగ్గర చిరిగిన పట్లంతో జాతరలో తిరుగుతావా ముష్ఠివాడిలా? నీ మిత్రులునవ్వరా నిన్ను చూసి? అయినా జాతరలో ఏముందిరా, ప్రతీ ఏడాది వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ దుకాణంలో పనిచేస్తే, ఎంచక్కా నీకు కొత్త లాగు వస్తుంది.’’అమ్మకి ఎలా నచ్చజెప్పాలో నాకు తెలియలేదు. చివరికి ఒప్పుకున్నాను. నా జుత్తుని వేళ్లతో ప్రేమగా నిమురుతూ అమ్మ అంది – ‘‘ఇదిగో చూడు, నువ్వు మావ దుకాణానికి వెళ్లు. నేను చెప్పాను మీ మావకి నువ్వు వస్తావని. పని కాస్త వొళ్లు దగ్గర పెట్టుకుని చెయ్యి. నీ మావ కాస్త కోపిష్ఠి. అతనికి సహనం తక్కువ. నీ మీద ఏ కారణం వల్లనైనా విరుచుకుపడితే నిరాశపడకు. ఈ జాతర్లలో రాత్రిళ్లు ఎప్పుడూ జాగరణ చెయ్యడం వలన అతనిలో శక్తి, సహనం పోయాయి.’’ నేను సరేనని అన్నట్లు తల ఆడించాను. అమ్మ మళ్లీ అంది – ‘‘నీకు తెలియదురా. నీ మావకి ఎన్నో పనులు అడ్డమైన వ్యవహారాల్లోనూ తల దూరుస్తాడు. ఇక్కడి వస్తువులు అక్కడికీ, అక్కడివి ఇక్కడికీ వాణ్ని వంచించడం, వీణ్ని కాళ్లు పట్టుకుని వేసుకోవడం ఇటువంటి తిమ్మిని బమ్మిని చేసే వక్రబుద్ది వాడిది. డబ్బే వాడి దైవం. డబ్బు ముందు మనవాళ్లు, పరాయివాళ్లు అని అంతరం చూపడు. ఎవర్నీ లెక్కచెయ్యడు. ఇన్నేళ్లుగా జాతరలో దుకాణం పెడుతున్నాడు అయినా ఒక్కసారీ, ఈ ఊరికి వచ్చినప్పుడు వాడికి నన్ను చూడాలని తోచలేదు. మనింటికి రాలేదు. ఈసారి మాత్రం వచ్చాడు. ఎందుకనీ? పనివాళ్లు తక్కువైనందువల్ల. నిన్ను మేనల్లుడిని ఆ మురికిపనిలో దింపడానికి.’’అమ్మ కళ్లంబడి అశ్రువులు వచ్చాయి. అప్పుడామె చెప్పిన మాటలు నాకు సరిగ్గా అర్థమవలేదు. కానీ రెండు రాత్రులు కేశవ్మావ టీ కొట్టులో కొట్టుమిట్టాడాక ఆ త్రాస్టుడి కుటిల స్వభావం బాగా తెలిసింది. టీ ఒకసారి చేసాక, మళ్లీ అదే పొడితో మళ్లీ మళ్లీ టీ చేయమని వంటవాడికి ముందే పురమాయించి వాడు మరచినప్పుడు, మండిపడి కోప్పడేవాడు. శేరు పాలల్లో మరో శేరు నీళ్లు కలిపేవాడు. ఆ టీలో రుచిపచీ లేదు. ఒట్టి వేడినీళ్లు. కొద్దిగా పంచదార ఎక్కువ పడితే ఆ వంటవాడి ముడ్డిమీద పడిందనుకో దెబ్బ! జనం గోలచేసేవారు. కానీ మావ వాళ్లేమన్నా పళ్లు ఇకిలిస్తూ నవ్వేవాడు. ఏమాత్రం లజ్జ లేకుండా! జాతరలో మరెవ్వరి చాయ్ దుకాణం లేనందువల్ల మావ కొట్టులోనే జనాలు ఉండేవారు. మావ మానవత్వం ఇసుమంతైనా చూపించకుండా తన వ్యాపారం కొనసాగించేవాడు. అతని కుటిల స్వభావం, కుత్సిత బుద్ధి, పాడు పనులు చూశాక అతనంటే నాకు ఏహ్యభావం కలిగేది. అతన్ని చూడాలంటేనే అసహ్యం వేసేది. హోటల్లో గిరాకీదారులుండగా, అందరి ముందు మావని తూర్పారబెట్టి, అవమానం చేసి ఆ పని విడిచిపెట్టి పారిపోవాలని నాకు క్షణక్షణం అనిపించేది. కానీ అమ్మ ప్రేమతో చెప్పిన మాటలు గుర్తుకువచ్చి, ఆ ఆలోచనకీ, నా కాళ్లకి బంధాలు తగిలేవి.గ్లాసులు, సాసర్లు కడుగుతూ ఉండగా, నా చెవుల్లో బయట జాతరలో లౌడ్‌స్పీకర్ మీద దేవుడి వస్తువుల వేలంపాట వినపడుతోంది. ‘‘ఆఖరి బేరం.. దేవుడి చరణాల మీద పూల దండ.. ఇరవై ఒక్క రూపాయలు... మూడవసారి....’’ వేలం పాట ముగియగానే, ఆ వేలంపాట పాడినవాడు ఉస్సూరుమని నిట్టూర్చాడు. పెద్ద కార్యం పూరై్తందని. కానీ నాకూ ఆ వంటవాడికీ, టీనీళ్లు గిరాకులకి ఇచ్చే పనివాడికీ మాత్రం విశ్రాంతి లేదు. హఠాత్తుగా దుకాణంలో రద్దీ తగ్గింది. నాటకం ప్రారంభమవుతుందని తెలిసి పరుగుపరుగున డబ్బులు గల్లా మీద విసిరేసి వెళ్లిపోయారు. గడియారంలో టైమ్ చూసి మావకి ఒళ్లుమండింది. మావ మండిపడ్డం చూసి నిజం చెప్పాలంటే నాకు భలే భలే అనిపించింది. ఈ మనిషి ఇలాగే జీవితాంతం ఏడుస్తూ చావాలని మనసులోనే శాపనార్థాలు పెట్టాను. వంటవాడు చక్కటి, చిక్కటి టీ నాకోసమని చేసి మావ చూడకుండా గ్లాసు నా చేతికిచ్చి తాగమని రహస్యంగా సంజ్ఞ చేశాడు.మావ గల్లాపెట్టెలో నోట్లు లెక్కపెడుతున్నాడు. నేను ఒక కుర్చీలో కూర్చుని నోట్లు లెక్కపెట్టడం చూస్తున్నాను. తడి చేసిన నాలికని వేలుతో మధ్య మధ్య తాకుతూ, ఏకాగ్రదృష్టితో అతి జాగ్రత్తతో లెక్కపెడుతున్నాడు. అలా లెక్కపెడుతూ తలెత్తి నన్ను చూసి హఠాత్తుగా కోపంతో కేకలేశాడు – ‘‘నువ్వేం చేస్తున్నావురా? నడు, త్వరగా ఆ ఎంగిలి గ్లాసులన్నీ కడుగు. సర్ది పెట్టు. లెక్కపెట్టు ఎన్ని విరిగాయో, ఎన్ని మిగిలాయో’’.నేను అన్ని గ్లాసులు, సాసర్లు కడిగాను. వాటిని సర్దిపెట్టి, భట్టీ దగ్గరకెళ్లి చలితో కొంకర్లుపోయిన చేతుల్ని వెచ్చచేసుకోసాగాను. చేతుల్లో కరెన్సీనోట్లు మరోసారి లెక్కపెట్టి మావ నన్ను పిలిచాడు. నాకనిపించింది. ఇప్పుడు మావ నాకు ప్యాంట్ కుట్టించుకోవడానికి బట్టకోసం డబ్బులు ఇస్తాడని. నేను గల్లాపెట్టె దగ్గర చేరగానే మావ అన్నాడు – ‘‘నువ్వు కాస్త ఈ గల్లాపెట్టె దగ్గర కూర్చో కాసేపు’’ అని. నన్ను అక్కడ కూర్చోబెట్టి, లోపల ఉంచిన ట్రంక్‌పెట్టె తెరిచి డబ్బులు పెట్టసాగాడు. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుంటే, నాకు ఏనుగెక్కినంత ఆనందమైంది. నేను ఇలా కూర్చునుండగా నా మిత్రులెవరైనా చూస్తే బాగుంటుందని సంబరపడ్డాను. కానీ కళ్లకెవరూ కనిపించలేదు.మావ నోట్లన్నీ తీసుకెళ్లాక, గల్లా పెట్టెలో చాలా చిల్లర మిగిలింది. ఎంత చిల్లరంటే, నేను ఎప్పుడూ దేవాలయంలో దేవుడి ముందు పళ్లెంలో కూడా చూడలేదు. అంత చిల్లర! నేనా చిల్లరలో నా చెయ్యి పెట్టి, కెలుకుతూ చప్పుడు చేశాను. ఆ చప్పుడు విని నా ఒళ్లు ఝల్లుమంది. నేను నా దోసిట్లో వచ్చినంత చిల్లర తీసుకుని పైకెత్తి గడగడలాడించి, మళ్లీ లోపల పడేశాను. మూడు రాత్రుల జాగరణ ఉండి ఆ హోటల్లో చేసిన పని అలసట ఆ చప్పుడుతో అదృశ్యమైపోయినట్లు నాకనిపించింది. నాటకం మొదటి అంకం పూర్తవగానే నలుగురైదుగురు వ్యక్తులు టీ తాగడానికి దుకాణంలోకి వచ్చారు. వాళ్లు టీ తాగాక, నేను హుందాగా బెల్లు వాయించి బిల్లు ఎంతైందని పనివాణ్ని అడిగాను. వాళ్లిచ్చిన నోటు తీసుకుని బాకీ చిల్లర తిరిగి ఇచ్చాను.లోపటి నుంచి మావ అరిచాడు – ‘‘సరిగ్గా బిల్లు వసూలుచేశావట్రా?’’ అని.‘‘హా.. చేశాను’’ నేనూ గంభీరంగా జవాబిచ్చాను.‘‘సీతారామ్..’’ వంటవాడిని ఉద్దేశించి మావ గట్టిగా అన్నాడు. ‘‘రేపు, ఎల్లుండీ కామర్ఖండ్ జాతరకి వెళ్తున్నాం. నాటకం మూడవ భాగం పూర్తవగానే సామాన్లు అన్నీ సర్దేసి, మూటలు కట్టి, ఆతర్వాతే పడుకోవాలి. తెల్లవారుజామున పికప్ వ్యాన్ వస్తుంది. డేరా ఎత్తేసి వెంటనే వెళ్లిపోవాలి. వింటున్నావా?’’సీతారాం.. అవును అనలేదు, కాదు అనలేదు.మావ చిన్న మేజామీద లెక్కలు రాసుకుంటున్నాడు. నేను పావలా కాసులు, అర్ధరూపాయి బిళ్లలూ ఏరి ఒకదానిమీద ఒకటి పేర్చి నిటారుగా అమర్చాను. నేను గల్లాపెట్టె దగ్గర కూర్చుని ఉండడం చూసిననా క్లాసు మిత్రులిద్దరు నా ముందరికి వచ్చి నన్ను పలకరించారు. నేను వాళ్లని చూసి హుందాగా అడిగాను, ‘‘టీ తాగుతార్రా?’’. వాళ్లు తాగుతామని తల ఊపుతూ సూచించారు. ‘‘సీతారాం, ఇక్కడ రెండు చక్కటి, చిక్కటి టీలు తీసుకురా’’ అని నేను హుందాగా, దర్జాగా ఆర్డర్ ఇస్తూ బల్ల మీద బెల్లు వాయించడానికి చేయి చాపితే, ఆ చెయ్యి తగిలి నిలువుగా పేర్చిన నాణేలన్నీ ఖంగున నేలమీద పడిపోయాయి. ఇంతవరకూ నా చేతలు చూడని మావ వెంటనే లేచి పరుగున వచ్చి చిల్లరంతా ఏరి గల్లాపెట్టెలో వేశాడు. నన్ను ఓ మూలకి తీసుకెళ్లి నా జేబులన్నీ జాగ్రత్తగా వెతికి, నా చెవి మెలేసి అన్నాడు కోపంగా.. ‘‘మీ అబ్బ సొమ్మనుకున్నావురా ఇది? డబ్బుల దగ్గర ఆటలాడుతావు? కాస్త గల్లాపెట్టె దగ్గర కూర్చోగానే డబ్బు నిషా ఎక్కింది కదూ? చాలు చాలు.. పక్కకి తప్పుకో’’. మావ నన్ను తోసేసి, మూలకి గెంటాడు. నా మిత్రులు నారాయణ, బీకు బెదిరిపోయి బయటకెళ్లిపోయారు. నా ఒళ్లు మండిపోయింది కోపంతో. ఒక కుర్చీ ఎత్తి మావ నెత్తిమీద గట్టిగా పడేసి, రక్తం కారేలా చూడాలని క్షణంసేపు అనిపించింది.‘‘నా లాగు బట్టకోసం డబ్బులియ్యి’’ కోపం పట్టలేక గట్టిగా అన్నాను.‘‘ఆ.. డబ్బులా? రేపొద్దున్న మీ అమ్మకి ఇస్తాను’’ మావ తాపీగా అన్నాడు.‘‘రేపు వద్దు.. నాకు ఇవాళే ఇప్పుడే కావాలి.’’‘‘ఇప్పుడే కావాలా? సరే ఇప్పుడే నీ చెవి మెలేసి ఓ లెంపకాయ ఇస్తాను’’ అలా అంటూనే మావ నాకో లెంపకాయ ఇచ్చాడు. జాగరణతో నిద్రలోపించిన నా కళ్లల్లో హఠాత్తుగా చీకట్లు చిమ్మాయి. ఆ దెబ్బతో నేను పరిగెత్తి నాటకం ఆడుతున్న మండపంలోకి వచ్చిపడ్డాను. నాటకం చూస్తూ, చూస్తునే నిద్రపోయాను. ఎప్పుడు నాటకం పూర్తయిందో ఎవరికి తెలుసు! అమ్మ నన్ను తట్టి లేపినప్పుడు కళ్లు తెరిచాను. మధ్యాహ్నం అయ్యింది. నాలాగే నలుగురైదుగురు కుర్రాళ్లు మండపంలో పడుకొని ఉన్నారు.‘‘మావ నీకు నిక్కరు బట్టకోసం డబ్బులిచ్చాడ్రా?’’ అమ్మ ప్రేమతో నిమురుతూ చెవిలో అడిగింది. ‘‘లేదమ్మా! నీకు ఇస్తానన్నాడమ్మా. నీకూ ఇవ్వలేదన్నమాట!’’ నేనన్నాను.అమ్మ ఇవ్వలేదని తలాడించింది.నేను మావ టీ దుకాణంవైపు చూశాను. సామాన్లన్నీ తీసుకుని మావ ఎప్పుడెళ్లిపోయాడో ఎవరికి తెలుసు? డేరా – బురా ఏం లేదక్కడ. పిడకలతో, బొగ్గులతో నిండిన ఒక భట్టీ మాత్రం వదిలేసివుంది, అక్కడ ఒక దుకాణం ఉండేదన్న గుర్తుగా. మరే విధమైన గుర్తులేదు.‘‘మావ పెద్ద మోసగాడు’’ నేను ఏడుపు గొంతుకతో అన్నాను.‘‘వాడి పని గొడవలో నీ సంగతి బహుశా మరచిపోయి ఉంటాడు’’ అంటూ నడవసాగింది అమ్మ. మావ చాయ్ దుకాణం పెట్టిన స్థలంవైపు కన్నెత్తి కూడా మళ్లీ చూడకుండా నా చిరిగిన లాగు మీద చిరుగుని అరచేతితో కప్పుకుంటూ నేనూ అమ్మవెంబడే ఇంటివైపు నడవసాగాను. -
సూర్యుడిలో మార్పులతోనే వణికించే చలి!
యూరప్‌ను చలి వణికించేస్తోంది. ఆస్ట్రేలియా, అమెరికాలలోనూ అసాధారణ రీతిలో మంచు కురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదంతా వాతావరణ మార్పుల ప్రభావమని చాలామంది అంచనా వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు మాత్రం ఈ విపరీత ధోరణులకు, వాతావరణ మార్పులకూ సంబంధం లేకపోవచ్చునని.. సూర్యుడిపై జరుగుతున్న కార్యకలాపాల్లో వచ్చిన మార్పులు కారణమని అధ్యయన పూర్వకంగా తేల్చారు. భూమి మీద సకల జీవరాశులకూ వెలుతురునిచ్చే సూర్యుడిపై అప్పుడప్పుడూ పేలుళ్లు జరుగుతూంటాయని.. పదకొండేళ్లకు ఒకసారి ఈ క్రమంలో మార్పులు వస్తాయని మనకు తెలుసు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సూర్యుడిపై కార్యకలాపాలు మందగతికి చేరుకున్నాయని.. ఫలితంగా ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో కొంచెం వెచ్చదనం ఏర్పడగా యూరేసియా ప్రాంతంలో మంచు కురుస్తోందని ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త డాక్టర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. భూతాపోన్నతితోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమయ్యేందుకు అవకాశం ఉన్నప్పటికీ సూర్యుడి ప్రభావాన్ని మాత్రం వేరుగా స్పష్టంగా గమనించవచ్చునని ఇంద్రాణి తెలిపారు. సూర్యుడిపై పేలుళ్ల కారణంగా ఏర్పడే మచ్చలు సాధారణం కంటే తక్కువైనప్పుడు ఆర్కిటిక్ ప్రాంతంలో వెచ్చదనం దిగువ స్ట్రాటోస్ఫియర్ నుంచి ఎగువకు విస్తరిస్తుందని, మచ్చలు సగటు కంటే ఎక్కువగా ఉంటే ఆర్కిటిక్ ప్రాంతంలో శీతల పరిస్థితులు ఏర్పడతాయని ఇంద్రాణి వివరించారు. ఈ పేలుళ్ల కారణంగా సూర్యుడి నుంచి అందే అతినీలలోహిత కిరణాల సామర్థ్యంలో మార్పులు వస్తాయని, ఇది కాస్తా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుందని చాలాకాలంగా బలమైన అంచనాలు ఉన్నాయి. -
హరోం హరా..
ఊరు.. వాడ.. కొండ.. కోన.. పులకించే పండుగ శివరాత్రి. ఊరూరా ప్రభలు కట్టడం ఈ పండుగ ప్రత్యేకత. పంట ఇంటికి పంటలర వస్తున్న తరుణంలో సంక్రాంతి. ఆ ఆదిదేవుడు దయతో అన్ని పంటలు పూర్తిగా ఇంటికి చేరాక శివరాత్రి. త మను, తమ పంటలను కంటికి రెప్పలా కాపాడిన ఆ భోళాశంకరునికి రైతులు మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయ వాహనాలు, ఎద్దులు, ఇతరపశువులను శివాలయం చుట్టూ తిప్పుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భ క్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా శివయ్య దర్శనానికి తరలివెళతారు. కొందరు భక్తులు రోజంతా ఉపవాసంతో జాగరం చేయడం ఆనవాయితీ. శివరాత్రి నాడు భక్తులు హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ పారవశ్యంతో చేసే శివనామ స్మరణతో చలి శివ..శివా.. అంటూ పారిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రముఖ శివాలయాలు సోమవారం నిర్వహించ నున్న శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి. యనమలకుదురులో శివరాత్రి ఏర్పాట్లు యనమలకుదురు(పెనమలూరు) : నేటి నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి భక్తులు కొండ పైకి వెళ్లటానికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు. ఇతరుల వాహనాలు కొండపైకి అనుమతించరు. మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దీపాలు పెట్టారు. దాదాపు 60 అడుగులు ఎత్తు హనుమంతుడి విగ్రహానికి రంగులు వేశారు. నటరాజస్వామిని తీర్చి దిద్దారు. ఆరు మాసాలుగా చేపట్టిన కొండపై విస్తరణ పూర్తి చేశారు. శివగిరిపై ఉత్సవాలకు సిద్ధం మొగల్రాజపురం : కొండపై (శ్రీ వాగ్దేవీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం) శివగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది.40 అడుగుల ఎత్తు త్రిభుజాకారపు డమరుకం కలిగిన శివలింగాన్ని కొండపై ఏర్పాటు చేశారు. సున్నపుబట్టీల సెంటర్లోని అమ్మ కల్యాణ మండపం నుంచి శివగిరికి దారి ఉంది. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని శివగిరిక్షేత్ర స్థాపకుడు మల్లికార్జునశర్మ తెలిపారు. బలివేలో ఏర్పాట్లు సిద్ధం.. నూజివీడు : ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో రామలింగేశ్వరస్వామి (భలే రామస్వామి) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది. ఆలయం లో రామలింగేశ్వరస్వామి పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తారు. ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఉత్తరవాహినీ ముక్త్యాల.. జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలో భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఏటా ఉత్తరవాహినిలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకిస్తారు. అధికారులు స్నానఘాట్లను శుభ్రం చేయించారు. గ్రామ సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటి లింగాలు) మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు. రామేశ్వరుని ఆలయం ముస్తాబు తోట్లవల్లూరు : శివరాత్రి సందర్భంగా మండలంలోని ఐలూరులో గంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో నీరు లేకపోవటంతో బోర్లు వేయించి జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తారు. అనంతరం రామేశ్వరస్వామి, రఘునాయకస్వామిని దర్శించుకుంటారు. భక్తుల రాకకు పంచాయతీ, దేవాదాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సకల పాప హరణం.. సంగమేశ్వరుడి దర్శనం.. కూడలి(నందిగామ రూరల్): శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు గుర్తొచ్చేది కూడలి తిరునాళ్ల. ఏటా శివరాత్రికి నందిగామ మండలంలోని దాములూరు కూడలిలో సంగమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో స్వామి వెలిశారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది వైరా, కట్టెలేరు ఎండిపోయాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కుంటలు ఏర్పాటుచేశారు. కూడలి తిరునాళ్ల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు తిరునాళ్ల కొనసాగుతుంది. -
సంతాన సాఫల్య చికిత్సకు అతిగా స్పందిస్తే...
హోమియో కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 65. ఆయనకు చాలా సంవత్సరాలుగా ఆస్తమా ఉంది. చలికాలం వస్తే ఆయన బాధలు చెప్పనలవి కాదు. దీనికి హోమియోలో ఏమైనా చికిత్స ఉంటే చెప్పగలరు. - పి.శశాంక్, చీరాల వాతావరణంలో మార్పులు, దుమ్ము, ధూళి, ఘాటైన వాసనలు, పెంపుడు జంతువులు, వాటి వెంట్రుకలు, విసర్జకాలు, పూలమొక్కల నుంచి వచ్చే పుప్పొడి రేణువులు, మస్కిటో రిపెలెంట్స్, వివిధ రకాల స్ప్రేలు, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్స్, జన్యు సంబంధిత కారణాలు ఉబ్బసం రావడానికి కారణమవుతున్నాయి. ఆస్తమా ఎవరిలో చూడవచ్చంటే.. ఆస్తమా ముఖ్యంగా అలర్జీతో బాధపడేవారిలో ఎక్కువగా వస్తుంది. కానీ చాలా వరకు ఈ సమస్య చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. కుటుంబసభ్యులలో ఎవరైనా ఆస్తమాతో బాధపడుతుంటే వారి పిల్లలలో కూడా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు: శ్వాసనాళాలు సంకోచానికి గురికావడం వలన గాలి రవాణాకు ఆటంకం కలిగి దగ్గు, ఆయాసం, ఛాతి బరువుగా ఉండడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడడం, పిల్లికూతలు తదితర లక్షణాలుగా గుర్తించాలి. పిల్లల్లో ఆస్తమా గుర్తు పట్టడం ఎలా? పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఆయాసం ఉంటుంది. పడుకున్నప్పుడు పిల్లికూతలు వస్తుంటాయి. రాత్రివేళ దగ్గు ఉంటుంది. పరిగెత్తినప్పుడు ఎక్కువగా ఆయాసపడతారు. మాట్లాడినప్పుడు ఆయాసపడడం గమనించవచ్చు. నిర్ధారణ: సి.బిపి. ఇ.ఎస్.ఆర్, అబ్సల్యూట్ ఇసినోఫిల్-కౌంట్, ఎక్స్‌రే చెస్ట్, సీటీ స్కాన్, స్పిరోమెట్రి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ మొదలైనవి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు :పెంపుడు జంతువులకు, దుమ్మూ, ధూళికి దూరంగా ఉండటం, శీతలపానీయాలు, ఐస్‌క్రీమ్‌లు తినకపోవడం, ఇంటి పరిసరాలలో ఉండే పార్థినియం మొక్కలను తొలగించి పుప్పొడికి దూరంగా ఉండాలి. హోమియో చికిత్స: హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో ఎలాంటి ఎలర్జీలకు సంబంధించిన ఏ వ్యాధికైనా చికిత్స చేస్తారు. అధునాతన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం ద్వారా అసమతుల్యతకు గురైనటువంటి రోగ నిరోధక శక్తిని సరిచేస్తారు. సమర్థవంతంగా తట్టుకునేలా ఇమ్యూన్ సిస్టమ్‌ను సరిచేసి అన్ని ప్రతికూల పరిస్థితులలో కూడా ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తారు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. చాలా ఎక్కువ ఒత్తిడికి గురిచేసే రంగంలో పనిచేస్తున్నాను. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ వల్ల సిగరెట్ కాల్చడం అలవాటైంది. ఇప్పుడు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సిగరెట్లు కాల్చుతున్నాను. రోజూ రెండు మూడు ప్యాకెట్ల వరకూ సిగరెట్స్ కాల్చుతుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఆయాసం, దగ్గు వస్తోంది. దాంతోపాటు సరిగా నిద్రపట్టడం లేదు. సాధారణ సమస్యే కదా, అదే తగ్గిపోతుందిలే అని పట్టించుకోలేదు. ఇప్పుడు ఉపశమనం కోసం ఎన్ని మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. దగ్గు, ఆయాసం తగ్గకపోగా రోజురోజుకూ మరింత పెరుగుతోంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - మధు, హైదరాబాద్ సిగరెట్లు కాల్చడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సరదాగా ప్రారంభమయ్యే అలవాటు వదులుకోలేని వ్యసనంగా మారి మీ సంతోషాలతో పాటు, మీ ఆరోగ్యాన్నీ సర్వనాశనం చేస్తుంది. మీరు రోజుకు మూడు పాకెట్ల వరకూ సిగరెట్లు కాల్చుతారని తెలిపారు. అంత ఎక్కువగా సిగరెట్లు కాల్చడం మీ ఆరోగ్యంపై చాలా తీవ్రమైన దుష్ర్పభావం చూపుతుంది. ఊపిరితిత్తులు ప్యాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతుక్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలూ వచ్చే అవకాశం ఉటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉంటే సిగరెట్లు కాల్చడం మరీ ప్రమాదకరం. కాబట్టి మీరు వెంటనే సిగరెట్లు కాల్చడం మానేసి వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడి నుంచి ఉపశమనం ఇస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొగతాగడం మానేస్తే మీ ఆరోగ్యానికి అంత మంచిది. డా. పి. నవనీత్‌సాగర్‌రెడ్డి సీనియర్ పల్మునాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ సోమాజీగూడ హైదరాబాద్ ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 26 ఏళ్లు. ఈ నెలలోనే సంతాన సాఫల్యం కోసం చికిత్స తీసుకున్నాను. నాకు కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. డాక్టర్‌ను సంప్రదిస్తే ‘ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్’ అని చెప్పి పెయిన్‌కిల్లర్స్ ఇచ్చారు. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తాయా? - లత, హైదరాబాద్ సంతాన సాఫల్యం కోసం చికిత్స తీసుకుంటున్న సమయంలో శరీరం దానికి అతిగా ప్రతిస్పందించడాన్ని ‘ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్’గా పేర్కొనవచ్చు. మీ విషయంలో డాక్టర్ ఏ రకమైన చికిత్స ప్రక్రియను అవలంబించారు అన్న విషయం మీ లేఖలో లేదు. సాధారణంగా గొనాడోట్రాఫిన్ అనే ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంటుంది. కొందరిలో క్లోమిఫీన్ అనే మందులు వాడుతున్నప్పుడూ ఇలా జరగవచ్చు. కొందరిలో మందు మోతాదు ఎక్కువైనా ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ జరగవచ్చు. సాధారణంగా సన్నగా ఉన్నా లేదా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి సమస్య వచ్చిన మహిళల్లో పొత్తికడుపులో నొప్పి, కడుపు ఉబ్బినట్లుగా కనిపించడం, వాంతులు వంటివి ఒవేరియన్ హైపర్స్టిమ్యులేషన్లో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు. ఈ పరిస్థితి కనిపించినప్పుడు చాలామందిలో ఔట్‌పేషెంట్‌గానే ఉంచి, దీన్ని ఎదుర్కొనవచ్చు. అయితే కొంతమంది మహిళలకు మాత్రం ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సి రావచ్చు. దీనికి పూర్తిగా బెడ్‌రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల కూడా కొన్ని ‘రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే ‘థ్రాంబోఎంబోలిజమ్’ అనే పరిస్థితి ఏర్పడవచ్చు. మీలాంటి పరిస్థితి వచ్చిన వారిలో వారి బరువు, స్కానింగ్, రక్తపరీక్షల రిపోర్టులు పరిశీలించాల్సి వస్తుంది. చాలామందికి చిన్నపాటి చికిత్సలతోనే పరిస్థితి చక్కబడుతుంది. అయితే సంతాన సాఫల్య చికిత్స తీసుకున్నవారిలో ఇలాంటి సమస్య వస్తే... అది మళ్లీ మళ్లీ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువే. కాబట్టి డాక్టర్ మీరు తీసుకునే మందు మోతాదును అడ్జెస్ట్ చేస్తారు. ఒకవేళ మీకు ఐవీఎఫ్ జరుగుతున్నప్పుడు ఈ సమస్య వస్తే మీలో పిండం అభివృద్ధి చెందే అన్ని చికిత్సలనూ ఆపివేసి, చికిత్సను మరో విడత చికిత్సకు (నెక్స్ట్ సైకిల్‌కు) సర్దుబాటు చేయాల్సి రావచ్చు. ఒకవేళ ఈసారే మీకు గర్భం వచ్చి ఉంటే మీ హైపర్‌స్టిమ్యులేషన్ తీవ్రత ఎక్కువవైనా, మీ గర్భం నార్మల్‌గానే కంటిన్యూ అవుతుంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ కె. సరోజ సీనియర్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, నోవా ఐవీఐ ఫెర్టిలిటీ సెంటర్, రోడ్ నెం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మన్యం విలవిల
కనిష్ట ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న గిరిజనులు లంబసింగిలో 0, పాడేరు ఘాట్‌లో1 డిగ్రీ చింతపల్లిలో 3, మినుములూరులో 4 డిగ్రీలు నమోదు ఉదయం 10 గంటల తరువాతే సూర్యోదయం చింతపల్లి: కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో ఏజెన్సీ వాసులు విలవిల్లాడిపోతున్నారు. చింతపల్లి మండలం లంబసింగి, పాడేరు మండలంమినుములూరుతోపాటు మిగతా ప్రాంతాల్లోని వారు వణికించే చలితో నరకయాతన పడుతున్నారు. ఆదివారం పర్యాటక ప్రాంతం లంబసింగిలో సున్నా ,పాడేరు ఘాట్‌లోని పోతురాజుస్వామి గుడి వద్ద ఒక డిగ్రీ, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 3 డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు, అనంతగిరి, అరకుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటలు దాటాకే సూర్యుడు కనిపిస్తున్నాడు. సముద్ర మట్టానికి ఎత్తయిన ప్రదేశం కావడంతో ఏజెన్సీలో ఈ పరిస్థితి అని, జనవరిలో చలితీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డి.శేఖర్ తెలిపారు. ఉత్తర భారతదేశంలో మాదిరి ఇక్కడ శీతల గాలులు వీస్తుండటం వల్ల ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయన్నారు. 2010 డిసెంబరు 19న చింతపల్లిలో అతి స్వల్పంగా 3 డిగ్రీలు నమోదుకాగా, లంబసింగిలో మైనస్ డిగ్రీలు, 2012 జనవరి 14, 15 తేదీల్లో చింతపల్లిలో ఒక డిగ్రీ, లంబసింగిలో మైనస్ 2 డిగ్రీలు నమోదయ్యాయి. మరుసటి రోజయిన 16వ తేదీన చింతపల్లిలో 2 డిగ్రీలు నమోదయ్యాయి. 2013 డిసెంబరు 13న చింతపల్లిలో అతి స్వల్పంగా 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు నమోదయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు 20న చింతపల్లిలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీలు, 21న చింతపల్లిలో 3 డిగ్రీలు, లంబసింగిలో సున్నా డిగ్రీలు నమోదైనట్లు శేఖర్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. ఉదయం 10 గంటలు వరకు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. చలి తీవ్రతతో రాత్రిళ్లు నిద్ర పట్టని దుస్థితి. నెగడులు(చలిమంటలు) వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. పగటి పూట కూడా ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. కాఫీ తోటల్లో పండ్ల సేకరణకు వెళుతున్న వారి పరిస్థితి దయనీయంగా ఉంది. దట్టమైన మంచుతో పర్యాటకులు, వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
పాడేరు ఘాట్ @ 3 డిగ్రీలు
విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సముద్రమట్టానికి మూడువేల పైచిలుకు అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి గిరిజనులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఆదివారం పాడేరుఘాట్‌లోని అతిశీతల ప్రాంతమైన పోతురాజుస్వామి గుడి వద్ద 3డిగ్రీలు, పర్యాటక ప్రాంతం లంబసింగిలో 5డిగ్రీలు, మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 6 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యమంతటా పెద్ద ఎత్తున చలిగాలులు వీస్తున్నాయి.