జొకోవిచ్ శుభారంభం | Djokovic won | Sakshi
Sakshi News home page

జొకోవిచ్ శుభారంభం

Published Mon, Nov 16 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

జొకోవిచ్ శుభారంభం

జొకోవిచ్ శుభారంభం

లండన్: పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ శుభారంభం చేశాడు. ఆదివారం మొదలైన ఈ టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-1, 6-1తో కీ నిషికోరి (జపాన్)పై గెలిచాడు. ఈ సీజన్‌లో జొకోవిచ్‌కిది 79వ విజయం కావడం విశేషం.

అంతేకాకుండా 45 ఏళ్ల ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ చరిత్రలో వరుసగా 15వ విజయం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఈ సెర్బియా స్టార్ గుర్తింపు పొందాడు. గత మూడేళ్లలో జొకోవిచ్‌కే ఈ టోర్నీలో టైటిల్ దక్కింది. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో జొకోవిచ్‌కు నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించినందుకు ట్రోఫీని అందజేశారు. ఈ ఏడాది జొకోవిచ్ 14 టోర్నమెంట్‌లలో ఫైనల్‌కు చేరుకొని పదింటిలో విజేతగా నిలిచాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement